హిజ్రత్ ఇస్లామిక చరిత్రలో జరిగిన మైలురాయి సంఘటన - రెండవ భాగం

ఇదంతా తెలిసిన ఖురైష్ అప్పటికప్పుడే ఎమర్జెన్సీ సందర్భాన్ని ప్రకటించారు. అంత పెద్ద బహుమానం పొందే దానికి వారిలోని పెద్ద పెద్ద వీరులంతా మక్కా నగరంలో పూర్తిగా విస్తరించారు. అప్పుడు అలా వెళుతుండగా ఒక సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం మరియు అబూబకర్ రదియల్లాహు అన్హు ఉన్న గుహ దగ్గరికి చేరుకున్నారు. వారందరూ ఆ గుహ యొక్క ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. వీరిని చూసిన అబూబక్కర్ రదియల్లాహు అన్హు లోపలి నుండి ప్రవక్తతో ఇలా అడిగారు, ఓ ప్రవక్త వారు గనక కిందా లేదా పైకి చూస్తే, మేము వాళ్ళకి దొరికిపోతాము. అప్పుడు ప్రవక్త ఇలా బదులిచ్చారు, ఇద్దరు ఉన్నచోట అల్లాహ్ మూడో వానిగా ఉండటంలో నీ అభిప్రాయం ఏమిటి.

إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّـهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّـهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّـهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا (التوبة - 40)

ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయక పోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్‌ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్య- తిరస్కారులు అతనిని పారద్రోలినపుడు, అల్లాహ్‌ అతనికి సహాయంచేశాడో! అప్పుడు అతను ఇద్దరి లో రెండవ వాడిగా (సౌ'ర్‌) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటివాని (అబూ-బక్ర్‌)తో: ''నీవు దుఃఖపడకు, నిశ్చయంగా అల్లాహ్‌ మనతో ఉన్నాడు!'' అని అన్నాడు. 33 అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవత రింపజేశాడు. అతనిని మీకు కనిపించని దళాలతో సహాయం చేశాడు.

అవిశ్వాసులు గుహ ముందు చూస్తే అక్కడ ఒక సాలీడు పురుగు తన జాలను వేసి ఉన్నది. అలాగే దాని దగ్గరలో పావురం చిన్న గుడ్డు పెట్టి ఉన్నది. ఇది గమనించిన ఖురైష్ వారు ఇలా అనుకున్నారు, ఒకవేళ ప్రవక్త మరియు అబూబకర్ ఈ గుహ ద్వారా లోపలికి వెళ్లి ఉంటే ఇక్కడ సాలీడు పురుగు యొక్క జాల మరియు పావురం యొక్క గుడ్డు ఉండేది కాదు. అలా అని తిరిగి వెళ్ళిపోయారు.

ఇదే అవస్థలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆ గుహలో మూడు రోజుల వరకు ఉన్నారు. ఖురైష్ వారి తపన తగ్గాక అబ్దుల్లా ఇబ్ను ఉరైఖిత్ వారి వద్దకు వచ్చారు. వీరందరూ కలిసి సముద్రతీరు మార్గంలో ప్రయాణం చేపట్టారు. బాధాకరమైన విషయం ఏమిటంటే హజ్వా అన్న పర్వప్రాంతంలో నిలుచుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుతెరిగి చూసారు. చివరిసారిగా తన యొక్క స్వదేశమైన మక్కాను విడిచిపెట్టి వెళుతూ వలస వెళుతున్నాను అన్న భావంతో, తిరుగు ప్రయాణం లేని ఈ దారిలో చాలా బాధాకరంగా దృష్టి సారించారు. అక్కడ తన బాల్యం... తన జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించసాగాయి. మక్కాను ఉద్దేశించి ఇలా అన్నారు, దేవుని సాక్షిగా అల్లాహ్ యొక్క ప్రియ పట్టణాములలో నీవు అతి ప్రియమైనదానివి. నీయొక్క వాసులు నన్ను తరిమివేయకపోతే నేను కచ్చితంగా ఇక్కడే ఉండేవాడిని.

బను మిద్లజ్ యొక్క దారి గుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వెళుతుండగా అక్కడ సురాఖత్ ఇబ్ను మాలిక్ ఒక సభలో కూర్చుని ఉన్నాడు. అందులో ఎవరో ఇలా నేను ప్రవక్తను వారి యొక్క పాదచరములను చూశాను అనగా సురాఖత్ ఎలాగైనా ఆ పెద్ద బహుమతిని పొందాలని ఆశతో వారందరినీ తప్పుదారి మళ్లించడానికి ఇలా అన్నాడు, వారు ప్రవక్త కాదు వేరే వాళ్ళు వెళ్తుండగా నేను చూశాను. ఆ తర్వాత కొంత సమయం అయ్యాక సురాఖత్ తన ఇంటికి వెళ్లి ఆయుధాలు సిద్ధం చేసుకుని, ప్రవక్త యొక్క పాధ చరములను అనుసరించాడు. వెళుతుండగా ప్రవక్తను చూసేసాడు వారిని సమీపించి ప్రవక్త ఖురాన్ పఠిస్తుండగా విన్నాడు. అబూబకర్ సురాఖత్ సమీపిస్తుండగా గమనించారు. ప్రవక్తతో ఇలా చెప్పారు, ఓ ప్రవక్త మేము దొరికిపోయాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి చెప్పకుండా ఇలా దువా చేశారు, ఓ అల్లాహ్ అతన్నుండి నువ్వే మమ్మల్ని రక్షించు. అతని కింద పడివేయి. అలా చెప్పగానే గుర్రం మీద స్వారీ చేస్తున్న సురాఖత్ అక్కడే ఎడారిలో చిక్కుకున్నాడు. చాలా ప్రయత్నించిన తర్వాత మళ్ళీ ప్రవక్తని పట్టుకోవడానికి ముందుకెళ్లాడు. మళ్లీ గుర్రం యొక్క కాళ్ళు ఎడారి ఇసుకలో చిక్కుకున్నాయి. చివరికి ప్రవక్త ఇలా అన్నారు, నేను నీకు ఒక హామీ ఇస్తాను. నీ చేతిలో కైసర్ యొక్క కంకణాలు ఉంటే నువ్వు ఎలా స్పందిస్తావు. ఇది విన్నాక సురాఖత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

 

ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం వలస మొదలుపెట్టినప్పుడు, ఈ సమాచారం మదీనాలోని అన్సార్ వారికి తెలిసిపోయింది. అప్పటినుంచి వారందరూ ప్రవక్త రాక కోసం చాలా గౌరవంతో ఆనందంతో ఆత్రుతతో ఎదురు చూడ సాగారు. మదీనా వైపు వచ్చే ప్రతి వ్యక్తిని ప్రవక్త అనుకునేవారు. ప్రతిరోజు ఫజర్ నమాజ్ తర్వాత నుండి మధ్యాహ్న సమయం వరకు మక్కా రహదారిలో నిరీక్షించసాగారు. ఇలా మధ్యాహ్న లో ఎండ ఎక్కువ అయ్యేవరకు వేచి తిరిగి తమ ఇళ్ళకు చేరుకునేవారు. ఒకరోజు ఇలా చేయగా ఎండ ఎక్కువగా ఉన్న కారణంతో తమ ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఒక యూదుడు ప్రవక్త మరియు తన రెండు సహచరులు మదీనా వైపు వస్తుండగా చూసి మదీనా వారి యొక్క తపన పై జాలిపడి పెద్ద శబ్దంతో ఇలా పిలిచాడు, ఓ అరబు వాసులారా, మీరు వేచి చూసిన వ్యక్తి రానే వచ్చాడు. ఇది వినగానే ముస్లింలందరూ పెద్ద శబ్దంతో తక్బీర్ చదవసాగారు. తమ మనసులోని ఆనందానంత ఒక్కసారిగా కవిత్వ రూపంలో ఏక స్వరంతో చదివారు

طَـــــلَــــــــــعَ البَــــدْرُ عَـــلَيـْنَا مِــــــــنْ ثَــــــــــــــــــنــِيَّات الوَدَاعْ

وَجَــــــــــــــبَ الشُّــــــــــكْـــــرُ عَــــلَــــــيْـــــــنَا مَا دَعَــــا لله دَاعْ

 

أَيُّــــــــــــهَا المَـــبْعُوثُ فينَا جِــــــــئْـــــــــــــــتَ بالأمْـــــرِ المُطَاعْ

جِــــئْــــتَ شَرَّفْتَ المَـــدِيــــنَــــة مَرْحَـــباً يَــــا خَـــــــــــيــْرَ دَاعْ

 

ఖురాన్ లోని ఈ శ్లోకం అవతరించబడింది,

فَإِنَّ اللَّـهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ

నిశ్చయంగా, అల్లాహ్‌ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్‌ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి).

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter