షరీఅత్: ఫిఖ్ మరియు ఉసూల్ ఫిఖ్ యొక్క చారిత్రక అవసరం
షరియత్ మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఎక్కడికైనా వెళ్లిన ప్రార్థన చేసిన ఎవరికైనా శిక్ష ఇవ్వాలన్నా మనకి షరియత్ చాలా అవసరం. ఎందుకంటే మనకు షరియత్ లో చాలా ఆదేశాలు ఉన్నాయి. దానిని మనం పాటించాలి. దానిని పాటించడం మనకు చాలా అవసరం. ఈ ఆదేశాలన్నీ మన ముందు వచ్చిన ఇస్లాం పండితులు ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాపియ్యి ఇలాంటి అందరూ ఖురాన్ మరియు హదీస్ నుంచి తీసుకున్నారు.
మన వాడుక మాటల్లో షరియత్ అంటే ఫిఖ్. ఫిఖ్ అనగా షరియత్ యొక్క ఆదేశాలను తెలుసుకునే విద్యని ఫిఖ్ అంటారు. ఫిఖ్ యొక్క విద్య అంటే ఓ ముక్కల్లఫ్ చేసే పనులు ఎవరి మీదైతే షరియత్ యొక్క ఆదేశాలు విధి అవుతాయో ఆ విద్య గురించి తెలుసుకోవడమే ఫిఖ్ అంటారు.
ఫిఖ్ ను చాలా బాగా ఆదేశాల పై నిర్ణయం తీసుకునే వాడే ఖాజి ఏమైనా నిర్ణయం తీసుకోవడం గాని లేకపోతే న్యాయం చేయడం కోసం ఫిఖ్ చాలా అవసరం అవుతుంది.
ఫిఖ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం కాలం నుంచి మొదలైనది. దీన్ని ఆధారంగా మన ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా اللهم فقهه في الدين
నీ తీసుకోవచ్చు. కానీ దీనిని ఓ అంశంగా తీసుకోలేదు. మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తరువాత ప్రవక్త చేసిన నిర్ణయాల పైనే నిర్ణయం తీసుకుంటూ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు దాని పైనే నిర్ణయం తీసుకునేవారు. కానీ దాని తరువాత అరబ్ కాకుండా అరబ్ బయట నుంచి చాలామంది ఇస్లాం స్వీకరించారు. అందువలన చాలా షరియత్ లో అంటే ప్రవక్త తీసుకున్న నిర్ణయాలపై తమరు తర్వాత తమరి అనుచరలు తీసుకున్న నిర్ణయాల మించి చాలా ఆదేశాలు పుట్టుకొచ్చాయి. ఈ కష్టాన్ని తొలగించడానికి అప్పుడు ఇస్లాం పండితులు ఉసులుల్ ఫిఖ్ నీ సృష్టించారు.
దీనిలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ విద్య మన తబీన్ యొక్క కాలంలో నిర్ణయించబడినది. ఈ విద్యతో చాలా కష్టాలు మరియు కొత్త కొత్త ఆదేశాన్ని నిర్మించారు. ఇందువలన దీనిని ఓ అంశంగా తీసుకుని ఇప్పుడు ఇస్లామిక విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. ఈ విద్య వచ్చిన తర్వాతే ఫిఖ్ కూడా ఓ అంశంగా మొదలైనది.
ఫిఖ్ ప్రకారంగా ఇస్లాంలో చాలా మస్లక్లు ఉన్నాయి. దీనిలో ఇప్పుడు నాలుగు మస్లక్లు ఉన్నాయి అవి:
1.హన్ఫి
2.షఫీ
3.మాలికి
4.హంబలి
దీనిలో ఎక్కువగా హన్ఫి వారే ఉన్నారు.
ఫిఖ్ యొక్క ఆదేశాల గురించి చాలా అంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి పుస్తకం మన హన్ఫి యొక్క ఇమామ్ l అబూ హనీఫ యొక్క శిష్యుడు ఇమామ్ అబు యూసుఫ్ యొక్క పుస్తకం. కానీ అది మనుషులలో వ్యాప్తి చెందలేదని దాని గురించి ఏ చర్చ జరగలేదు. ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇదిరిస్ తమరు రాసిన పుస్తకం"الربيع المرادي" అని అరబిలో రాసారు. ఆ పుస్తకాన్ని మొట్టమొదటి పుస్తకంగా నిర్ణయించారు.
మన అందరికీ విధిగా అయినా ఈ విద్యను నేర్చుకోవాలి.