స్టాఫ్ సెలక్షన్ కమిషన్: అరుదుగా ఉపయోగపడే రంగం
ముస్లిం సమాజం రోజురోజు కి అంధకారంలో దిగజారిపోతుందని అనడంలో ఏసంకోచం లేదు. విద్యారంగంలో వెనుకబడిన వల్లనేమో ఈ రోజు మనమందరం ఇంతటి హీనమైన మరియు తుచ్ఛమైన స్థితిలో ఉన్నాం. ముస్లిమే తరులవర్గాలుతమలో నిఅజ్ఞానమును మరియు నిరక్షరాస్యతను తొలగించి, విద్యా దీపాలను వెలిగించి అభివృద్ధి శిఖరానికి చేరుకున్నారు. ఒకప్పుడు తమవిద్యానైపుణ్యాలతో ప్రపంచాన్ని అలంకరించి తమ దంటూ చరిత్రలో ఓముద్రవేసుకున్న సమాజం ఈనాడు దారిద్ర్యంలో మొదటిస్థానంలో ఉండడం అంటే ఊహకి అందని విషయం. దీనంతటికీ కారణం మన నిర్లక్ష్యం మరియు బద్ధకంమే ప్రథమ కారణం.
నేటి యువతకు మన దేశం ఎన్నో స్వర్ణ అవకాశాలనుకల్పించినా, వారు దీనిని సద్వినియోగం చేయకపోవడం చాలా దురదృష్టం. ఈఅవకాశాల యొక్క సరైన అవగాహనలేకపోవడం దీనికి మూలం. వీటిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు, ముఖ్యంగా ముస్లిం సమాజానికై తె దీనిపై ఎలాంటి యోచనలేదు. ఒకరికి ఈ పరీక్షద్వారా వచ్చేఅవకాశాలు ఊహించలేము. దీని ద్వారా జీవితాలు మలుపు తిరుగుతాయి అనడం లో ఎటువంటి సంశయం లేదు. ముస్లిం యువత దీనిపై ఎలాంటి శ్రద్ధ మరియు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యానికి దారితీస్తుంది. ప్రతి ఏడాది 1200 నుండి 1700 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు దీని ద్వారానే జరుగుతున్నాయంటే పరిశీలించే విషయం.
ఈ ఎగ్జామ్స్ ద్వరానే సి. బి. ఐ (సెంట్రల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), ఎన్. ఐ. ఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఈ. డి (ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్), ఆర్. బి. ఐ మరియు సి.ఎ. జి లాంటి చోట్ల పనిచేసే అవకాశం లభించడం గమనార్హం. UPSC ద్వారా ప్రతి సంవత్సరం 800 నుండి 1000 పోస్టులు వచ్చినా ముస్లిం యువత దీనిపై ఎక్కువ మక్కువ చూపడం అనేది మూర్ఖత్వం మరియు అవివేకం. ఒకవేళ ముస్లింలు ముందు వరుసలో వచ్చి ఈ రంగం లో ప్రయత్నిస్తే గనుక సమాజం యొక్క రూపం మారుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.