రంజాన్: ఖురాన్ మాసం

రంజాన్ నెల ఖురాన్ నెల. అల్లాహ్ రంజాన్ నెలను ఖురాన్ లో ఇలా పరిచయం చేసాడు:

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ

రంజాన్ నెల! అందులో దివ్య ఖుర్‌ఆన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింప జేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా-సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి.

మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు, "ఇబ్రహీం (అలైహిస్సలాం) గారి గ్రంథం రమదాన్ నెల మొదటి రాత్రిలో అవతరింపజేయయబడింది. రమదాన్ యొక్క ఆరు రాత్రుల తరువాత తౌరాత్ అవతరింపజేయబడింది. రమదాన్ యొక్క పదమూడు రాత్రుల తరవాత ఇంజీల్ అవతరింపజేయబడింది. రమదాన్ యొక్క ఇరవై నాలుగు రాత్రుల తరువాత ఖురాన్ అవతరించింది "(అహ్మద్).

అల్లాహ్ తఆలా తరుపు నుండి మానవజాతికి ఖురాన్ ఒక పెద్ద బహుమతి. ఇది శాశ్వతంగా ప్రళయదినం వరకు ఉండే పుస్తకం మరియు ఇది మానవజాతికి గొప్ప మార్గదర్శి. ఈ పుస్తకం మన ఆధ్యాత్మికమైన మరియు శారీరకమైన ప్రతి వ్యాధికి నివారణ. ఇది అసత్యపుతో నిండిన చీకటి ఆకాశంలో వెలిగే సత్యపు నక్షత్రం. మనం ఈ భూమిపై అల్లాహ్ యొక్క సేవకులుగా కట్టుబడి ఉండటానికి ఖురాన్లో చట్టపరమైన తీర్పులు ఉన్నాయి. ఈ పుస్తకములో చాలా దీవెనెలు మరియు శాశ్వతంగా ఉండే జ్ఞానం ఉంది. దానితో పాటు హెచ్చరికలు మరియు శుభవార్తలు కుడా ఉన్నాయి.

మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు,"ప్రళయదినం నాడు ఖురాన్ తమ సహచరుడి సమాధి తెరిచినప్పుడు ఒక లేత మనిషి రూపములో అతనిని కలుస్తుంది. 

అది అతనితో ఇలా అంటుంది: నువ్వు నన్ను గుర్తించావా?

అతను: లేదు నేను నిన్ని గుర్తించలేదు

అది అతనితో: నేను నీ సహచరుడిని, ఖురాన్, నిన్ను వేడి రోజులలో దాహంగా పెడుతూ రాత్రిపూట నిన్ను మెలకువగా ఉంచేవాడిని. ప్రతి వ్యాపారి తన వ్యాపారం నుండి లాభం పొందుతాడు అలాగే నువ్వు చేసిన కృషి యొక్క లాభం ఈ రోజు పొందుతావు. వాడి కుడి చేతిలో 'ఆధిపత్యం' మరియు ఎడమ చేతిలో 'శాశ్వతత్వం' ఇవ్వబడుతుంది. అతని తలపై మరియు వాళ్ళ తల్లిదండ్రుల గళాలపై గొప్ప కిరీటాలు ఉంచబడుతుంది, ఆ కిరీటాలు ప్రపంచ ప్రజలు ఎన్నడూ చూడని అమూల్యమైన దుస్తులను కలిగి ఉంటాయి. 

వారు(ఆ మనిషి మరియు వాళ్ళ తల్లిదండ్రులు) :మేము ఎందుకు ఈ దుస్తులు ధరించాము' అని అడుగుతారు. అప్పుడు అది చెబుతుంది:  ఎందుకంటె మీ కుమారుడు ఖురాన్ పఠిస్తూ దానికి కట్టుపడి ఉండేవాడు' అని చెప్పబడుతుంది.

అప్పుడు అది చెబుతుంది: 'పఠించు (ఖురాన్ పఠిస్తూ) స్వర్గంలో నీ స్థాయిలు మరియు భవనాలను పెంచుకో' అని చెప్పబడుతుంది, మరియు అతను పఠించినంత కాలం, అది(ఆ స్థాయులు మరియు భవనాలు)  వేగంగా లేదా నెమ్మదిగా పెరుగుతా ఉంటాయి'(అహ్మద్)

పవిత్రమైన సమావేశం

ఒక్కసారి ఈ దృశ్యాన్ని గురించి ఆలోచించండి. ఒక సంవత్సరంలోని  నెలలన్నింటిలోకి, గొప్ప నెల రంజాన్. దీనిలో ప్రతి రాత్రి ఒక అద్భుతమైన కలయిక జరుగుతుంది. మానవజాతిలో అందరికన్న ఉత్తమమైన వారు మన ప్రియ ప్రవక్త ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు దైవదూతలలో ఉత్తమమైనవారు ‘జిబ్రయీల్’ అలైహిస్సలాం   వీళ్ళీద్ర మధ్య ఒక గొప్ప సంభాషణ జరిగేది.

‘అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్’ (ర) గారు ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త (స) గారు ఇలా ప్రస్తావించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఉదారంగా(Generosity) ఉండేవారు, రమదాన్ లో జిబ్రయీల్ అలైహిస్సలాం మీతో కలిసినప్పుడు వారి ఔదార్యం మరింత ఎక్కువగా అయిపోయేది. రమదాన్ మాసంలో ప్రతి రాత్రి జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్తను  సందర్శించి మరియు కలిసి ఖురాన్ పఠించేవారు. ఆ సమయంలో మన ప్రియామ ప్రవక్త యొక్క మంచి విషయాలు బలమైన గాలికన్నా ఎక్కువ ఉదారంగా అయిపోయేది.

‘ఇబ్న్ రజబ్’ రహ్మతుల్లాహ్ అలైహి గారు వ్రాసారు, "ఈ హదీసు రమదాన్లో ఖురాన్ను పారాయణం చేయడం మరియు దాని కోసం సమావేశమవడం యొక్క వాంఛనీయతను వివరిస్తుంది. ఈ హదీసు రమదాన్ నెలలో ఖురాన్ను సమృద్ధిగా పఠించాలనే కోరిక ఉండాలని వివరిస్తుంది. అదేవిధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రిపూట జిబ్రీల్ అలైహిస్సలాంతో అధ్యయనం చేసేవారు. ఇది రాత్రిపూట ఖురాన్ పఠించాలనే వాంఛనీయతను చూపిస్తుంది, ఎందుకంటే అప్పుడు అన్ని పరదాలు తొలగించబడతాయి, వాళ్లు కేవలం ఖురానుపై మాత్రమే దృష్టి పెట్టగలరు.

إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا ٦

“నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్త మైనది మరియు (అల్లాహ్‌) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగుణమైనది”. (73:6)

ఇందుకే, మేము ఇప్పుడు ఖురాన్ పఠించడానికి మరియు నేర్చుకోవడానికి వీలైనంత ఎక్కువ సమయాన్ని రమదాన్లో కేటాయించాలి. 

ఎంత పఠించాలి?

ముందు కాలంనాటి ఇస్లామీయ పండితులు ఖురాన్ పఠించడం మరియు పూర్తి చేయడంపై దృష్టి పెట్టడానికి రమదాన్లో వారి హదీత్ పాఠాలను నిలిపేసేవారు.

సంఖ్య

పేరు

ఖురాన్లు పూర్తి చేసిన సంఖ్యా 

1

ఇబ్రహీం అల్నకాహి రహ్మతుల్లాహ్ అలైహి                                                

12

2

అస్వద్ బిన్ యజిద్ రహ్మతుల్లాహ్ అలైహి                                                    

15

3

ఖాతాదా రహ్మతుల్లాహ్ అలైహి                                                                                                       

16

4

ఇబ్నె ఆసాకిర్ రహ్మతుల్లాహ్  అలైహి                                                                                       

30

5

ఇమామ్ బుఖారి రహ్మతుల్లాహ్ అలైహి                                                                          

40

6

ఇమామ్ అబూ హనీఫా & ఇమామ్ షాఫీ రహ్మతుల్లాహ్ అలైహిమా

60

వీల్లే అల్లాహ్ యొక్క ప్రత్యేక సేవకులు ఎవరైతే ఈ అద్భుతాలను సాధించారో. వేళ్ళకి ఇంట పారాయణం చేయడం ఎలా సాధ్యపడిందంటే వారు ఏడాది పొడవునా ఖురాన్ను పఠించి, ప్రతిబింబించే పండితులు,ఇలాగే అల్లాహ్ కూడా వాళ్ళ సమయంలో తమ బరకతను విభజల్లాడు.

మనలో చాలా మందికి ఇన్ని పోర్ట్ చేయడం సాధ్యం కాదు. మేము ఖురాన్ చదివేటప్పుడు మేము ఆ ఆయత్ యొక్క అర్థం తెలిస్తే దాన్ని ఆ అర్థాన్ని ఆలోచిస్తూ ఖురాన్ను పారాయణం చేయాలి ఇలా చేసే దానిని తదబ్బుర్ అని అంటారు. కేవలం తదబ్బుర్తా ఉంటె చాలదు దానితో పాటు తజ్విద్ మరియు తర్తీల్ నియమాలను పార్థిస్తూ పారాయణం చేయాలి. కేవలం మన లక్ష్యం ఖురాన్ను పెద్ద సంఖ్యలో పూర్తి చేయాలి అన్న లక్ష్యం ఉండకూడదు, దీనితో పాటు తదబ్బుర్, తజ్వీద్ మరియు తర్తీల్ యొక్క నితనాలను పాతిస్తూ ఖురాన్ పర్యాయం చేయాలి.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter