ఖుర్ఆన్: ప్రపంచంలో  ప్రత్యేక విశిష్టత కలిగిన గ్రంథం.

ఖుర్ఆన్

ఖురాన్ దేవుని గ్రంథం :

సర్వమానవాళికి సన్మార్గం చూపించడం కోసం అల్లాహ్ తన ప్రవక్తెన ముహమ్మద్ (సొల్లల్లాహు అలైహి వసల్లం) పై ఎన్మో అద్భుతాలు మహిమలు మరియు సాక్ష్యాధారాలు ప్రసాదించాడు. దీనితో పాటు ఒక మరపు రాని మహాఅద్భుతాన్ని కూడ ఇచ్చాడు దినినే ఖుర్ఆన్ అని పేర్కోంటారు. పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ 23 సంవత్సరాల కాలాన జిబరీల్ (అలైహిస్సలాం) ద్వారా అల్లాహ్ తరుపున ప్రవక్త ముహమ్మద్ (సొల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించింది. అంతిమ దివ్య గ్రంథం అని పేర్కోంటారు.ఇలాంటి పుస్తకం పూర్వం లేదు దాని తరువాత కూడ రాదు.

ఈ గ్రంథం సకల లోకాలను పరి పాలించే వాడైన అల్లాహ్ ది దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దినిలో వుండే పదాలు,వ్యాక్యాలు,భావాలు,వర్ధాలు మరియు సంభాషణాలు మానవ ఆలోచనకి భిన్నం మరియు తట్టలేవు. తన 40వ ఎట వరకు ఏ చోట వెళ్ళకుండ ప్రజల మధ్యలో నిరక్షారాశైన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ (సొల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ గ్రంథం అవతరింపబడినది.

ఖుర్ఆన్ లో ఒక శ్లోకం ఇలా తెలియజెస్తున్నది:

الذين يتبعون الرسول النبي الامي الذي يجدونه مكتوبا عندهم في التوراة و الإنجيل(الاعراف- 157)

“ఈ ప్రవక్తను నిరక్షారాస్యుడైన సందేశహరుణ్ణి అనుసరించేవారు. ఆయన ప్రస్తవన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు,ఇంజీలు గ్రంథాలలో లభిస్తుంది.” ఈ గ్రంథం లో అల్లాహ్ విశ్వాసానికి సంభందించిన సమస్యలు,నీతిభోధనలు,ధర్మశాసనాలు,ధర్మసందేశాలు,హితోపదేశాల,గుణపాఠాలు,విమర్శ,అధిక్షేపణ,భయభక్తులు,శుభవార్తలు,స్వాంతన వచనాలు,నిదర్శనాలు,నిరుపణలు,చరిత్ర గాథాలు మరియు సృష్ఠి నిదర్శనాలను సూచించాడు.”

భూమి లో నివసించె ప్రజల ఋజుమార్గం కోసం అల్లాహ్ తన ప్రవక్తలలో నాలుగు ప్రవక్తలని ఎంచుకొని నాలుగు పుస్తకాలు పంపాడు.(1)జబుర్:దావూద్(అలైహిస్సలాం),(2)తౌరాత్: ముసా (అలైహిస్సలాం) ,(3)ఇన్జీల్ :ఈసా (అలైహిస్సలాం) మరియు(4) ఖుర్ఆన్: ముహమ్మద్ (సొల్లల్లాహు అలైహి వసల్లం) దీనిలో ఖుర్ఆన్ ని చిట్టచవరి గ్రంథం గా ఎంచుకొని ఇది కేవలం ముస్లింల కొరకే కాదు ఈ అనంత సృష్ఠిలో నివసిస్తున్న మొత్తం మానవ జాతి మార్గదర్శకత్వం కోసం అవతరింపబడిన గ్రంథం.ఒక మనిషి తన నిత్యజీవితంలో కావలసిన అన్నీ అంశాలు ను ఈ గ్రంథం లో చెప్పబడ్డాయి. అసలు ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎవరి వివాహమడాలి,ఎవరిని వివాహమాడ కూడదు, తల్లి దండ్రులని ఎలా గౌరవించాలి,పురుషుని భాధ్యత ఏమిటి,స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలి,బంధువుల పట్ల మరరయు అనాధుల పట్ల ఎలా మెలగాలి ఆర్ధిక పరమైన లావాదేవిలు, యుద్ద రంగంలో ను వ్యవహరించవలసిన నియమ నిభందనలు, మానవ దర్శాలు ఇలాంటి మరెన్నో విషయాలను ఇందులో స్పష్టంగ తెలిపబడినాయి.

ఖుర్ఆన్ కూర్పు:

ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఖుర్ఆన్ యొక్క సూక్తులు వహీ వచ్చేటప్పుడు దానిని రాయడానికి ఎందరో సహాబీలు ఉండేవారు. కానీ వాళ్లలో నలుగురే ప్రముఖులు జైద్ బిన్ సాబిత్, ఉబై బిన్ కఅబ్ ముఆజ్ బిన్ జబల్, మరియు ముఆవియ బిన్ అబి సుఫియాన్(రజియల్లాహు అన్హుమ్). ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ప్రపంచం నుంచి వలస వెళ్ళిన తరువాత అబూబకర్ రజియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ లో చోటుచేసుకున్న యమామ యుద్ధంలో హుఫ్ఫాజ్ (ఖుర్ఆన్ పఠించిన వారు) లోనే పేరు ప్రఖ్యాత చెందిన ఏకంగా 70 మంది సహాబీలు వీరమరణం చెందారు. ఈ చేదు వార్త ఉమర్ రజియల్లాహు అన్హు కు జీవించలేదు ఎక్కడ ఖుర్ఆన్  అంతరించిపోతుందని ఆందోళనలో పడి ఖుర్ఆన్ జమ చేయవలసిందిగా అబూబకర్ రజియల్లాహు అన్హు కు తన అభిప్రాయం తెలియజేశారు. అబూబకర్ రజియల్లాహు అన్హు తన నిర్ణయం తీసుకోవడానికి కొంతకాలం వేచి ఉండి తరువాత జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు యొక్క ఆధ్వర్యంలో ఖుర్ఆన్ నీ జమ చేయించారు. ఆ జమ చేసినటువంటి ఖుర్ఆన్ అబూబకర్ రజియల్లాహు అన్హు దగ్గర ఉండేది ఆయన తరువాత ఉమర్ రజియల్లాహు అన్హు దగ్గర ఉండేది ఎప్పుడైతే ఉమర్ రజియల్లాహు అన్హు తన తుది శ్వాస విడిచారు అప్పట్నుంచి ఉమ్ముల్ ముఅ్మినీన్ ఐన హఫ్సాబిన్త్ ఉమర్ రజియల్లాహు అన్ హా దగ్గరకు చేరింది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ లో ఖుర్ఆన్ యొక్క ఖిరాత్లో అనేక పలు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీనిని గమనించిన ఉస్మాన్ రజియల్లాహు హఫ్సా రజియల్లాహు అన్హా దగ్గర ఉండే ప్రత్యేకమైన ఖుర్ఆన్ నీ తెప్పించి దాని యొక్క వేరు వేరు కాపీలను ప్రచురించారు. ఆనాటి ఉస్మాన్ రజియల్లాహు అన్హు కాలంలో ప్రచురించిన టువంటి ఖుర్ఆన్ నే మేమందరం ఈనాడు తిలావత్ చేస్తున్నది.

ఖుర్ఆన్ లిపి :

ఖుర్ఆన్ అవతరించి ఇప్పటికి 1400 సంవత్సరాలు కావస్తోంది. కాని దానిలో ఎలాంటి మార్పు మరియు కూర్పు లేదు. ఖుర్ఆన్ పూర్తిగా అరబ్బీ భాషలో అవతరింపబడినది. దీనిలో ఉండే అరబ్భీ సాహిత్యం ఏ అరబీ పుస్తకం లో లేదు. తేవడం అసహజం. ప్రవక్త ముహమ్మద్(సఅస) యొక్క కాలం మక్కాలో అనేక మంది అరబ్బీ భాషలో చాలా ప్రావీణ్యం కలిగి ఉండేవారు. ఎక్కువగా కవితలు రాసేవారు, చదివేవారు. అందరూ తమతమ సాహిత్యం గొప్ప అని పోటీ పడేవారు. అలాంటి సమయంలో దివ్య గ్రంథం ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ లో ఉన్న సాహిత్యాన్ని చూసి ఆనాటి కవులు మరియు అరబ్బీ భాషలో నైపుణ్యం కలిగిన ముస్లిమ్ తర సమాజం ఆశ్చర్యానికి గురయ్యారు. అరబ్బీ భాషలో మీం(ميم) అనే అక్షరం లేకుండా ఏదైనా పదం లైదా కవిత్వం చెప్పాలంటే అసహజం. కాని దివ్య గ్రంథం ఖుర్ఆన్ ఏకంగా ఓ సూరాహ్ నో ఆ అక్షరం లేకుండా అవతరించేలా అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఆ సూరా సూరతుల్ కౌసర్

إنا أعطيناك الكوثر فصل لربك و انحر إن شانئك هو الأبتر

కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూ ఏటకారం చేస్తూ నిరాకరించారు. ఆసమయం లో అల్లాహ్ ఖుర్ఆన్ లో సవాల్ విసిరాడు.

وإن كنتم فى ريب مما نزلنا على عبدنا فاتوا بسورة من مثله و ادعوا شهداءكم من دون الله إن كنتم صادقين.فإن لم تفعلوا و لن تفعلوا فاتقو النار التي وقودها الناس و الحجارة أعدت للكفرين.

“మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంట ఒక అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి. మా సహచరులందరిని సహన్నైన పొందండి. మారు సత్యవంతు లైతే ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చేయక పోతే నిశ్చయంగా ఎన్నటికి చేయలేరు.భయపడండి, మానవులు రాళ్ళు ఇంధనం  కాగల ఆ అగ్నికి, అవి సత్యతెరస్నారుల కొరకు తయారు చెయ్యబడింది.”

నాటు నుంచి నేటి వరకు చాలామంది ప్రయత్నించినా విఫల ఫలం తప్ప మరేమి అందలేదు. కొంతమంది స్వయంగా రాశారు అది కేవలం హాస్యానికి పరిమితమయ్యింది.

1400 సంవత్సరాల ఘడియలో అరబ్బీ భాష చాలా మారుంది. ఈ భాషలో కొత్త పదాలతో పాటు చాలా మార్పు కూర్పులు జరిగాయి. నాటి ఇమామ్ గజాలీ (ర.హ) పుస్తకాలని పరిశీలిస్తే స్పష్టంగా తారతమ్యం కనిపిస్తుంది. కాని ఈ అరబ్బీ భాషలో ఇంత మార్పులు జరిగిన ఈ భాషలో ప్రావిణ్యం చెందిన వారు చెపపే విషయం ఏమనగా అరబ్బీ సాహిత్యంలో ఔన్నత స్థాయిలోనున్న పుస్తకం దివ్య ఖుర్ఆనే. ఎందుకంటే ఇందులోని భావాన్ని వ్యక్షపరిచే విధానం ఇందులో తెలియజేస్తున్న విషయాలు అక్షరాల కూర్పు పదాల ఉచ్ఛారణ అందులోని మాధుర్యం సృష్టిలో ఉండే ఏ అంశాన్ని వదలకుండా తెలియజేయడం, ఏ పుస్తకంలోనూ చోటుచేసుకోలేదు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter