ఖుర్ఆన్: ప్రపంచ సకల వైజ్ఙానిక శాస్త్రవేత్తలను అవాక్కచేసిన ఒక మహాద్భుత మహిమ
ఖుర్ఆన్: ప్రపంచ సకల వైజ్ఙానిక శాస్త్రవేత్తలను అవాక్కచేసిన ఒక మహాద్భుత మహిమ
ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన మహాద్భుత మహిమ ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తతపై ప్రత్యక్ష సాక్షి. ఈ లోకంలో మానవునికి సంబంధించిన అధికారం, వ్యాపారం, రాజకీయ మరియు సంభందిత విషయాలు ఉన్నాయి.
ఈ పవిత్ర గ్రంథం మొదటి నుంచి చివరి కాలం వరకు ఒక్క పదం కాదు కదా ఒత్తు దీర్ఘాలు కూడా మారలేదు. దాని యొక్క ప్రత్యేకత ఏమనగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమకాలికులలో ప్రముఖ అరబ్బీ సాహిత కారులు కూడా ఖురాన్ యొక్క సవాళ్ళను ఎదుర్కో లేకపోయారు. ఖురాన్ లో అతి చిన్న సూరాల్లాంటి రచన తీసుకురండి అన్న వాళ్లకు వారందరూ తెల్లబోయారు. చివరికి శాయశక్తులా ప్రయత్నం విఫలమైంది. జనాల మధ్య నవ్వుల పాలయ్యారు. ఇప్పటికీ కూడా ఒక చిన్న తప్పును కనుక్కోవడంలో విఫలం అయ్యారు. 'ఈ పవిత్ర గ్రంథం ఖురాన్ మానవ రచనని వేలెత్తే వారికి ఇది ఒక సజీవ సమాధానంగా మిగిలిపోయింది.
وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِين البقرة: الآية 23
ఖుర్ఆన్ లోని సూరా నైన తీసుకురండి అని అల్లాహ్ సుబ్ హానహు వతఆల సవాల్ చేస్తున్నాడు: “మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్న అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైన రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని కోసం అల్లాహ్ సుబ్ హానహు వతఆలను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి” [ఖుర్ఆన్ సూరా; బఖర 2:23].
أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا سورة النساء الآية 8
‘ఖుర్ఆన్ లో విరుద్ధమైన విషయాలు వున్నాయి’ అనే వారికి అల్లాహ్ సుబ్ హానహు వతఆల సవాల్ చేస్తున్నాడు: "ఏమిటి! వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనుక అల్లాహ్ సుబ్ హానహు వతఆల తరపు నుంచి గాక ఇంకొకరి తరపు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్యం కనబడేది” (ఖుర్ఆన్ సూరా అన్ నిసా 4:82).
ఈ ఖురాన్ లో వివిధ రకాల చమత్కారాలు పొందు పరిచి ఉన్నాయి. సాహిత్యం, భవిష్య విద్య, జ్ఞానం, శాస్త్రం, మరిన్ని నిజాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే ఒక్కొక్క ఆయత్ వెనుక అనేక రకాల రహస్యాలు దాగి ఉన్నాయి. అది, సముద్ర ముత్యాలందుకోవాలని అనుకున్నవారు దానిపై నుంచి గమనిస్తే సరిపోదు, దిగి లోతు తెలుసుకోవాలి మరియు ఓర్పు అనే పరికరాలతో ముత్యాలు లభిస్తాయి.
కొండకమల్లి ఇర్ఫాన్,
పుంగనూరు.