మహమ్మారి  లో  విద్వేష  ప్రచారం
తబ్లీగ్ జమాత్

2014 నుండి భారతదేశంలో ముస్లిం గా ఉండడమంటే సులభమైన విషయం కాదు, ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసిన దేశం పై చేసినట్టేనంటు తీవ్రమైన ద్వేషం ముస్లింల పై సామాజిక మాధ్యమాలలో కొనసాగుతున్నాయి, వ్యతిరేకులను తమ దుస్తుల ద్వారా తెలుసుకోవచ్చని ప్రధానమంత్రి తన ప్రసంగాలలో పేర్కొనడం విస్మయపరిచింది.

దేశంలో కరోనా పెరగడానికి ప్రథమ కారణం తబ్లీగ్ జమాత్ కు హాజరైన విదేశీయులనీ మార్చి లో మొత్తం మీడియా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకొని బురద చెల్లింది. ఈ అంశాన్నే పెట్టుకొని మీడియా ఎన్నో డిబేట్ లు మరియు వివిధ ప్రోగ్రాంలో వారాల వరకు కొనసాగించిదంటే ఆశ్చర్యం.

ఆగష్టు 21, తబ్లీగ్ జమాత్ కు హాజరైన 29 విదేశీయులపై మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు చెల్లవని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వార్త పలు పత్రికలలో మరియు మీడియాలో మారుమూల ప్రాధాన్యాన్ని పొందడం సహజం, ఎందుకంటే ఒకవేళ ఇది గనుక హెడ్ లైన్ గా మారితే మొత్తం మీడియా సిగ్గు పాలవుతుంది. వాస్తవానికి ఈ తీర్పు అత్యంత తీవ్రమైన, సంచలనశీలమైన, సాహసోపేతమైన న్యాయనిర్ణయం గా గుర్తించవలసిన విషయం. తీర్పులోని ఆచరణాత్మక ఆదేశాలు మహారాష్ట్రలో బాధితులైన విదేశీ యాత్రికులకు పరిమితంగా కనిపిస్తున్నప్పటికీ, న్యాయమూర్తులు చేసిన అనేక వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు యావత్ దేశానికి బుద్ధి చెప్పేట్టుగా వున్నాయి.

కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారంటూ మర్కజ్ యాత్రికులను బలిపశువులను చేశారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కరోనా నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దుష్ప్రచారం జరిగిందని, 50 ఏళ్లుగా ఏటా జరుగుతున్న తబ్లీగ్ సమావేశాలపై లేనిపోని ఆరోపణలు చేశారని తీర్పులో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను, కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే ఈ 29 మంది పై ఎటువంటి చర్యా అవసరం లేదని అర్థం అవుతుందని న్యాయస్థానం పేర్కొన్నది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు యాంత్రికంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులకు లొంగి పోయిందని కూడా తీర్పు వ్యాఖ్యానించింది.
మీడియా మహమ్మారి సమయంలో ద్వేషాన్ని మరియు భయాన్ని ప్రసారం చేసిందని కోర్టు పేర్కొంది, ఈ తీర్పు మీడియా పై పిడుగు పడ్డట్టు గా అనిపించింది.

ఒక వర్గం వారి వల్లనే వ్యాప్తి జరుగుతోందన్న అపోహలను తొలగించి వలసింది పోయి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం తమ గణాంకాలలో యాత్రికుల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక సామాజిక మాధ్యమాలలో జరిగిన విద్వేష ప్రచారం సామాన్యమైనది కాదు ఉద్దేశ్యపూర్వకంగా వ్యాధిని వ్యాపింపజేశారన్న ప్రచారానికి ఊతం ఇస్తున్నట్టుగా మర్కజ్ కు హాజరైన 960 మంది విదేశీయులు బ్లాక్ లిస్టు చేసి వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు చట్టం ప్రకారం నేరాలు చేసినందుకు వారిపై కేంద్రం కేసులు పెట్టింది. ఆ 960 మంది లో భాగమే మహారాష్ట్రలోని 29 మంది కూడా.

కరోనా వ్యాప్తిని అధికం చేసే పరిణామాలు దేశంలో ఆ తరువాత చాలా జరిగాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన భారతీయులు కాలినడకన సుధీర్ఘ ప్రయాణాలు చేయవలసి వచ్చిన వలస కూలీలు అనివార్యంగా కొంత వ్యాప్తికి కారణమయ్యారు. దీనిపై మీడియా ఏ నాడూ ఒక డిబేట్ లేదా చర్చ చేయలేదు. తిరుపతి స్టాఫ్ తో సహా విచ్చేసిన భక్తులందరికీ కరోనా సోకిన విషయాన్ని ఏ పత్రిక మరియు మీడియా ప్రచారించక పోవడం గమనార్హం.జనవరి 2020 కంటే ముందు పౌరసత్వ చట్ట వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి, వాటిలో అత్యధికం గా ముస్లిములే పాల్గొన్నారు, ఈ చట్టం పక్షపాతంతో కూడినదని వారు భావించారు. దీనిపై పగ సాగిస్తున్నట్పగా మీడియా ప్రవర్తించింది.

నాడు ఎందుకు‌ మన దేశం లోని సమాజం, మీడియా విద్వేష సందర్భాలు వచ్చినప్పుడల్లా బాధ్యతగా ఉండలేకపోతున్నాయి? సమస్యలను పరిశీలించకుండా నే ప్రచురించడం, పౌర సమాజం, మీడియా కూడా మెజారిటీ తో కలిసి పోయి వారి అజెండాలో లలో భాగమై పోతే ఈ దేశ భవిత్యం ఎట్లా ఉండబోతున్నది? కేంద్ర ప్రభుత్వం ఒక అజెండాతో ముందుకు పోతున్నది అనుకుందాం, మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? విష ప్రచారాన్ని కి విరుగుడు ఎందుకు చేయలేక పోయాయి? ఇలా ఎన్నో ప్రశ్నల సమాధానం కొరకు ముస్లింలే కాకుండా దేశంలోని ప్రతి మైనారిటీలు ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు పొరాడిల్సింది కరోనా వ్యాధి కాదు అంతకు మించిన విద్వేషపూరిత మైనటువంటి సమచారాలతొ నిండి వున్న సమాజంతో, ఒక వేళ ఈ సమస్యలకు పరిష్కారం లభించకపోతే భవిష్యత్తులో బాధపడక తప్పదు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter