రాజ్యాంగ శిల్పి డా.బి.ఆర్ అంబెద్కర్

రాజ్యాంగ శిల్పి డా.బి.ఆర్ అంబెద్కర్
భారత రాజ్యాంగ నిర్మాతగా పేరొందిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశంలో నెలకొన్న సామాజిక అసమానతల్ని చక్కదిద్దడానికి వివిధ రాజ్యాంగ హోదాల్లోనే కాదు, పాత్రికేయాన్ని సైతం ఆయుధంగా వాడిన ఆచరణశీలి. డాక్టర్‌ అంబేడ్కర్‌ పాత్రికేయునిగా బహిష్కృత కులాలను విముక్తి చేసి ప్రబుద్ధ భారతాన్ని ఆవిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారు. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం కోసం కృషిచేసిన కారణజన్ముడు. ఈయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రంలో "మహర్" అనే హరిజన తెగలో జన్మించిన అంబేద్కర్ చిన్నతనం నుంచే తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు.
ఈ కుటుంబం మహర్ (దళిత)  కులానికి చెందినది, ప్రజలు చాలా తక్కువ తరగతికి చెందినవారని నమ్ముతారు, వారి కుటుంబం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబవాడి గ్రామానికి చెందిన మరాఠీ. సైన్యంలో పనిచేస్తున్నప్పుడు, డాక్టర్ అంబేద్కర్ తండ్రి సుబేదార్ అయ్యారు మరియు అతను ఎల్లప్పుడూ తన పిల్లల చదువు కోసం పట్టుబట్టారు. కొన్ని రోజుల తరువాత అతని తండ్రి సైన్యం నుండి రిటైర్ అయ్యాడు, మరియు అతను తన కుటుంబంతో సతారాకు వెళ్ళాడు. అంబేద్కర్ తల్లి సీమా బాయి అనారోగ్యం కారణంగా మరణించారు. అంబేద్కర్  స్వంత మనస్తత్వం కారణంగా అంబేద్కర్తో సహా 14 మంది తోబుట్టువులను అత్తమామలు చూసుకున్నారు, వైద్యులు కూడా అంటరానివారిని తాకకుండా చికిత్స చేశారు, ఈ కారణంగా అంబేద్కర్ యొక్క 14 మంది తోబుట్టువులలో ముగ్గురు మాత్రమే ఎనిమిది మంది సోదరులు మరియు ఇద్దరు సోదరీమణులు ప్రాణాలతో బయటపడింది, మిగిలిన ఎనిమిది మంది సోదరులు మరియు సోదరీమణులు దోపిడీ కారణంగా మరణించారు.చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ పిల్లలు పాఠశాలకు వెళ్ళేవారు, భీమరావు జీ పాఠశాలకు వెళ్ళాలని తన తండ్రిని పట్టుబట్టాడు, కాని అంటరానివాడు కావడం వల్ల పాఠశాలలో ప్రవేశం పొందడం అంత సులభం కాదు, బలవంతంగా అతని తండ్రి ఒక బ్రిటిష్ సైనిక అధికారి వద్దకు వెళ్లి, తన జీవితమంతా ప్రభుత్వానికి సేవ చేశానని వేడుకున్నాడు మరియు దానికి బదులుగా తన పిల్లలను కూడా పాఠశాలలో చేర్చాలని అడిగాడు,ఆ విధంగా అంబేద్కర్ పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాడు.
అతని మేధాశక్తికి, సమయస్పూర్తికి ఉపాధ్యాయులు విస్తుపోతుండేవారు. ఇద్దరు ఉపాధ్యాయులు అతనికి కావలసిన పుస్తకాలను, బట్టలను ఉచితంగా ఇచ్చి, అతని బాగా ప్రోత్సాహించారు. ప్రాథమిక విద్య అనంతరం భీమ్ రావ్ 'సతారా' నుంచి బొంబాయికి మకాం మార్చాడు. ఒక సువర్ణ పండితుడి సహకారంతో బొంబాయి ఎలిఫిన్ష్టన్ హై స్కూల్లో చేరాడు. ఆ పండితుడు అతనికి అన్ని విషయాలలోనూ చక్కని సలహాలిస్తూ, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, ఆత్మబలంతో ముందుకుపోవటానికి ప్రోత్సాహమిచ్చారు. ఆయన మీద గౌరవంతో తన పేరును అంబేద్కర్‌గా మార్చుకున్నాడు.
ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదు. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలపై గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒప్పందం 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్  క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
• రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా
  1947 భారత దేశ మొదటి న్యాయవాద శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ కీలకపాత్రను పోషించారు. అయితే ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ లోనే ఆయనకు కొందరు వ్యతిరేకంగా పనిచేసేవారు, దీనికి నిరసనగా అంబేద్కర్ న్యాయవాది శాఖకు  రిజైన్ చేశారు.రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు' అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
• బౌద్ధమును స్వీకరించుట: 
అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.1956 అక్టోబరు 14న నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీతో అనేక విషయాలలో విభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter