బీబీ ఫాతిమా (ర.అ) గారి జీవితం.
ప్రియ ప్రవక్త ﷺ గారి పవిత్ర సంతానంలో అతి చిన్న, అతి ప్రియమైన కుమార్తె ‘ఫాతిమతుజ్జహ్రా’ (ర.అ). వారి జననం నబువ్వత్ ప్రకటనకు ఐదు సంవత్సరాల ముందు, జమాదీ అఖీర్‌లోని 20వ తేదీన జరిగింది. వారి మాత ‘సయ్యిదా ఖదీజా బింత్ ఖువైలిద్’ (ర.అ) గారు.
యావత్ ముస్లింలకు ఫాతిమతుజ్జహ్రా (ర.అ) గారు ఒక ఎంపిక హస్తి. అంతేకాక ఆమె గారు ఆబిదా, జాహిదా, అజ్జహ్రా, బతూల్ వంటి ఉన్నత బిరుదులతో పిలువబడే, స్వర్గపు స్త్రీలకే సర్దారు వంటి స్థానం కలిగిన వారు. వారు తమ బాల్యాన్ని తల్లిదండ్రుల భద్రతలో, మక్కాలో గడిపారు. చాలా మంచి త్రికరణ శుద్ధి గల వాతావరణం లో ఎదిగారు. బీబీ ఫాతిమా (ర.అ) గారిని ‘అజ్జహ్రా’ అని కూడా అందురు. సయ్యదా ఫాతిమా బింత్ మహమ్మద్ (రజియల్లాహు అన్హా) గారిని “అజ్జహ్రా” (الزهراء) అని పిలివడానికి గల కారణం, వారి గొప్ప పవిత్రత, ప్రకాశవంతమైన వ్యక్తిత్వం. ఇంకా ఆమె గారు ఆధ్యాత్మిక వెలుగుకు సంకేతం. తమ జీవితంలో ఒకరి కుమార్తెగా ఫాతిమా (ర.అ) గారు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమను పంచుతూనే, వారి గొప్ప గౌరవింపదగిన వ్యక్తిలా కొనియాడారు. ఇంకా ప్రవక్త ﷺ గారు కూడా తమ కూతురి పట్ల ఎనలేని ప్రేమని, ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూ, ఆమె తప్ప మంచి వ్యక్తిత్వం మరియు మంచి గుణం కలిగిన వారు వేరొకరు ఉండబోరని భావించేవారు. ఇస్లాం మతపు పురాతన చరిత్రలో ‘ఫాతిమాతుజ్జహ్రా’ (ర.అ) గారు తమ వివేకము కరుణ మరియు విశ్వాసంలో స్థిరంగా ఉండడం ఎలా మొదలగు వాటిలో ప్రముఖ పాత్ర వహించి ప్రసిద్ధిగాంచారు.
ప్రియ ప్రవక్త ﷺ గారు మరియు ఖదీజా (ర.అ) గార్ల స్వాభావికమైన ప్రేమ, భద్రత, అతి శ్రద్ధ ఇలా ఇవన్నీ వారి ప్రియమైన కూతురు ఫాతిమతుజ్జహ్రా (ర.అ) గారి వద్ద ఏ కొంచెం తక్కువ కాకుండా ఆమెను పెంచారు. ఇంకా ఆ పెంపకం చాలా గారాబంగా జరిగింది అని మాత్రం అనలేం! ఎందుకంటే అది కూతురి పట్ల ఒక అతి ప్రేమ కావున. ఫాతిమా (ర.అ) చిన్న వయసులోనే వారి తల్లి ఖదీజా (ర.అ) మరణించారు. ఇది ఆమెకు చాలా పెద్ద పరీక్ష. అయినప్పటికీ ఆమె సహనంతో జీవించి తన తండ్రికి ధైర్యం ఇచ్చారు. ఆమె తన తండ్రిని ఎంతో ప్రేమతో చూసుకునేవారు. అందుకే ఆమెకు “ఉమ్ము అబీహా” (తండ్రికి తల్లి లాంటి వ్యక్తి) అనే బిరుదు వచ్చింది. ఫాతిమతుజ్జహ్రా (ర.అ) గారు తమ బాల్యపు ఎక్కువ భాగం మొత్తం, హజ్రత్ ఖదీజా (ర.అ) గారి పర్యవేక్షణలోనే ఎదిగారు. అంతేకాక వారు పగలంతా ఉపవాసాల్లో రాత్రుల్లో ప్రార్థనలు అదాచేయడంలో, మొత్తానికి భగవంతుడి పట్ల ప్రేమతో, మనస్ఫూర్తిగా, ఒక బానిసలా తమ మొత్తం జీవితాన్ని సమర్పించారు. తద్వారానే ప్రియ ప్రవక్త ﷺ గారు ఆమె గారి మంచి అలవాట్ల వలనే ‘బతూల్’ అనే బిరుదుతో ఆశీర్వదించారు. బతుల్ కు అర్థం నిర్మలమైన/స్వచ్ఛమైన స్త్రీ అని. అంతేకాక ఫాతిమతుజ్జహ్రా (ర.అ) గారు తమ బాల్యంలో చాలా కష్టాలు మరియు జటిలాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎలాగైతేనేం, వారు చాలా దిట్టమైన మనస్సు మరియు ఎల్లప్పుడూ వారి తండ్రి ద్వారా ఉత్తేజం పొంది, ఏ కష్ట పరిస్థితికి లొంగకుండా ఉండేవారు. వీరికి ముగ్గురు అక్కలు మరియు ముగ్గురు అన్నయ్యలు కూడా ఉండేవారు. వారి అక్కలు ‘జైనబ్’, ‘ఉమ్మెకుల్సం’, మరియు ‘రుక్కయ్య’ మరియు ఆమె గారి అన్నయ్యలు ‘ఖాసిం’, ‘అబ్దుల్లాహ్’, మరియు ‘ఇబ్రహీం’. ఈ అన్నయ్యలందరూ తమ బాల్యంలోనే కాలం చేశారు.
‘హజ్రత్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్’ (రజియల్లాహు అన్హు) గారు మరియు సయ్యదా ఫాతిమా బింత్ మహమ్మద్ (రజియల్లాహు అన్హా) గారి వివాహం, ఇస్లాం చరిత్రలో అత్యంత పవిత్రమైన మరియు గొప్ప వివాహాలలో ఒకటి. ఈ వివాహం హిజ్రీ రెండవ సంవత్సరంలో, ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, సఫర్ మాసంలో జరిగింది. ఇంకా ఈ పవిత్ర వివాహం ప్రవక్త మహమ్మద్ ﷺ గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ వివాహం చాలా సాదాసీదాగా, కానీ ఎంతో పవిత్రంగా జరిగింది. ప్రవక్త ﷺ గారు స్వయంగా ఈ వివాహాన్ని నిర్వహించి, హజ్రత్ అలీ (ర.అ) గారికి మరియు సయ్యదా ఫాతిమా (ర.అ) గారికి ఎన్నో మంచి సలహాలు మరియు దువాలు చేశారు. ఆయన అల్లాహ్‌ను ప్రార్థిస్తూ, ఈ దంపతుల జీవితంలో శాంతి, ప్రేమ, మరియు ఆశీర్వాదం కలగాలని కోరారు.
హజ్రత్ అలీ (ర.అ) గారు, సయ్యదా ఫాతిమా (ర.అ) గారి పట్ల ఎంతో ప్రేమ, గౌరవం, మరియు మర్యాద కలిగి ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఆమెతో వినయంగా మరియు గౌరవంగా ప్రవర్తించేవారు. సయ్యదా ఫాతిమా (ర.అ) గారు కూడా ఎంతో మంచి భార్యగా, భక్తితో, సహనంతో, మరియు వినయంతో జీవించారు.
మరో చారిత్రక కథనం ప్రకారం, ఈ వివాహ సమయంలో హజ్రత్ అలీ (ర.అ) గారు సుమారు 400 నుండి 500 దిర్హమ్ లో వెండిని కట్నంగా ఇచ్చారు. ఇది చాలా సాధారణమైనది మరియు ఇస్లాంలో సాదాసీదా జీవన విధానానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
హజ్రత్ అలీ (ర.అ) గారిని “అసదుల్లాహ్” (అల్లాహ్ యొక్క సింహం) అనే గొప్ప బిరుదుతో కూడా పిలుస్తారు. ఈ బిరుదు ఆయన ధైర్యం, వీరత్వం, మరియు ఇస్లాం కోసం చేసిన గొప్ప సేవలకు గుర్తుగా ఇవ్వబడింది.
ఈ పవిత్ర వివాహం ద్వారా, ఇస్లాం ప్రపంచానికి ఆదర్శమైన కుటుంబ జీవితం ప్రారంభమైంది. ఈ దంపతులు తమ జీవితాన్ని అల్లాహ్ భక్తితో, సహనంతో, మరియు పరస్పర ప్రేమతో గడిపారు. వారి జీవితం ప్రతి ముస్లింకు ఆదర్శంగా నిలిచింది.
ఆయన్ని పెళ్లాడిన తర్వాత ఆమె గారికి ‘ఇమాముల మాత’ అన్న బిరుదు దక్కింది. ఈ విధంగా ‘ఫాతిమతుజ్జహ్రహ్’ (ర.అ) గారు ఇంకా ఎన్నో బిరుదులను పొందారు. ఇంకా వాటన్నింటిలోకి ఆమెకి ఇష్టమైన బిరుదు, ‘ఉమ్మే అబీహా’. హజ్రత్ ఇమామ్ అలీ (ర) గార్ల మరియు సయ్యిదా ఫాతిమా (ర.అ) గార్ల పరస్పర అంకితయా సమర్పణ బంధుత్వాన్ని చూస్తే, ఇట్టే సరైన జోడి అని అనిపిస్తుంది వారిద్దరు ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ప్రతి సమస్యను సులభంగా తొలగించుకుంటూ, తమ ఇంటిని ఒక ముస్లిం ఇంటికి నమూనాగా తీర్చిదిద్దారు. ప్రార్థన చేయడంలోనైనా, ఉపవాసం పెట్టడంలోనైనా లేక తినడంలోనైనా అంతే కలిసిమెలిసి జీవించి, తమ జీవితాన్ని ఆనంద సంతోషాలతో గడిపారు. ఆ యువజంట యొక్క జీవనశైలి మాత్రం వినయవిధేయతలు కలిగి ఉండేది. వారి జీవితంలో జీవించడానికి అంత ఎక్కువగా లేకున్నా, చాలా తాపీగా సాగించారు. ఫాతిమా(ర.అ) గారు వారి వివాహ జీవితంలోని కుటుంబ విషయాల్లో చాలావరకు స్ఫూర్తి చెంది, ఒక భార్యగా మరియు ఒకరికి తల్లిగా మొత్తానికి చక్కటి గృహిణిలా తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు.
ప్రియ ప్రవక్త ﷺ గారు ఫాతిమా (ర.అ) గారి దయా గుణాన్ని, అందరితో ప్రేమగా మెలగడాన్ని కలిగి ఉండడం చేత చాలా లోతైన బంధాన్ని ఇమిడి పరుచుకున్నారు. ఆమె గారు, తమ తండ్రి బోధనల క్రింద మార్గదర్శకత్వాన్ని పొందుతూనే, తమ తల్లి హజ్రత్ ఖదీజా (ర.అ) గారి భద్రత, ప్రేమను కూడా పొందారు. బీబీ ఫాతిమా (ర.అ)గారు తమ బాల్యం మొత్తంలో, తమ తండ్రిగారు ఎదుర్కొన్న పోట్లాటలకి ఒక సాక్షిగా నిలిచారు మరియు తమ వైపు నుండి బాగా స్థిరంగా నిలకడగా ఒక మంచి సహాయకుడిలా సహాయం అందించారు కూడానూ. దీని ద్వారా దైవప్రవక్త ﷺ గారి దివ్య కళ్ళకి ఫాతిమా (ర.అ) గారు సర్వ శ్రేష్టమైన భక్తిశ్రద్ధలకు మూలంగా నిలిచారు. అంతేకాక ప్రియ ప్రవక్త ﷺ గారు వారి ఆక్షేపింపదగిన గుణాలను అంగీకరించి ఆమెకు తమ తరఫునుండి అత్యంత స్థాయిని అభిమానాన్ని చేకూర్చారు. దీనితో ఫాతిమా (ర.అ) గారు తమ లోతైన దైవభక్తి మరియు నిజాయితీ పట్ల స్థిరత్వం… ఇలా వీటన్నిటిని ప్రవక్త గారితో అలవరుచుకుంటూ, ప్రవక్త గారితో ఒక సాటిలేని బంధాన్ని ఏర్పరచుకున్నారు.
ఇందువల్లే, సయ్యదా ఫాతిమా (రజియల్లాహు అన్హా) గారు దైవ ప్రవక్త ﷺ గారి అత్యంత ప్రియమైన కుమార్తె. చిన్నప్పటి నుంచే ఆమె తన తండ్రి పట్ల గొప్ప ప్రేమ, సేవాభావం చూపారు. ప్రవక్త ﷺ గారు దుఃఖంలో ఉన్నప్పుడు, ఆమె వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవారు. అందుకే ఆమెను వారి కాలంలో“అమ్ము అబీహా” (తండ్రికి తల్లి వంటి వారు) అని పిలిచేవారు.
ఇంకా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఆమె పట్ల ప్రేమను పంచుకుంటూ ఇలా సెలవిచ్చారు:
فَاطِمَةُ بَضْعَةٌ مِنِّي، فَمَنْ أَغْضَبَهَا أَغْضَبَنِي "
“ఫాతిమా నా లోని ఒక భాగం. ఎవరైనా ఆమెను కోపపెట్టారో, వారు నన్ను కోపపెట్టినట్లే.”
(సహీహుల్ బుఖారి:3714)
ఈ హదీస్ ఫాతిమా (ర.అ) గారి గొప్ప స్థానం మరియు ఆమెకు ఇస్లాంలో ఉన్న ప్రత్యేక గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రవక్త ﷺ గారు ఆమెను కేవలం తన కుమార్తెగా మాత్రమే కాకుండా, తన హృదయానికి అత్యంత దగ్గరైన వ్యక్తిగా భావించేవారు. ఆమె ఆనందం ఆయన ఆనందంగా, ఆమె బాధ ఆయన గారి బాధగా భావించేవారు. ఈ హదీస్ ద్వారా ముస్లింలందరికీ ఫాతిమా (ర.అ) గారి పట్ల ప్రేమ, గౌరవం, మరియు మర్యాద కలిగి ఉండాలని స్పష్టమైన సందేశంగా సూచించబడుతుంది.
వారు చాలా సరళమైన, ఓర్పుతో కూడిన జీవితం గడిపారు. ఆమె ఇంటి పనులన్నీ స్వయంగా చేసేవారు మరియు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
ఇంకా ఆమె ఉహుద్ యుద్ధం మరియు మక్కా విజయంలో పాల్గొన్నారు. హిజ్రత్ 11వ సంవత్సరం రమ్జాన్ నెలలో ఆమె గారు కాలం చేశారు. ఆమె జనాజాలో హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) మరియు ఇతర అనుచరులు కూడా పాల్గొన్నారు. ఇక ఆఖరిగా ఆమె ఇస్లాం చరిత్రలో ఒక గొప్ప ఓర్పు, తక్వా మరియు త్యాగానికి ఆదర్శంగా నిలిచారు.


