ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు యొక్క ఇష్టమైన ఆహార పదార్థాలు
ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు యొక్క ఇష్టమైన ఆహార పదార్థాలు
మన ప్రియ ప్రవక్త ముస్తఫా జాన్ రహ్మత్, షామా బజ్మ్ హిదాయత్, నౌషిర్ బజ్మ్ జన్నత్, తాజ్దార్ ఖత్మ్ నబూబాత్ (SAW)తన జీవితకాలం యొక్క సద్గుణాలను మరియు ఉపయోగాన్ని ఏ ముస్లిం కూడా తిరస్కరించలేడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపయోగించిన ఆహారాలు ఆరోగ్యంతో కూడిన అనేక ప్రయోజనాలతో నిండి ఉన్నాయి మరియు అనేక వైద్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. ఈ రోజు ఆరోగ్య తిండి నిపుణులు ఫుడ్ పేపర్లలో వివరించబడుతున్న ఈ ఆహారాల యొక్క సద్గుణాలు మరియు ప్రయోజనాలను పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే అదృశ్య ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు వర్ణించారు. ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం యొక్క జీవన యాత్ర ఎంతో నిర్మలంగా, సరళంగా, ఉన్నదాంట్లో తృప్తిపడి ఎంతో ఓర్పుతో ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క పవిత్ర జీవితం సరళత మరియు దాతృత్వానికి ప్రతి మానవుడికి ఒక ఆచరణాత్మక ఉదాహరణ అని చెప్పవచ్చు.హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియాల్లాహు అన్హూ ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఎన్నెన్నో నిరంతర రాత్రులు కేవలం పస్తులు గా గడిపేవారు.ఉమ్మాహాతుల్ ముఅ్ మినీన్ హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఈ విధంగా సెలవిస్తున్నారు: ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారి ఇంట్లో 40 రోజులు దీపం మరియు పొయ్యి వెలిగించకుండానే గడిచిపోయేవి అప్పుడు ఒక సహాబి ప్రశ్నించారు: మరి మీరు తిండి లేకుండా ఎలా బ్రతికేవారు? అప్పుడు ఆమె జవాబు ఇచ్చారు: రెండు నల్ల పదార్థాలను తినే వాళ్ళము అవి 1. మంచినీళ్లు 2. ఖర్జూరపు పండ్లు
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆహారాన్ని స్వీకరించడంలో ఎటువంటి మంచి రుచికరమైన మరియు కష్టతరమైన ఆహారాన్ని కోరుకోరు, కానీ ఆయన కొన్ని ఆహారా పదార్థాలను చాలా ఇష్టపడి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటిని చాలా రుచిగా తినేవారు. అలా వారికి ఇష్టమైన కొన్ని ఆహారపదార్ధాలు ఇక్కడ చదువుదాం.
సొరకాయ మరియు పొట్లకాయ (Bottle groud & snake groud)
ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లం గారికి సొరకాయ అంటే చాలా ఇష్టం ఉండేది మరియు సొరకాయ కూరలో నుంచి సొరకాయ ముక్కలను ఏరి కోరి తినేవారు.
ప్రవక్త ఇష్టమే నా ఇష్టం : హజ్రత్ అనస్ రజియాల్లాహు అన్హూ కథనం ప్రకారం ఈ విధంగా సెలవిచ్చారు : నేను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఒక విందు భోజనానికి ఆహ్వానించబడ్డాము అందులో మాకు జవ్వ రొట్టె మరియు సొరకాయ, మాంసం కూర వడ్డించబడింది అప్పుడు ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం ఆ కూరలో నుంచి సొరకాయ మొక్కలను ఇష్టపడి ఏరి కోరి తినడం నేను చూశాను. ఆ రోజు నుండి నేను కూడా సొరకాయ అంటే ఇష్టపడి తినే వాడిని.(సహీ బుఖారి 3/536 హదీస్ నెంబర్ 5433)
దోసకాయ (cucumber)
హజ్రత్ అబ్దుల్లా బిన్ జాఫర్ రజిల్లాహు అన్హూమా కథనం ప్రకారం: నేను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ను దోసకాయ మరియు ఖర్జూరపు పండును కలిపి తినడం చూశాను.(సహీ ముస్లిం 870 హదీస్ 30)
ఖర్జూరపు పండ్లు (Dates)
ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఖర్జూరపు పండులను ఎంతో ఇష్టంగా తినేవారు అందులో ప్రత్యేకంగా అజువా ఖర్జూర పండ్లు అంటే ప్రవక్తకు ఎంతో ఇష్టం.
ద్రాక్ష పండ్లు (Grapes)
ప్రియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం గారికి ద్రాక్ష పళ్ళు కూడా ఇష్టంతో తినేవారని అని పుస్తకాలలో వ్యక్తం అవుతుంది. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియాల్లాహు అన్హూ కథనం ప్రకారం ఈ విధంగా సెలవిచ్చారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క దర్శనం కోసం ఆయన గదికి వెళ్ళినప్పుడు ప్రవక్త ద్రాక్ష పళ్ళు ను సేవించడం చూశాను.
పుచ్చకాయ (watermelon)
హజ్రత్ అనస్ రజియాల్లాహు అన్హూ సెలవిస్తున్నారు: ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు పుచ్చకాయను నానబెట్టిన ఖర్జూరపు పండులతో కలిసి సేవించేవారు మరియు ఈ విధంగా ఆదేశించేవారు పుచ్చకాయచల్లదనం ఖర్జూర పండు వేడిని తగ్గిస్తుంది.
కర్బూజాపండు (Muskmelon)
మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు కర్బూజాపండు ను కుడ ఎంతో ఇష్టంతో తినేవారు అంతేకాకుండా దీనితోపాటు దానిమ్మ పండు మరియుమల్బరీ పండును కూడా తినేవారు.
చల్లని నీరు Cool water
సాధారణ మంచినీళ్లు చల్లని నీళ్లు ప్రవక్త సల్లల్లాహు త్రాగడానికి ఇష్టపడేవారు. పాలు యొక్క లస్సి కూడా అప్పుడప్పుడు తాగేవారు.(ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చల్లని నీరు అనగా ఎటువంటి ఐసు ముక్కలు కలగకుండా స్వచ్ఛంగా ఉండే నీరు)
పైన చెప్పబడిన ఆహార పదార్థాలు అన్నిటిని మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో ఇష్టంగా సేవించేవారు అందుకు మనము కూడా మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇష్టమైన ఆహారాన్ని మనము కూడా ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకోవడం కూడా ఒక అభిమానమని తెలుసుకుందాం.