ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం: ఓ ఆదర్శ గురువు.

మనం చాలా దినోత్సవాలు జరుపుకుంటాం. ఉదా:- జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం మరియు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, ఫాథర్స్ దినోత్సవం అని అనేక రకాల దినోత్సవాలు జరుపుకుంటాము. అవి ఎవరో పుట్టారని లేక ఎవరైనా ఏదో చేశారని జరుపుకుంటాము. కానీ ఇది ఇస్లాం ప్రకారం మనకు ఇలాంటికన్న ఒక మనిషి ఎవరైతే ఈ అన్నీ లక్షణాలు వాటిలో దాగిఉన్నాయో అతనే మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం. తమరు ర'బీఉల్ అవ్వల్ 12 వ తేదీన సోమవారం రోజు పుట్టారు. అల్లాహ్ తమ ప్రియ ప్రవక్తపై అవతరించిన పుస్తకం లో ఇలా బోదిస్తున్నాడు:-

وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا رَحۡمَةٗ لِّلۡعَٰلَمِينَ

మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.

ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం పుట్టిన నెల ర'బీఉల్ అవ్వల్. ర'బీ అనగ వసంతం. అప్పుడు అందరూ తమరి తమరి ఇల్ల ల్ ఉండేవారు. ఆ సమయంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం జన్మించారు. అప్పుడు అందరూ శబ్దాలు చేయరు. ఎవ్వరూ ఎవ్వరి ఇంటికి పోరు. అదికూడ తమరు మధ్య రాత్రిలో జన్మించారు. అనగా అందరూ నిద్రపోయేటప్పుడు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం జన్మించారు.

ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం గురించి మనం మాట్లాడాలంటే చాలా దూరం నుంచి రావాలి. ప్రతి మనిషి యొక్క చరిత్ర వాడు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు ఉంటుంది. కానీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం యొక్క చరిత్ర ఆలముల్ అర్వాహ్ నుంచి స్వర్గం వరుకు వెళ్తుంది. 

ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం గుణాలు గురించి హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హాతో ఒక మనిషి ప్రశ్నిస్తాడు :- ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం యొక్క గుణాలు ఎలా ఉండేవి? అప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ప్రస్తావిస్తారు: 

كان خلق النبي صلى الله عليه و سلم القرآن

ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం యొక్క గుణాలు ఖుర్’ఆన్ లాంటిది. దాని తరువాత హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఖుర్’ఆన్ శ్లోకాలు చదువుతుంది దీని యొక్క అర్ధాలు:-

వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో!

మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;

మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!

మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -

తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.

కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.

మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.

మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో!

అంటే ప్రియ ప్రవక్త యొక్క గుణాలు ఇలా ఉండేవి అని హజ్రత్ అయిష రజియల్లాహు అన్హా తెలిపారు. ఇంకొక్క మాట ఏమనగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం ఒక ఉపాధ్యాయుడిగా పంపబడ్డారు, దాని గురించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం చెబుతున్నారు: إنما بعثت معلما  నేను ఒక ఉపాధ్యాయుడిగా పంపబడ్డాను. ఒక రోజు ఘటన ఏమనగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం కోసం కొందరు ఒక వైపు మరి కొందరు ఇంకోవైపు మస్జిద్ లో కూర్చున్నారు. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం మస్జిద్ లో వెళ్తారు. ఒక సమూహం ఖుర్’ఆన్ నేర్చుకోవడానికి వచ్చి వుంటారు మరో వైపు కొత్తగా ఇస్లాం స్వీకరించినవాళ్ళు వుంటారు. ప్రియ ప్రవక్త దగ్గర పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి మెలిసి కూర్చునేవారు. పెద్దవాళ్ళకు చిరాకుగా మరియు చిన్నవాళ్ళకి సిగ్గు పడేవారు కాదు. ఇలాంటి ఉపాధ్యాయుడు మనకు ఈ ప్రపంచం లోనే దొరకరు. ఏ ఉపాధ్యాయుడైతే ఇలా పెద్ద వాళ్ళని మరియు చిన్న వాళ్ళని ఒక చోట కూర్చోపెట్టి నేర్పించడం పాఠాలు చెప్పడం చేయరు కానీ మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లంఇలా చేసేవారు. అందుకనే ఇలాంటి ఉపాధ్యాయులు దొరకడం అసలు ఈ ప్రపంచం లోనే దొరకరు. 

ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం గురించి మాట్లాడుతూ వుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం గురించి గుణాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాగ మనం మాట్లాడుతూ వుంటే  మన జీవితం అంతా గడిచిపోతుంది గాని మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం యొక్క మాటలు పూర్తికావు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter