డా. కఫీల్ ఖాన్ నిర్బంధం చట్టవిరుద్ధం: అలహాబాద్ హైకోర్టు
అలహాబాద్ హైకోర్టు మంగళవారం డా. కఫీల్ నిర్బంధాన్ని చట్టవిరుద్ధమని మరియు ప్రభుత్వాన్ని వెంటనే విడిపించవలసిందిగా ఆదేశించింది. ఈ సంవత్సరం జనవరి నెలలో దేశ ద్రోహం ఆరోపణలతో అరెస్టయిన డా. కఫీల్ ఖాన్ ఏడు నెలల తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పుతో తనకు ఊరట లభించింది.
ఉత్తర ప్రదేశ్ లోని మథుర జైలు నుంచి బుధవారం విడుదలయిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ముందుగా నా కోసం ప్రార్థించిన 130 కోట్ల దేశ వ్యాసుల కి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, తర్వాత ఈ తీర్పునిచ్చిన న్యాయవ్యవస్థకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.నా ప్రసంగంలో హింస విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది అలాగే నన్ను ముంబై నుంచి మధుర తీసుకొచ్చినా స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను మార్గమధ్యంలోనే నన్ను ఎన్ కౌంటర్ చేయకుండా జైలుకు తీసుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు.
డా. కఫీల్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో వైద్యుడిగా సేవలందిస్తున్న జనవరి 29న అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ లో సి.ఎ.ఎ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం పై దేశ ద్రోహం అభియోగాలు మోపి జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన చేసిన ప్రసంగంలో హింస, విద్వేషపూరిత అంశాలేవీ లేవని మంగళవారం (సెప్టెంబర్ 1) అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కఫీల్ ఖాన్ ప్రసంగం హానికరంగా ఏమీ లేదన్న కోర్టు వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.