ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వివిధ రకాల సందేశాలను పరిగణించ వచ్చు. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అతి ఉత్తమమైనది ! ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం యొక్క దయ, కరుణ తన ఉమ్మత్ పై చూపించిన విధానాన్ని మనం చూడవచ్చు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కేవలం మనుషులపై, జంతువులపై కా ఈ విశ్వం లోని ప్రతి జీవి పై, ప్రతి వస్తువుపై దయ మరియు కరుణ గలిగిన వారు మన మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు! మరి ప్రవక్త మహమ్మద్ మేము సర్వలోకాలకు రహమత్ మరియు దయగలవాడిగా పంపాము అనే శ్లోకం మొత్తం విశ్వాన్ని సూచిస్తుంది తప్సీర్ రూహుల్ మఅని లో విధ్వాంసులు ఈ విధంగా రాసారు. మేము తమరిని కేవలం ప్రవక్తగా కాదు, శాశ్వతమైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన, విశ్వవ్యాప్తిలా పంపాము మరియు సర్వశక్తిమంతుడై, సర్వజ్ఞుడై, దయగలవాడై మరియు ఆయన అన్ని లోకాలకు ఉత్తముడిగా నిలిచాడు. అది పరలోకమైనా లేదా ఇహలోకమైనా ఏ లోకమైనా ఆయనే ఉత్తమం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఈ విశ్వాన్ని దయతో జ్యోతితో వ్యాపింపజేశాడు. ఆయన దయ కేవలం తన స్నేహితులకు మాత్రమే పరిమితం కాకుండా తన సన్నిహితుల పై, అవిశ్వాసులపై కూడా చూపించారు. కావున అల్లాహ్ సుబహానహు వతఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కరుణ, దయ మరియు జాలితో నిండిన ఓ సముద్రం లా పంపాడు. ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం తన మంచి స్వభావంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు దానిని తెలుసుకున్న వారు దానిపై అమలుపరిచి స్వర్గమార్గాన్ని ఎంచుకున్నారు. మరియు ఉత్తములుగా నిలిచిపోయారు. దయా యొక్క గుణాన్ని ఆయన ఒక మాయ తాళములా తయారు చేసుకున్నారు. దానితో ఎటువంటి తుప్పు పట్టిన మనుషులనైనా వారికి స్వర్గమార్గాన్ని చూపించే వారు మరియు వారిలో దయ మరియు కరుణతో కూడిన జ్యోతిని వారి హృదయాలలో ప్రకాశింప చేసేవారు. అల్లాహ్ ఆ తాళాన్ని మొత్తం జీవులలో ఉత్తమమైన మరియు అర్హుడైన మన ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లంను అప్పగించారు. ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఎల్లవేళలా దయ ప్రయోజనాన్ని పొందేవారు ఆ ప్రశంసను దివ్య ఖురాన్ లో ఈ విధంగా పేర్కొన్నది ప్రవక్త విశ్వాసుల పట్ల అత్యంత దయగలవాడు
ఆయన దయ నుండి విశ్వాసులులే కాదు చివరికి అవిశ్వాసులు కూడ ప్రయోజనాన్ని పొందేవారు అంతటి దయగల వారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంగారు. ఆయన ఇతరులను తన మంచి మాటల ద్వారా,మంచి ప్రవర్తన ద్వారా లేదా మంచి పుస్తకాలకు పరిమితం కాకుండా తన జీవితం ద్వారా ఎలా ఉపయోగించాలో నేర్పించారు. ప్రతి ఒక్కరితో మంచిగా మెలగడం ,పెద్దలపట్ల గౌరవం ,చిన్నవారిపై ప్రేమతో మెలగాలనే పాఠాలను మనకు అప్పగించారు. నేను విశ్వాసుల దగ్గర వారి ప్రాణాల కన్నా ఎక్కువ విలువ గలవాడిని.ఒకవేళ విశ్వాసులు ఎవరైనా చనిపోతే వారి పై అప్పు ఉంటే దాన్ని తీర్చే బాధ్యత నాది అని వారు ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఉపదేశించారు. అలాగే అవిశ్వాసులతో కూడా దయను పంచేవారు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని కారణంగానే ఎందరో అవిశ్వాసులు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వారి అనుచరుల నుండి పూర్తి లాభాలు మరియు ప్రవచనాలను పొందేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అవిశ్వాసాన్ని గుర్తించినా వారి నిజస్వరూపాన్ని బయటపెట్టేవారు కాదు పూర్వంలో అల్లాహ్ సుబహానహు వతఆలా ఉమ్మత్తులలో అయితే బహు దైవారాధన ( షిర్క్) మరియు అవిశ్వాసం కారణంగానే మొత్తం ఉమ్మత్తును నాశనం చేసేవాడు. కానీ మన ప్రవక్త మహమ్మద్ కోసం ఆ శిక్ష ను కూడా తొలగించారు మరియు దివ్య ఖురాన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు ఓ !ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం మీరు ఎవరితో ఉంటారో వారిని అల్లాహ్ ఎలాంటి శిక్షను వహించడు మరియు వారిని అల్లాహ్ క్షమిస్తాడు.మరి ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తున్నారు అల్లాహ్ నన్ను దయగలవాడిగా పంపాడు, దానికి ఉదాహరణ ఉహుద్ యుద్ధంలో కనిపిస్తుంది తన నిజమైన సోదరుడిగా భావించే తన చిన్నాన వీరమరణం పొందారు. అతని శరీరం ముక్కలు ముక్కలుగా విభజించబడింది పవిత్రమైన శరీరం నుండి రక్తం కారుతుంది, అతనిపై శత్రువులు దాడులు జరుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు మరియు అల్లాహ్ ను ఈ విధంగా వేడుకున్నారు ఓ అల్లాహ్ నా ప్రజలను క్షమించు వారు తెలియక చేశారు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను శత్రువులు చంపాలని చూస్తున్న వారిపై శపించకుండా వారి క్షమాపణల కోసం అల్లాహ్ ను వేడుకున్నారు. అలాగే 20 రంజాన్ ఎనిమిదో హిజరీలో జరిగిన ఫతహ్ మక్కా తర్వాత కూడా ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం మరియు వారి అనుచరులపై వివిధ రకాల ఆపదలను కలిగించిన వారు, వివిధ రకాల శిక్షలను ఇచ్చినవారు, బనూ ఖుజా ఆ మరియు వారి కుటుంబ సభ్యులను పవిత్ర స్థలమైన కాబతుల్లాలో కూడా వదలకుండా వెంటాడి మరియు ఇక్రిమామాబినుమయ్య లాంటి అతి క్రూరమైన శత్రువులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ ముందు ఉన్నారు.ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తలుచుకుంటే వారందరినీ ఒకేసారి హతమార్చి తమ పగను తీర్చుకోవచ్చు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుండి ఆణిముత్యా లాంటి క్షమాపణలు ,స్వేచ్ఛగా జీవించే హక్కులు రాలేయి .
జంతువుల పట్ల దయ,
రహమతులిలాలమీన్ అనే పద సందేశం జీవలోకం మరియు పరలోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశులకు వర్థిస్తుంది హజరత్ అబ్దుల్ రెహమాన్ ఇలా వివరిస్తున్నారు ఓ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు మేము చెట్ల మీద ఉన్న రెండు పక్షి పిల్లలను పట్టుకున్నాము. అప్పుడు పక్షి తల్లి విలవిలాడటం మొదలుపెట్టింది అది చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుండె కరుణతో కరిగిపోయింది.అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పేర్కొన్నారు ఓ సహచరులారా ! పక్షి పిల్లలను వదిలేయండి వాటిని బాధ పట్టించకండి అని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రవక్త యొక్క కరుణ కేవలం మనుషుల వరకు మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది. పిల్లల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయ మరియు కరుణ హజరత్ అబు హురైరా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం ప్రస్తావిస్తున్నారు నేను నమాజ్ ప్రారంభించేటప్పుడు నా ఆలోచన నమాజ్ ను పొడిగించాలని ఉంటుంది కానీ నాకు పిల్లల ఏడుపు వినిపిస్తే నమాజ్ ను తొందరగా ముగిస్తాను అల్ బుఖారి
దాని కారణం ప్రవక్త తో పాటు యువతులు కూడా నమాజ్ లో పాల్గొనేవారు ఒకవేళ ఆ నమాజులో వారి తల్లులు ఉంటే పిల్లలకు కష్టమవుతుందని అవుతుందేమో అన్న ఆలోచనతో నమాజ్ ను తొందరగా ముగించేవారు అంతటి దయ మరియు జాలి మనసు కలిగిన వారు మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బాధ కలిగించడం కాదు బాధ కలిగించే పనుల నుండి కూడా చాలా ద్వేషించేవారు. అందుకే ఇస్లాంలో ప్రసిద్ధి ఎక్కిన వారు ఈ విధంగా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం దయా యొక్క విరి పరిధి చాలా విస్తారణమైనది మొదటి నుండి చివరి వరకు, భూమి నుండి ఆకాశం వరకు, ఆదము నుండి ప్రళయం వరకు، చిన్న నుండి పెద్ద వరకు، తక్కువ నుండి ఎక్కువ వరకు సంపద కలిగిన వారైనా లేదా కలగని వారైనా అందరూ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం జాలి దయా కరుణ పొందుతూనే ఉంటారు అల్లాహ్ సుబనాహు వా తాలా మనందరినీ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం దయతో కూడిన వ్యక్తులలో ఉంచు గాక. ఆమీన్,
షేక్ రఫీ
దారుల్ హుదా, పుంగనూరు.