ఉహుద్ రణభూమి

      బద్ర్ మైదానంలో కలిగిన పరాజయానికి పరా- భావాగ్నిలో మండిపోతున్న మక్కావాసులు తిరిగి హిజ్రత్ మూడవ సంవత్సరంలో యుద్ధ సన్నాహాలు చేయసాగారు .అయితే ఈ వార్త మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అందగానే ఈసారి మదీనాకు దగ్గరలో ఉన్న ఉహుద్ అనే కొండ దాపుల్లో శత్రువులతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నారు.
          ఉహుద్ సమరం కూడా ఇస్లాం యొక్క పవిత్ర యుద్ధాలలో ఒకటి. ఈ ఉహుద్ యుద్ధం ఎలా జరిగిందంటే? అప్పుడు బద్ర్ యుద్ధంలో అబూజహాల్లాంటి పెద్ద పెద్ద వీరులను హతమార్చినందుకు వారు బదులు తీసుకోవడానికి యుద్ధం జరిపారు మరియు బద్ర్ యుద్ధపు తరువాయి సంవత్సరం అనగా హిజ్రత్ యొక్క మూడవ సంవత్సరంలో షవ్వాలు మాసంలో మక్కావాసులు ఈ పర్యాయం అధిక బలం 3000 సైనికులతో కొత్తగా తయారైన ఆయుధాలతో రంగంలో దిగారు .వీరి యొక్క నాయకుడు అబూ సుఫ్యాన్ వీరి ఆధ్వర్యంలోనే మొక్కవాసులు బయలుదేరారు. ఇక మక్కా వాసులు యుద్ధం చేయడానికి వస్తున్నారని కబురు మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారికి అందితే, వీరు అప్పుడే ఒక వెయ్యి మందిని వెంటబెట్టుకుని బయలుదేరారు. కానీ ఆ వెయ్యి మందిలో దాదాపు 300 మంది ముస్లింలు కాదు. వారు బయలుదేరిన దారిలోనే వదిలేసి వెళ్లిపోయారు . ఇక మిగిలిన సైన్యం 700 మంది మాత్రమే.
          ఉహుద్ అనగా ఒక పర్వతం . ఈ పర్వతం వెనుకొండ నుండి కూడా చుట్టుముట్టి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది . కావున, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పర్వతంపై 50 మంది విలువిద్య గల వారిని ఆ కొండపై పెట్టి, మరియు అబ్దుల్లా బిన్ జుబైర్ గారి ఆధ్వర్యంలో వదిలి దాని తర్వాత ఇలా ఆజ్ఞాపించారు "ఎప్పటి వరకు అయితే నా ఆజ్ఞ జరగదో, అప్పటివరకు తమరు తమ స్థానాన్ని విడిచి కిందకి రాకూడదు! అది యుద్ధం అయిపోయినా సరే" అని చెప్పారు.
          యుద్ధం ప్రారంభింగానే విజయం అతివేగంగా ముస్లింల పక్షాన నృత్యం చేయ సాగింది .ముస్లింల దాడిచే అవిశ్వాసులు యుద్ధపు మైదానం నుండి పరుగులు తీయసాగారు .మక్కా అవిశ్వాసులు చెల్లాచెదురయ్యారు .ముస్లిముల ఒక చిన్న పొరపాటు వలన రణరంగం తీరుతెన్నూలే మారిపోయాయి .ఎలాగంటే !అవిశ్వాసులు మైదానపు యుద్ధం నుండి పరుగులు తీయసాగారు. వీరి వెనుకాలే ముస్లింలు పరిగెత్త సాగారు .ఇది చూసి కొండమీద 50 మంది  విలువిద్య గలవారు యుద్ధం జయించామని, వారి స్థానాన్ని విడిచి క్రిందకు దిగసాగారు. వీరిని ఆపడానికి అబ్దుల్లాబీన్ జుబైర్ (ర) గారు చాలా ప్రయత్నించారు . కానీ వారెవ్వరూ ఆగలేదు.
          విలువిద్య గలవారు కిందకి దిగడం  చూసిన ఖాలిద్ బిన్ వలీద్ (వీరు ఈ యుద్ధంలో అవిశ్వాసులతో ఉన్నారు) కొండ వెనుక నుండి దాడి చేశాడు. ముస్లింలు వెనుక తిరిగి చూడగానే తెలిసింది! వీళ్ళు ప్రస్తుతం వారి ఖడ్గాల క్రిందికి వచ్చేసారని. దీనికి ముస్లింలు భయభ్రాంతులయ్యారు. ఈ యుద్ధంలో మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర దంతం పోయింది. దీనితో చివరికి మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హతమైనట్లు పుకార్లు లేవదీశారు ఆ అవిశ్వాసులు.
           ఈ విధంగా యుద్ధం భారీగా తయారైంది. తర్వాత హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల వీరత్వం వలన యుద్ధాన్ని సమానంగా చేయగలిగారు .ఈ యుద్ధంలో 70 మంది విశ్వాసులు హతమయ్యారు. వీరిలో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్నాన్న ఐన హజరత్ హంజ (ర) గారు కూడా ఉన్నారు .మరియు అవిశ్వాసులు 23 మంది చంపబడ్డారు .ఈ దుష్ప్రచారానికి ముస్లింలు కొంతవరకు ప్రభావితులయ్యారు. కానీ అది శుద్ధ అబద్ధమని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. విజయం తిరిగి విశ్వాసులను ఆశ్రయించింది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter