పవ్రక్తమహమ్మద్ [స] భౌతిక వివరణ

మన ప్రియ పవక్త ముహమ్మద్ [స] ప్రపంచ అధ్బుతాలలో ఒక అద్భుతమైన మనిషి మరియు  అతని అధ్బుతమైన అందం గురించి ‘’హుస్సన్ బిన్ సాబిత్ “ అనేఒక గొప్ప అరబ్ కవి ఇలా అంటున్నారు :

                                            وأجمل منك لم تر قط عيني                             

وأحسن منك لم تلد النساء

خلقت مبرا من كل عيب

كأنك قد خلقت ما تشاء

ఇలా అంటున్నారు; అతని కన్నా మనోహరమైన వ్యక్తిని నా కళ్లు ఎప్పటికీ ఎక్కడ చూడలేదు మరియు  ఇతనికన్న అందమైన వారిని ఏ స్త్రీకూడా ఇప్పటివరకు జన్మించలేదు. ప్రతి లోపం నుండి సృష్టించబడారు, బహుశా మీకు కావలసిననట్లుగా మీరు సృష్టించబడ్డారేమో.  

మరియు పవక్త[స] యొక్క జననం రాబివుల్ అవ్వల్ 12 వ తేదీన ఉదయం అయింది మరియు ఆయన ఎప్పుడైతే జన్మించారో అప్పుడు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఉదా: ఫారీస్ యొక్క అగ్ని ఆరిపోవడం. మరియు ఆ అగ్ని ఎన్నో సంవత్సరాల నుంచి మండుతూ వుండేది కానీ ఎప్పుడైతే ప్రియ పవక్త [స]  జన్మించారో అప్పుడు ఆ అగ్ని ఆరిపోయింది. మరియు సముద్రాల యొక్క అలలు పొంగిపోయాయి. ఇలాగేఎన్నో అద్భుతాలు జరిగాయి.  మరియు పవక్త [స] పుట్టిన 2 వ నెలలోనే తమ యొక్క మోకాళ్ళతో నడవటం మొదలుపెట్టారు మరియు 3 వ నెలలోనే నిలవటం మరియు కూర్చోవటం మొదలుపెట్టారు. దాని తరువాత 4 వ నెలలోనేతమ యొక్క కాళ్ళతో గోడ సహాయంతో నడవటం మొదలుపెట్టారు మరియు దాని తరువాత 9 వ నెలలో చాలా శుద్ధమైన మాటలు  మాట్లాడటం మొదలు పెట్టారు.

 పవక్త [స] యొక్క శరీరం:

పవక్త [స] చూడటానికి చాలా అందంగా ఉండేవారు మరియు ఆయన యొక్క ముఖం చాలా తెల్లగా కూడా లేకుండా మరియు నల్లగా లేకుండా ఎరుపు రంగులోకి  కలయిక అయ్యేది. అనగా ఆయన తెల్లగా ఉండేవారు కానీ ఆయన యొక్క తెల్లదనం ఎరుపు రంగులోకి కలయిక అయ్యేది. మరియు ఆయన యొక్క కళ్ళు చాలా పెద్దగా అందంగా ఉండేవి మరియు ఆయన యొక్క కనురెప్పలు చూడటానికి పెద్దగా మరియు తెలుపు రంగులో చూడటానికి అద్భుతంగా ఉండేవి. మరియ ప్రియ పవక్త[స] కాటుక వేయక పోయిన కాటుక వేసినట్లు కలిగేవారు.

వారి యొక్క గడ్డం చూడటానికి ఎక్కువ నల్లగా మరియు దిట్టుగా పొడవుగా ఉండేది. మరియు ఆయని యొక్క మాట చాలా తియ్యగా ఉండేది. ఆయని యొక్క మాట వింటుంటే చాలా మనశ్శాంతి కలిగేది. మరియు కడుపు గురించి మాట్లాడితే ఆయన యొక్క కడుపు రొమ్ము గుండెతో కలిసివుండేది. అనగా ఎక్కువ లావు లేకుండా మరియు కడుపు ముందుకు లేకుండా మొత్తం సమానoగా ఉండేది. మరియు పవక్త[స] యొక్క తలవెంట్రుకలు ఎక్కువ మెత్తగా మరియు  ఎక్కువ లావుగా లేకుండా సాధారణంగా ఉండేవి. మరియు ఆయన తమ వెంట్రుకలను, మెడ వరకు వదిలేవరు. లేకపోతే చెవి వరకు వదిలేవారు మరియు తల యొక్క మధి భాగంలో కొక్కెం తీసేవారు, లేకపోతే ఎడుమ వైపు కొక్కెం తీసేవారు.

పవక్త  [స] ప్రతి రోజు ఎక్కువ నూనె తల మీద వాడేవారు. మరియు అప్పుడప్పుడు మొత్తం తల వెంట్రూకలు తొలగించేవారు. మరియు పవక్త [స] ఎక్కువ బిగ్గరగా శబ్దంతో నవ్వేవారు కాదు మరియు ఆయని యొక్క జీవితంలో ఎప్పుడు గట్టిగా నవ్వలేదు, కానీ చిరునవ్వు నవ్వేవారు. మరియు ప్రియ ముహమ్మద్ [స] యొక్క చేతులు మరియు కాళ్ళులో మాంసం ఉండేది. అనగా ఎక్కువ లావుగా లేకుండా మరియ ఎక్కువ సన్నగా లేకుండా మధ్యస్త స్వభాగం గలవారు. మరియు ఆయన యొక్క ఒక వైపు మల్లితే తమ మొత్తం శరీరంను మళ్లించేవారు మరియు ఆయన యొక్క పాదం కింద కొంచెం అఖాతం ఉండేది. అందువలన ఆయన నడుస్తున్నప్పటికి పైనుంచి దిగుతునట్లు ఉండేవారు.

 మన పవక్త [స] యొక్క ఇన్ని గుణాలు ఉన్నాయి అయితే ఒక వైపు ఆయన యొక్క నీతిశాస్త్రులు మరొకవైపు ఆయన యొక్క గుణాలు. అయితే మనం ఒక సాధారణ మనుషులము మేము ఆయనికి ఎంతో ఎక్కువుగా ప్రేమించాలి మరియు ఆయన మీద ప్రతి రోజు దీవెనలు పంపాలి. మరియు ఆయని యొక్క ఏదో ఒక సున్నత్ ను మన జీవితంలో అమలుచేసేలా అలవాటు చేసుకోవాలి..

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter