ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: పుట్టుక వింతలు, బాల్య అద్భుతాలు

ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు వచ్చారు మరియు వెళ్ళిపోయారు. కానీ ఒకరోజు ఒక సుందర కుర్రాడు స్వాగతం తీసుకొచ్చారు. వారి యొక్క రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తూ ఉండేది మరియు వారి రాక యొక్క మంచి కబురు కూడా నబి మరియు రసూల్ ఇచ్చారు. ఈ విలువైన పిల్లవాడి యొక్క పుట్టుక పవిత్ర భూమైన మక్కా ముకర్రమాలో జరిగింది. ఆ పిల్లవాడి యొక్క పుట్టుక తేదీ రబీవుల్ అవ్వల్ యొక్క 12వ తేదీ ప్రొద్దున్నే తెల్లవారి జామున అయ్యింది మరియు వీరు యొక్క పవిత్ర పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంబంధం ఖురైష్ అనే వంశం తరుపున నుండి ఉంది మరియు ఇదే వంశానికి చెందిన అబ్దుల్ ముత్తలిబ్ వంశానికి సారథిగా ఉండేవారు. అంతేకాక ఈయన మన ప్రియ ప్రవక్తకు తాత కూడాను. మన ప్రియ ప్రవక్త యొక్క నాన్న పేరు అబ్దుల్లా మరియు వీరు అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కుమారులు. మన ప్రియ ప్రవక్త యొక్క మాత పేరు ఆమీనా మరియు వీరి యొక్క సంబంధం బను జహీరా తరపు నుండి ఉంది.

   చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మన ప్రియ ప్రవక్త, తల్లి కడుపులో ఉన్నప్పుడే మన ప్రవక్త యొక్క తండ్రి చనిపోతారు. ఎప్పుడైతే మన ప్రియ ప్రవక్త పుట్టిన విషయం వారి తాత గారికి తెలుస్తుందో అప్పుడు తాతగారు త్వరగా పిల్లవాడి దగ్గరకు చేరుకొని పిల్లవాడిని త్వరగా ఒడిలో ఎత్తుకొని నేరుగా కాబా వైపు వెళ్తారు మరియు దేవుని అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు తెలుపుతారు తరువాత ఆ పిల్లవాడికి ప్రవక్త సల్లగా ఒక పవిత్రమైన అద్భుతమైన పేరు పెడతారు. ఆ పవిత్రమైన పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే కురైష్ వంశం ఈ పేరును వింటుందో అప్పుడు చాలా చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఈ పేరు అరబ్ ప్రజల కొరకు ఇది నిశ్చయంగా కొత్తది. ఈ పేరు యొక్క అర్థం ఏమిటంటే చాలా ఎక్కువ మంచి సద్గుణాలు కలిగి మరియు వాటిపై ప్రశంసలు చెందేవారు. మన ప్రియ ప్రవక్త పుట్టిన సమయంలో చాలా అద్భుతమైన వసంఘటనలు కొన్ని వెలబడ్డాయి అవి:

1) ఖురేష్ వంశం యొక్క శిల్పాలు నిటారుగా ముందుకు ముఖం మీదుగా కింద పడిపోయారు.

2) నవసేవ ప్రజల యొక్క కోట పడిపోయింది.

3) మజోస్ యొక్క ప్రార్థన మందిరంలో ఏదైతే అగ్ని సంవత్సరాలుగా కాలుతుందో ఆ అగ్ని ఆరిపోయింది.

     మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పుట్టుక నుండి కేవలం ఏడు రోజుల వరకు మాత్రమే తల్లి యొక్క పాలు త్రాగారు. తరువాత సువైబా మన ప్రియ ప్రవక్తకు కొన్ని రోజులు వరకు పాలు త్రాగించారు. ఇంకొద్ది రోజులు తర్వాత మన ప్రియ ప్రవక్తను హలిమాతో యొక్క పెంపకంలో ఇచ్చారు.

      ఖురేష్ వంశస్తులకు ఒక అలవాటు ఉండేది. అది ఏమిటంటే విలువైన పిల్లలను ఎవరికైనా దానం చేయడం పెద్దయిన తర్వాత తీసుకోవడం అనే ఒక అలవాటు ఉండేది.

         బిబి హలీమా మన ప్రియ ప్రవక్తను చాలా గారాబంగా పెంచింది పాలు త్రాగించడం అయిపోయిన తరువాత కూడా ఇంకా రెండు సంవత్సరాలు వారి దగ్గరే పెట్టుకుంది. ఈ విధంగా బీబీ హలీమా మన ప్రవక్తను 4 సంవత్సరాలు పూర్తిగా వారి దగ్గరే పెట్టుకుని పెంచింది. దాని తర్వాత మన ప్రియ ప్రవక్త తిరిగి ఇంటికి వచ్చేసారు మన ప్రియ ప్రవక్తను పాలు త్రాగించడం వలన బీబీ హలిమాకు చాలా లాభాలు అదృష్టాలు వచ్చాయి. అవి ఏమిటంటే వారి యొక్క బక్క చిక్కిన గొర్రెలు చాలా బలంగా లావుగా ఆరోగ్యంగా అయిపోయాయి. ఆ యొక్క గొర్రెల నుండి పాలు కూడా స్వచ్ఛగా చాలా ఎక్కువగా లభించేవి. బిబీ హలిమాకు ఒక చిన్న కొడుకు ఉండేవాడు. ఒకరోజు మన ప్రియ ప్రవక్త మరియు అతను కలిసి గొర్రెలను మేపడానికి వెళ్తారు. అప్పుడు ఆశ్చర్యం ఒక వింత జరుగుతుంది. అదేంటంటే మన ప్రియ ప్రవక్త దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చి మన ప్రవక్త యొక్క ఛాతీని చీల్చి, హృదయాన్ని బయటకు తీస్తారు. ఆ హృదయాన్ని బాగా శుభ్రపరిచి దానిలో ఉన్న చెడు రక్తాన్ని తొలగించి ఆ చెడు రక్తాన్ని బయట పడేస్తారు మరియు వారి హృదయాన్ని తీసిన చోట నుండి పెట్టి మొత్తం బాగా చేస్తారు .

 ఆ ముగ్గురు మనుషులు దైవదూతలు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter