ఉపవాసం & కృతజ్ఞత: ఇఫ్తార్, సహ్రీ భాగ్యాలు
ఈమాన్ లో సగ భాగూ సహనం అని తెలుసుకున్నాము. మిగిలిన సగం (శుకర్) ‘కృతజ్ఞత’. ఇంకా ఉపవాసం మనకు సహనం నేర్పినట్లే, అది‘కృతజ్ఞత’ పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. ఈ రెండూ అల్లాహ్ తఆలా వైపు మన ప్రయాణంలో కీలక నిబంధనలు.
రోజంతా, మన కడుపు ఆకలితో గుర్తిస్తుంది, దీని గురించిన ఒక విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. మనం స్పృహతో గుర్తుంచుకోవాలి.మనకు ప్రతి ఆహారపు ముక్కని మరియు ప్రతి నీటిచుక్కని అందించే వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపి, వారి కొరకు అల్లాహ్ తఆలా తో దుఆ చేయాలి.
మన దైనందిన జీవితంలో మనకున్న భాగ్యాలన్నీ అందరికీ లేవు. దీని గురించి ఆలోచించాం కానీ, లేని దాని గురించి ఆలోచిస్తాం తప్పా, ఉన్న దాంట్లో మనం తృప్తి చెందాం. ఇక దీని విలువ, మన నుండి ఆ భాగ్యం తొలగిపోయినప్పుడు మాత్రమే మనకు ఉన్నదాంట్లో తిరుపతి చెందాల్సింద’ని తెలిసి వస్తుంది. ఉదాహరణకు కడుపు ఎల్లప్పుడూ నిండి ఉండడంతో, మనం చాలా అరుదుగా ఆకలిని అనుభవిస్తాము. అందువల్ల మనం అల్లాహ్ తఆలా యొక్క ఆశీర్వాదాల పరిమాణాన్ని ఒక్క రొట్టె ముక్కలో, అసంఖ్యాకమైన రుచికరమైన పదార్ధాలను ఇచ్చినప్పటికీ కుడా, మనం అతనికి కృతఙ్ఞతలు చెప్పే విషయంలో, అభినందించడంలో విఫులమవుతున్నాము! ఆ విధంగా, మనం ఉపవాసం ఉండి, ఆహారం, పానీయం మరియు చట్టబద్ధమైన సాన్నిహిత్యానికి దూరంగా ఉన్నప్పుడు, అల్లాహ్ తఆలా, మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను మనం గ్రహించాలి. ఆయన మనకు ఈ ఆశీర్వాదాలను ఇవ్వడమే కాకుండా, వాటిని మన కోసం హలాల్ చేసాడు, ఇంకా సరైన ఉద్దేశ్యంతో వినియోగించినప్పుడు, వాటిలో ఆనందంగా పాల్గొన్నందుకు ఆయన మనకు గొప్ప బహుమతిని ఇస్తాడు. తద్వారా మనం, ఆయన పట్ల కృతజ్ఞతతో మన హృదయాలను నింపుకోవాలి.
(షుక్ర్ ) అనేది మూడు రకాలు:
1 ). అల్లాహ్ అనుగ్రహాలను అంగీకరించడం ద్వారా మరియు మన నాలుకలతో ఆయనను స్తుతించడం, ఇది ఒక రకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం అయింది.
2 ) మన హృదయాలను ఆయనకు నమస్కరించడం ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం మరోరకం.
3 ) ఆయనకు విధేయత చూపడానికి మన శరీర భాగాలన్నింటినీ ఉపయోగించడం, దీని ద్వారా మన శరీరాలతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం అవుతుంది.
మన ఆరోగ్యం, భద్రత, సంపద మరియు పిల్లల కోసం మనం అల్లాహ్ తఆలా కు కృతజ్ఞతలు తెలపాలి మరియు ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన రెండు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి: విశ్వాసం మరియు మార్గదర్శకత్వం. ఉపవాసం గురించి ఆయత్ చివరిలో, అల్లాహ్ తఆలా ఇలా ప్రస్తావించారు:
وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٨٥
ఇది మీరు ఉపవాసదినాల సంఖ్యను పూర్తిచేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహ నీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!
కృతజ్ఞత అనేది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, ఎందుకంటే దీని వల్లే మనం మరిన్ని ఆశీర్వాదాలు పొందవచ్చు! దీని గురించి పవిత్ర ఖురాన్ లో, అల్లాహ్ తఆలా ఇలా ప్రస్తావించారు:
وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ ٧
“మరియు మీ ప్రభువు ప్రకటించింది (జ్ఞాపకం చేసుకోండి): ''మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. కాని ఒకవేళ మీరు కృతఘ్నులైతే! నిశ్చయంగా నా శిక్ష ఎంతో కఠినమైనది.''
మనం మరింత మంచి పనులు చేయగల సామర్థ్యంతో ఆశీర్వదించబడాలని మరియు అల్లాహ్ ను ఆరాధించడంలో దృఢంగా ఉండాలని తప్పక ప్రార్థించాలి.
మనం అల్లాహ్ తఆలా తో మరింత మంచి పనులు చేసేందుకు అవకాశం ఇవ్వమని మరియు ఆయన్ను ఆరాధించే తప్పుడు, మనం ధృడమైన సంకల్పనతో చెయ్యాలని కోరుకుంటే, దీన్ని కూడా మనం షుక్ర్ వల్లే పొందవచ్చును. అందుకే షుక్ర్ కి చాలా కీలకమైన పాత్ర ఉంది.
ముఖ్యంగా, రంజాన్ మాసంతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మనం అల్లాహ్ తఆలా కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, మరియు ఎంతో మంది ఉపవాసం మరియు షుక్ర్ చేయకపోయినా కానీ ఉపవాసం ఉండటానికి మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకు, మరియు కియామ్ మరియు ఖురాన్లను బహుమతిగా మాకు ఇచ్చినందుకు మనం కృతఙ్ఞతలు తెలుపుకోవాలి.
అంతేకాక ముఖ్యంగా, రంజాన్ మాసంలో మన మంచి పనులు గుణించడం, పాపాలు క్షమించబడటం మరియు దుఆలు అంగీకరించబడే నెలగా చేసినందుకు మనం అల్లాహ్ తఆలా కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తిరుగుబాటు చేసే మరియు మనుషులను తప్పు దారి పట్టించే దయ్యాలను బంధించి, స్వర్గం యొక్క తలుపులు తెరిచి, నరకం యొక్క తలుపులను మూసివేసినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. మరియు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలసిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి ఏమిటంటే, ఆయన తన కోసం ఉపవాసాన్ని ప్రత్యేకంగా నియమించుకున్నారు మరియు దాని కోసం ఆయన వ్యక్తిగతంగా మనకు ప్రతిఫలం ఇస్తారు. దీని గురించి మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు, ఇంకా ఇది హదీసే ఖుదిసీ కూడానూ. అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ (స) గారు, అల్లాహ్ తఆలా మాటలుగా మనకు అందించినవి. , "ఉపవాసం నా కోసమే, దాని ప్రతిఫలాన్ని నేనే ఇస్తాను!. అల్లాహ్” (ముస్లిం).


