షా'బాన్ బారా'అత్ రాత్రి: ప్రత్యేకతలు, శుభాలు
అల్లాహ్ త'ఆలా ప్రసాదించిన సమయాలని వీలైనంత సాధ్యతతో సద్వినియోగం చేసుకోవాలని ఎందరో చరిత్రకారులు మహానుభావులు అనుభవజ్ఞులు తెలుపుతూ వచ్చారు. ముఖ్యంగా అల్లాహ్ ప్రసాదించిన శుభమైన సమయాలను, అందులో నమాజ్, ఉపవాసం, ప్రార్థన, అనుస్మరణ మొదలగు వంటి ముఖ్యమైన ఆరాధనలు చేసుకుంటూ వినియోగం చేసుకోవాలని లిఖించబడింది.
అటువంటి శుభమైన సమయాలలోని ఒక రాత్రి చాలా శుభమైనది, ఆ రాత్రి షా'బాన్ నెలలోని మధ్య రాత్రి (అంటే 15వ రాత్రి) ఆ రాత్రి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ప్రవచనాలు బోధింపబడ్డాయి. అలాగే ఖురాన్ లోని కొన్ని శ్లోకాల భావం తెలుపుతూ పెద్ద పెద్ద భా పండితులు ఆ రాత్రి షా'బాన్ రాత్రి అని సూచించారు.
అల్ హాఫిజ్ ఇబ్ను రజబ్ తన పుస్తకం లతాయిఫుల్ మఆరిఫ్ ఫిమా లిమవాసిమి అల్ ఆమ్ మిన అల్ వజాయిఫ్ (لطائف المعارف فيما لمواسم العام من الوظائف) అనే పుస్తకంలో ఈ విధంగా ప్రస్తావించారు: అల్లాహ్ షా'బాన్ లోని మధ్య రాత్రిలో ప్రపంచ ఆకాశంలో హాజరవుతాడు. అప్పుడు ఒక మేకకు ఉన్న వెంట్రుకల కన్నా ఎక్కువగా తన సృష్టి పాపాలను మన్నిస్తాడు.
మరొక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా తెలియజేశారు: అల్లాహ్ షా'బాన్ మధ్య రాత్రిన తన సృష్టి పై నిఘా ఉంచుతాడు. అప్పుడు బహుదైవారాధకుడు లేదా ముషాహిన్ తప్ప అందరిని క్షమిస్తాడు.
ఇబ్ను సౌబాన్ ప్రకారం: ముషాహిన్ అంటే ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలను వదిలేవాడు, వారి యొక్క ఉమ్మత్ పై ఆరోపించేవాడు, వారి రక్తాలను చిందించేవాడు.
అలీ రదియ అల్లహు అన్హు యొక్క ఉల్లేఖనంలో: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: షా'బాన్ నెలలోని మధ్య రాత్రి వస్తే, ఆ రాత్రంతా మీరు ప్రార్థనలతో మేలుకోండి మరియు ఆ దినమంతా ఉపవాసం ఉండండి. ఎందుకంటే ఆ రోజున సూర్యాస్తమయం వరకు అల్లాహ్ పై ఈ ప్రపంచ ఆకాశంలో అవతరిస్తాడు. అప్పుడు ఇలా ప్రకటిస్తాడు: ఎవరైనా తన పాపాల మన్నింపు కోరుకునే వాడు ఉన్నాడా? అయితే నేను మన్నిస్తా! ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా? నేను ప్రసాదిస్తా! ఎవరైనా సమస్యలో ఉన్నాడా? నేను తనని ముక్తి కలిగిస్తా! ఇలా అంటూ అంటూ వేకువ జామున వరకు ఉంటాడు.
ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి రాత్రి వేళ అందరూ ఈ శుభ ఘడియాలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో పుణ్యం కలిగిన అమలు. రాత్రంతా ప్రార్థనాల కొరకై మేలుకొని అల్లాహ్ ను స్మరిస్తూ ప్రార్థన చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి చివరి సమయాన్ని తన పాపాలను మన్నించమని వేడుకోవాలి.
ఈ రాత్రిలో ఉన్న మరొక ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే ఈ రాత్రిలో చాలా పెద్ద పెద్ద పాపాలు కూడా మన్నించబడతాయి. పెద్ద పెద్ద పాపాలు అని ఏమని చూస్తే, దాని యొక్క భావంలో ఈ విధంగా తెలియపడుతుంది -
పెద్ద పాపాలు అంటే అల్లాతో మరొక సృష్టిని దైవంగా భావించడం మరియు
ఏ హక్కు లేకుండా ఇతర వ్యక్తిని చంపడం మరియు
తనకు హలాల్ కానీ వారితో సంభోగించడం
15వ రాత్రి మొదలవగానే చేయాల్సిన ముఖ్య ప్రార్ధనలు:
సూరత్ యాసీన్ మూడుసార్లు పఠించాలి. ఈ మూడుసార్లు పఠించడంలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. మొదటిగా యాసిన్ చదివిన తర్వాత అల్లాహ్ మనకు ఈ జీవితంలో దీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని వేడుకోవాలి. రెండవసారి యాసిన్ చదివినప్పుడు మనకు ఈ జీవితంలో హలాల్ సంపాదన కలగాలని కోరుకోవాలి. మూడవసారి పఠించినప్పుడు ఈ జీవితంలోని చివరి క్షణాలు అంటే మరణ సమయంలో హస్నుల్ ఖా (శుభ సమాప్తం) లభించాలని కోరుకోవాలి. అలాగే సూరత్ దుఖాన్ ఒకసారి పఠించాలి. ఇంకొంత పండితులు ఈ విధంగా తెలియజేశారు మఘ్రిబ్ నమాజ్ పిదప 3 సలాంలతో కూడిన ఆరు రక'అత్ నమాజ్ చేయాలి.
అలాగే ఇంకా ఎన్నో ముఖ్య ప్రార్ధనలు ఉన్నాయి, జికర్ కూడా ఉన్నాయి. అల్లాహ్ త'ఆలా ఈ శుభ సమయాన్ని వీలైనంత సాధ్యతతో సద్వినియోగం చేసుకునేలా అందరికీ అవకాశం కల్పించుగాక.