కేరళ ప్రముఖ షేఖ్ హజరత్ మౌలద్దవీలహ్ యొక్క 182వ వర్థంతి సన్నాహాలు ప్రారంభం
కేరళ (ఏజెంట్): హజరత్ సయ్యిద్ అలవీ మౌలద్దవీలహ్, మానవత్వ పాఠానికి పునాది వేసిన భారతదేశంలోని ఔలియా మరియు అస్ఫియా యొక్క ఏక సమూహంలో ఒక ప్రముఖులు.
వారి పూర్తి పేరు సయ్యద్ అలీ మౌలద్దవీలహ్ అల్ హసనీ తంగల్. వారి పితామహుల స్వస్థలం యెమన్ (యమన్). వారి 17వ ఏటలో తన సమాజ సేవ, విజయం, సఫలం కొరకు 1183లో కేరళ లోని ప్రసిద్ధ నగరం కాలికట్ కు దయచేసారు. క్రీ.శ. 1260లో వారు శాశ్వతంగా ఈ లోకం నుండి తుదిశ్వాస విడిచారు. అహ్లె సున్నత్ దారుల్ హుదా ఇస్లామీయ విశ్వవిద్యాలయానికి దగ్గరలో మంపురం లో వారి దర్గా ఉన్నది. వారు సమాజసేవలో ముఖ్య పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా వారి 182 వ వర్ధంతి 28/08/2020న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఏడు రోజుల వరకు జరగనుంది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వలన చాలా మార్పులు చేయడం జరిగింది. వీరి 182 వ వర్ధంతికి ఆన్లైన్ కార్యక్రమం ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది.
ఇందులో ముఖ్యఅతిథిగా హజరత్ సయ్యద్ జిఫ్రీ తంగల్ మరియు సయ్యద్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ పాల్గొనున్నారు. ఈ శుభసందర్భంగా దారుల్ హుదా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్ అయినా ఉస్తాద్ డాక్టర్ బహాఉద్దీన్ ముహమ్మద్ నద్వీ (అల్లాహ్ వారికి దీర్ఘాయుష్షు ప్రసాదించుగాక) విచ్చేయునున్నారు. అలాగే ఈ మహాసభ కి ముఖ్య ఉపన్యాసకులుగా అల్లామా సిమ్సారుల్ హఖ్ఖ్ హుదవి, హజరత్ ముస్తఫా హుదవీ, అన్వర్ ముహ్యుద్దీన్ మరియు అబ్దుల్ సమద్ పూకొత్తూరు దర్శనం ఇవ్వనున్నారు.
రాబోయే ఈ వర్ధంతి సదస్సులో దర్గా దర్శనం, సలాత్, నఅ'త్, ప్రసంగం దిక్ర్, దుఆ మరియు మౌలూద్ షరీఫ్ మొదలగు ప్రార్థనలు ఆలంపించనున్నారు.