పిల్లలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కరుణతో కూడిన ప్రవర్తన ప్రవక్త.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఏ కోణాన్ని చూసినా ఆయన సంపూర్ణులుగా కనిపిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైవాహిక జీవితాన్ని గమనిస్తే ఆయన భార్యలకు ఉత్తమ భర్త మరియు యుద్ధ విషయానికి వస్తే ఆయన ఓ గొప్ప వీరుడు మరియు యోధుడు. అందుకే ప్రపంచంలోని ధైర్యవంతులు దూరంగా ఉండేవారు. ప్రవక్త ప్రవర్తన చూస్తే వారు ఓ గొప్ప ఉత్తమ గురువు. అలాగే పిల్లలపై ఆయన కంటే ఎక్కువ కరుణిచేవారు ఎవరూ ఉండరు. కేవలం పిల్లల తో ప్రేమగా ఆప్యాయంగా మరియు సన్నిహితంగా ఉండాలి. కాగా దీనికి విరుద్ధంగా తమ చర్యల ద్వారా రుజువు సమర్పించారు. పిల్లల పట్ల ఈ విధంగా బోధించారు! పిల్లల పట్ల దయ చూపని మరియు పెద్దల పట్ల గౌరవిచనివాడు మనలో ఒకడు కాదు (సునన్ అబి దావూద్) ఇప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో పిల్లల పట్ల మంచి ప్రవర్తన యొక్క కొన్ని ఉదాహరణలు గురించి తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హసన్ (రజి) తో ప్రవర్తన. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ను నమాజుకు తీసుకువెళ్లారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నమాజు చదివిస్తుండగా ప్రవక్త సజ్దా సమయంలో ఉన్నప్పుడు తన వీపు పై స్వారీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు చాలా సేపటి తరువాత షద్దాద్ (రజి) నమాజ్ మధ్యలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పై తన కుమారుడు స్వారీ చేయడం చూశారు. నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దాని గురించి ప్రశ్నించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు!తన కుమారుడి అవసరం తీర్చే ముందు నాకు సజ్దా ముగించడం సముచితమని నేను భావించలేదు. మరోచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ (రజి)ముద్దు పెట్టుకుంన్నారు. అది చూసిన ఇక్రా బిన్ హాబీస్ ఇలా అన్నాడు: నాకు పది మంది పిల్లలు ఉన్నారు నేను ఎవరిని ఇప్పటివరకు ముద్దు పెట్టుకోలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు! అల్లాహ్ మీ హృదయం నుండి కరుణను తొలగిస్తే నేను ఏమి చేయగలను? మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త తన పిల్లలను మాత్రమే ప్రేమించలేదు, దీనికి విరుద్ధంగా పిల్లలపట్ల దయ కలిగి ఉండాలని సందేశాన్ని ఆదేశించారు. అలా చేయని వాడు అల్లా దగ్గర కనికరం చూపబోడని బోధించారు. ఇతర పిల్లలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తన మదీనాలో ఎవరి ఇంట్లో పిల్లలు జన్మిస్తే వారిని ప్రవక్త దగ్గరకి తెచ్చేవారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లవాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకొని ఆశీర్వాదం కోసం ప్రార్థించేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నమాజు చదువుతుండగా పిల్లల ఏడుపును వింటే నమాజ్ ను తొందరగా ముగించే వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లల హక్కులను ఏ విధంగా చేయాలో చూపించారు. ఈరోజు అన్ని వివాదాలు పరిష్కారం హక్కుల చెల్లింపు పై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన హక్కులను అడుగుతున్నారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్కటి నేర్పించారు. అంతేకాదు విరుద్ధంగా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ముందుగా అస్గర్ల హక్కులను ఇచ్చారు. తద్వారా ఉమ్మత్తును అందరి హక్కులను చెల్లించాలని బోధించారు. మనం దానిని ఓ సంఘటన ద్వారా తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు తాగేందుకు పాలను తీసుకువచ్చారు. దాన్ని తాగారు ఆ తరువాత ప్రవక్త తన కుడివైపున ఓ బాలుడు మరియు ఎడమవైపున పేరు పొందిన సహచరులు ఉన్నారు. అది చూసిన ప్రవక్త! ఆ బాలుడితో ఈ విధంగా అన్నారు. మీరు అనుమతిస్తే ఈ పాలను పెద్ద వాళ్లకు ఇస్తాను. అని అనుమతిని కోరారు. ఆ బాలుడు నాకు వచ్చిన అవకాశాన్ని నేను వృధా చేసుకోను అని అన్నారు. ఈ హదీసులో పిల్లల హక్కులను తెలుసుకొని వారి హక్కులను పూర్తిగా చెల్లించే ఏర్పాటు చేయాలని సూచన ఉంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రతి ఒక్కరి హక్కులను వారి హక్కులుగా భావించి వారి హక్కులను వారికి ఇచ్చేవారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం లో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా మరియు మార్గదర్శకుడిగా మారారు. కొన్నిసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం పిల్లల దయ మరియు ప్రేమ పూర్వక ప్రవర్తన,వాళ్లతో హాస్యాలు చెప్పటం. మరియు వినోదాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కరుణతో ప్రవర్తించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం అంత ఉత్తమ వ్యక్తిత్వం కలిగి ఉండి మరియు ప్రవక్త అయిన కూడా ఆయన పిల్లలతో కరుణతో మెలిగేవారు అందుకే సహచరులు ఆశ్చర్యపోయేవారు. ప్రవక్త చాలా ప్రేమగా ప్రవర్తించేవారు వారిని భుజాలపైకి ఎత్తుకోవటం, ముద్దాడటం వంటివి చేసేవారు. ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం తన మనవాళ్లతో చాలా ప్రేమగా నిలిచేవారు. ఓసారి వారిని భుజాలపైకి ఎత్తుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు.
ఓ ప్రవక్త మీరు వారిద్దరిని చాలా ప్రేమిస్తున్నారా? ప్రవక్త ఈ విధంగా అన్నారు! వారిద్దరిని ప్రేమించేవాడు నన్ను ప్రేమించినట్లే వారిని ద్వేషించేవారు నన్ను ద్వేషించినట్లే వాళ్లకోసం ఎన్నోసార్లు ప్రసంగ పీఠం నుండి దిగి వాళ్లను హత్తుకున్నారు, వాళ్ళు కోసం సజ్దాను పొడిగించేవారు,వాళ్ళతో ఆడుకునేవారు. ఇలా రకరకాల రకరకాల అనుబంధాలు. తన మనవళ్లతో కలిగి ఉన్నాయి. పిల్లలకు మార్గదర్శకత్వంతోపాటు బహుమతులను కూడా పంపించేవారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి మరియు ఆశీర్వాదం కోసం తెచ్చిన మొదటి ఫలాన్ని మొదటి ఫలాన్ని పట్టుకొని ఈ విధంగా అనేవారు. ఓ అల్లా మా పండ్ల మరియు మా కొలతలను మాకు అనుగ్రహించండి. మరియు ఆ పండ్లను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలలో సమానంగా పనిచేవారు. ఏ రకమైన కులమత విభేదాలు లేకుండా అందరికీ సమానంగా పంచేవారు. అలాంటి ప్రవర్తన వలనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి మనసులను దోచుకున్నారు. ఆకర్షించుకున్నారు. మనకు కూడా ప్రవక్త నేర్పించిన మంచి ప్రవర్తనలను అనుసరించే వాళ్ళలో చేర్చుగాక. ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter