ఎటువంటి శిక్ష నైనా సంతోషంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
ఆగస్టు/14న, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను తన రెండు ట్వీట్ల కారణంగా సుప్రీం కోర్టు 'కోర్టు దిక్కారం దోషిగా' నిర్ధారించింది. ఈ రెండు ట్వీట్లు వక్రీకరించిన వాస్తవాలుగా, దుర్మార్గపు/ఉద్దేశపూర్వకమైన దాడికి పాల్పడ్డాయి అని జస్టిస్ మిశ్రా బి.ఆర్ గవాయి మరియు కృష్ణ మురారి బెంచ్ పేర్కొంది.
ఆర్టికల్ 370, ఎలక్ట్రోరల్ బోండ్స్, పౌరసత్వ సవరణ చట్టం, హెబియస్ కార్పస్ పిటిషన్లు మరియు కాశ్మీర్ ప్రజల ఫండమెంటల్స్ హక్కులు లాంటి కేసులను పక్కనపెట్టి, ఈ కేసు విచారణలో తొందరపాటు చేయడం గమనార్హం.
ఆగస్టు 17న దేశ వ్యాప్తంగా 1500 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఇలా లేఖ రాశారు. కొందరు భూషణ్ పోయిన కోర్టు ధిక్కరణ పాల్పడినట్లుగా అభిప్రాయం చెందడం సహజం కాదు. ఈ తీర్పు ప్రజల దృష్టిలో కోర్టు అధికారాన్ని పునరుద్దరించదని స్టేట్మెంట్ లో చెప్పారు.
గురువారం తన శిక్షను మరో బెంచ్చు వినేందుకు పెట్టిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత భూషణ్ కేసుని ఒక పెద్ద బెంచ్ వినాలని అడుగుతూ ఒక ప్రకటనపై 1,800 కి పైగా న్యాయవాదులు సంతకం చేశారు. గతవారం తీర్పు తర్వాత సీనియర్ న్యాయవాది జైసింగ్ 'స్వేచ్ఛాయుత ప్రసంగం'కి ఇది ఓ చెడు వార్త అని తెలియజేశారు.
"మన గణతంత్ర రాజ్య చరిత్ర ప్రస్తుత దశలో నా అత్యున్నత కర్తవ్యంగా నేను భావిస్తున్న దాన్ని నిర్వహించే ప్రయత్నంలో భాగమే నా ట్వీట్లు. అన్యమనస్కంగా నేనేమీ ట్వీట్ చేయలేదు. అప్పుడు, ఇప్పుడు నా విశ్వాసాలుగా ఉన్న వాటినే నా ట్వీట్లు నిజాయితీగా వ్యక్తం చేశాయి. అందుకు నేను సంజాయిషీ ఇవ్వను, క్షమాపణ చెప్పబోను. అలా చేయడం అంటే నేను చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడమే గాక ధిక్కారానికిరానికి పాల్పడడం కూడా అవుతుంది. కనుక జాతి పితా మహాత్మాగాంధీ తన పై ఒక కేసు విచారణలో చెప్పిన మాటలనే నేను వినయపూర్వకంగా పునరుద్ఘాటిస్తున్నాను. దయ చూపమని నేను అడగను. నా పట్ల మంచిగా వ్యవహారించమని నేను విజ్ఞప్తి చేయను. కోర్టు నేరంగా పరిగణించినదానికి, నేను ఒక పౌరునిగా అత్యున్నత కర్తవ్యంగా భావించిన దానికి న్యాయబద్ధంగా విధించే ఎటువంటి శిక్షనైనా సంతోషంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను" అని ప్రశాంత్ భూషణ్ తెల్పారు.