విశిష్ట యోగ్యత కలిగిన ముహర్రం మాసం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో

విశిష్ట యోగ్యత కలిగిన ముహర్రం మాసం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో

అల్లాహ్ తఆల సంవత్సరంలోని కొన్ని మాసాలకు ఎన్నో పెద్ద పెద్ద ప్రత్యేకతలను చేకూర్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన నెలల ఎదుట ఆ మాసాల ఆరాధనలే ఎక్కువ మొత్తంలో స్వీకరించబడతాయినూ! అటువంటి ప్రత్యేక నెలల్లోని ఒక నెలే "ముహర్రముల్ హరాం" ఇది ఇస్లామిక సంవత్సరపు మొదటి మాసం. ఇంకా అల్లాహ్ కృప, కరుణను పొందే ఎన్నో మార్గాలు కలవు. ఇస్లాం రాకముందు కూడా దీనికంటూ ఒక గొప్ప స్థానం ప్రాముఖ్యత వగైరా ఇవ్వబడుతుండేవి. అంతేకాక ఇస్లాం రాక తర్వాత కూడా దీని ప్రాముఖ్యత ఆ విశిష్ట యోగ్యత చెక్కుచెదరకుండా భద్రంగా ఉండడమే కాకుండా అది రెట్టింపు పొందిది.

దీని గురించి అల్లాహ్ తఆల యొక్క ప్రస్తావన ఖురాన్ లోని సురతు తౌబా యొక్క 36వ శ్లోకంలో ఇలా ఉంది:
إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثۡنَا عَشَرَ شَهۡرࣰا فِی كِتَـٰبِ ٱللَّهِ یَوۡمَ خَلَقَ ٱلسَّمَـٰوَ ٰ⁠تِ وَٱلۡأَرۡضَ مِنۡهَاۤ أَرۡبَعَةٌ حُرُمࣱۚ ذَ ٰ⁠لِكَ ٱلدِّینُ ٱلۡقَیِّمُۚ فَلَا تَظۡلِمُوا۟ فِیهِنَّ أَنفُسَكُمۡۚ وَقَـٰتِلُوا۟ ٱلۡمُشۡرِكِینَ كَاۤفَّةࣰ كَمَا یُقَـٰتِلُونَكُمۡ كَاۤفَّةࣰۚ وَٱعۡلَمُوۤا۟ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِینَ }
[سُورَةُ التَّوۡبَةِ: ٣٦]

"నిస్సందేగంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య 12 మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్‌ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిధ్ధ (మాసాలు). ఇదే సరైన ధర్మం. కావున మీరు (కయానికి కాలు దువ్వి) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. అవిశ్వాసులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా ఎల్లప్పుడూ వారితో పోరాడండి మరియు భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి!"

పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో నాలుగు గౌరవప్రదమైన మాసాలలో ఈ ముహర్రం మాసాన్ని కూడా ప్రవేశించడం జరిగింది. ఈ నెలలో యుద్ధ తగాదాలు, రక్తపాతాలు, హింసలు మరియు దౌర్జన్యాలు ఇవన్నీ నిషిద్ధం (హరాం). అందుకే ఈ మాసాన్ని ముహర్రముల్ హరాం అని అందురు. పై ఆయత్ (శ్లోకం) ఆధారంగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకొని తీరాలి. అవి ఏమిటంటే, అల్లాహ్ తఆలా మనం చెడు కార్యాలను చేసి మోసపోకుండా వీలైనంతవరకు ఈ విశిష్ట మాసంలో ఎక్కువగా ప్రార్థనలు చేసి, ఎటువంటి కష్టాలు ఆటంకాలు ఎదురైనా సరే, వాటిని సహించి నిలబడి తీరాలి. మరో విషయం ఏమిటంటే అల్లాహ్ తఆలా దుర్మార్గులతో (ముష్రికీన్) విశ్వాసులందరూ ఏకమై వారిపై సమరానికి సిద్ధమై ఉండాలి. ఇంకా ఆయన స్వయంగా విశ్వాసులకు తోడునీడై ఉంటారని తెలిపారు. కనుక, మనం తప్పనిసరిగా ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి మరియు ప్రతి ఒక్క హెచ్చరిక నుండి తమను తాము రక్షించుకోవాలి. ఫరాయిజ మరియు వాజిబాతులతో పాటు నవాఫిల్ పట్ల కూడా వీలైనంత ఎక్కువగా శ్రద్ధ వహించాలి.

ముహర్రం మాసపు విశిష్టతలు

హజరత్ అబూబకర్ సిద్ధీఖ్ (ర) గారి కథనం ప్రకారం ప్రియ ప్రవక్త గారు ఇలా తెలిపారు: "సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. వాటిలోని నాలుగు చాలా గౌరవప్రదమైనవి. 'జుల్ కాయిదా', 'జుల్ హిజ్జా' మరియు 'ముహర్రం' ఈ మూడు వరుసగా ఉన్నాయి. ఇంకా నాలుగవది రజబ్.

హజరత్ అబు హురైరహ్ (ర) గారి కథనం మేరకు హుజూర్ (స) గారు ఇలా సెలవిచ్చారు: రంజాన్ ఉపవాసాల తర్వాత అతి శ్రేష్ఠమైన ఉపవాసాలు ఉంటే అవి మొహర్రం ఉపవాసాలే మరియు ఫర్జ్ నమాజుల తర్వాత గొప్ప విశిష్టత కలిగిన నమాజ్ అంటే అది తహజ్జుద్ నమాజ్ మాత్రమే.
హజరత్ ఖత్తాదహ్ (ర) గారు ఇలా సెలవిచ్చిరి: ఈ గౌరవప్రదమైన మాసాలలో సత్కార్యాల పుణ్యం చాలా పెద్దది! అందుచేత ఇందులో తప్పుడు పనులు చేసిన దానికి తగ్గ ఫలితం అంతే పెద్దగా ఉండును! (మజ్హరీ).
అల్లామహ్ ఇబ్న్ రజబ్ గారు ఇలా తెలిపారు: పూర్వీకులు మూడు మాసాలలోని పది దినాలను చాలా గౌరవిస్తూ ఉండేవారు:

రంజాన్ యొక్క చివరి 10 దినాలు.

జుల్ హిజ్జా యొక్క మొదటి పది దినాలు మరియు

ముహర్రం యొక్క మొదటి పది రోజులు. (ముహర్రముల్ హరాం కా మహీనహ్)
హజరత్ ఇమామ్(నసాయీ) (ర) గారు హజరత్ అబూజర్ర్ (ర)గారి వాక్యాలతో, ఈ మాసపు ఘనతను గురించి ఇలా సెలవిచ్చారు: ఆయన హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారితో ఇలా ప్రశ్నించారు: రాత్రి ఘడియల్లో కల్లా అన్నిటికన్నా మిన్న అయినా ఘడియ ఏది? ఏ మాసం అన్నిటికన్నా గొప్పది? దీనితో హుజూర్ (స) గారు ఇలా సెలవిచ్చారు: అర్ధరాత్రి ఘడియలు. ఆ రేయి అంతటిలో శ్రేష్టమైనది మాసాలలో అతి గౌరవప్రదమైనది అల్లాహ్ యొక్క మాసం దానిని "ముహర్రం" అని అందురు. కానీ రంజాన్ మాసం కూడా ఈ మాసం కిందికే వస్తుంది. (ఖుసూసియ్యాతే మాహే ముహర్రముల్ హారం)

ముహర్రం లోని ఉపవాసాల విశిష్టత (గొప్పతనం)

ఈ మాసంలోనే ఉపవాసాలకు చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ మాసానికి నేరుగా అల్లాతో సంబంధం కలదు. దీని గురించి మిష్కాతులోని 2048వ హదీసులో ప్రస్తావన ఇలా ఉంది:
أفضل الصيام بعد رمضان شهر الله المحرم.

రంజాన్ ఉపవాసాల తర్వాత శ్రేష్టమైన ఉపవాసాలు అంటే అవి అల్లాహ్ నెల యొక్క ముహర్రం వే.

ముహరం మాసపు కొన్ని ముఖ్యమైన పురాణాలు

ఖైబర్ యుద్ధం హిజరీ యొక్క ఏడవ సంవత్సరంలోని ముహర్రంలో చోటుచేసుకుంది మరియు హిజ్రా యొక్క 14వ సంవత్సరంలో "ఖాద్సీయా" యుద్ధం కూడా ఈ ముహర్రం నెలలోనే నెలకొంది. ఈ యుద్ధంలో ముస్లింల సేనాధిపతిగా హజరత్ సాద్ బిన్ వఖ్ఖాస్ (ర) గారు ఉండిరి మరియు అవిశ్వాసులకు పెద్దగా "రుస్తం"అనే అతను ఉండేవాడు. మూడు రోజులు వరుసగా వారి మధ్య రణం జరిగిన తర్వాత చివరికి నాలుగవ రోజున యుద్ధపు విజయం ముస్లింల వైపుకు మల్లుకుంది. 18వ హిజ్రీలోని ముహర్రం మాసం లో యుద్ధంలో ఉండి, హజరత్ అబూ ఉబైదా (ర) గారి పరలోక పయనం ఇరాక్ లో జరిగింది. 24 వ హిజ్రీ లో హజరత్ ఉస్మాన్ (ర) గారు తమ రాజాధికారాన్ని ఇదే మాసంలో చేజిక్కించుకున్నారు. 61వ హిజ్రీలో హజరత్ ఇమామ్ హుస్సేన్ రా గారి వీరమరణం చోటుచేసుకుంది మరియు అంతేకాక 74వ హిజ్రిలోనే "అబ్దుల్లాహ్ బిన్ ఉమర్" గారి వీర మరణం నెలకొంది. 67వ హిజ్రీలో అబ్దుల్లాహ్ బిన్ జియాద్ ముహర్రం మాసంలోనే మరణించాడు.ఇవన్నీ కేవలం కొన్ని సూచనలు మాత్రమే నిజానికి ముహర్రంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలు గ్రంథాలలో తండోపతండాలుగా పడి ఉన్నాయి.

ఈ నెలలో చేయవలసిన మరియు చేయకూడని కొన్ని కార్యాలు

ఆషూరా దినపు ఉపవాసం ఉండడం

ఇంటి వారిపై ఖర్చు ఎక్కువ మొత్తంలో చేయాలి.

ఫరాయిజ్ ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, నఫిల్ ప్రార్థనలను కూడా ఎక్కువ మొత్తంలో చేయాలి.

అసత్కార్యాల నుండి దూరంగా ఉండాలి మరియు

తప్పనిసరిగా సున్నత్ ను అదాపరచడం.


అంతేకాక మరికొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవి:

నల్లటిల్లి దుస్తులు ధరించడం మరియు నల్లటి జెండాలు కట్టడం.

చెడు మరియు దురదృష్టపు మాసమని అనుకుని ఉండడం.

సమయాన్నంతా బాధపడుతూ గడపడం.

షర్బతులతో వగైరా దారులపై అల్లకల్లోలం చేసి పారబోయడం మరియు

మనసుకు నచ్చిన సంప్రదాయాలను అనుసరించడం వగైరా...

అల్లాహ్ ఈ ముహర్రం మాసాన్ని గొప్పగా ఆహ్వానించి, మంచిగా గడుపుతూ సంవత్సరం పొడవుగా ఆయన దారిలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించు గాక!..... ఆమీన్!....

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter