హజరత్ ఉమ్ము సల్మా[ర]
మ అసలు పేరు హింద్, కునియత్ ఉమ్ము సల్మా,ఆమె ఖరైష్ యొక్క మఖ్జూం కుటుంబం నుంచి ఉంది, మరియు తమ వంశం యొక్క పూర్తి పేరు: హింద్ బింత్ అబీ ముగైరహ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ మఖ్జూం. ఆమె యొక్క తల్లి పేరు ఆతికా బింత్ ఆమిన్ మరియు ఆమె ఫిరాస్ కుటుంబం నుండి ఉండేది.
హజరత్ ఉమ్ము సల్మా[ర] యొక్క తండ్రి పేరు ‘అబూ ఉమయ్యా’ ఆయన ఒక డబ్బుఉన్న మనిషి మరియు అబూ ఉమయ్యా ఒక ఔదార్యమైన మరియు మనసున్న మనిషి అయితే ఆయన యొక్క ఔదార్యం నాలుగులవైపు వ్యాపించి ఉండేది. ఆయన ఎక్కువగా అతిథిమర్యాదలు చేసేవారు. ఒకవేళ ఎప్పుడైనా ఒక తెగతో ప్రయాణం చేస్తే ఆ తెగ యొక్క మొత్తం ఖర్చు తమరే చుసుకనేవారు.అలాగే ఆ తెగకి ఏ బాధా కలగకుండా చూసుకునేవారు. అందువలన ప్రజలు అబూ ఉమయ్యాకు [జాదుర్రాకిబ్] అని బిరుదు ఇచ్చారు. దాని అర్థం ఏమనగా [ప్రయాణీకుల అమరిక] మరియు ప్రజలు ఆయనికి ఎక్కువగా పరువు, మర్యాద ఇచ్చేవారు .
హజరత్ ఉమ్ము సల్మా[ర] తమ యొక్క చిన్నాయన కొడుకు “అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్” ను మొదట పెళ్లాడింది. ఉమ్ము సల్మా[ర] ఆమె యొక్క ముందుకాలాంలోనే ఇస్లాంను స్వేకరించింది. ఇలాగే భార్య భర్తలు ముందే ఇస్లాం స్వీకరించారు మరియు వారికి వారికి దివ్య గ్రంధం లో “السابقون الاولون” అని ఆహ్వానించారు.
అయితే హజరత్ అబూ సల్మా[ర] ప్రవక్త [స] యొక్క పెద్ద సహాబీ ఆయన యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది ఏమనగా “ఒక రోజు హజరత్ ఉమ్ముసల్మా అబూ సల్మా [ర] తో అంటుంది ‘నేను ఇతరులతో విన్నాను ఒకవేళ ఒక మహిళ యొక్క భర్త ఆమె జీవితంలో చనిపోతే ఆ మహిళ దాని తరువాత రెండోవాపెళ్లి చేయకపోయినా అల్లాహ్ ఆమెను స్వర్గంలో పంపిస్తాడు- భర్త యొక్క జీవితంలో అతని యొక్క భార్య చనిపోతే ఆ భార్త రెండోవ పెళ్లి చేయకపోతే కూడా అల్లాహ్ అతనికి స్వర్గంలో పంపుతాడు. దాని తరువాత అబూ సల్మా[ర] హజరత్ ఉమ్ము సల్మా[ర] తో ఒక ఒప్పందం చేస్తారు. అది ఏమనగా “మనలో ఎవరు ముందు చనిపోతారో రెండోవారు ఒంటరి జీవితం గడపాలి” అంటూ హజరత్ అబూ సల్మా[ర] అంటారు: మీరు నా మాటను ఒప్పుకుంటారా?
హజరత్ ఉమ్ము సల్మా[ర] జవాబుఇస్తుంది ; సరే! నాకు దీనికన్నా సంతోషమైన మాట ఇంకేముంటుంది.
హజరత్ అబూ సల్మా[ర] అంటారు; అయితే విను ఒక వేల ముందు నేను మరణిస్తే మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి “అంటూ అల్లాహ్ తో ప్రార్థన చేస్తారు. “ఓ అల్లాహ్ ఉమ్ము సల్మా జీవితంలో నేను చనిపోతే ఆమెకు నాకన్నా మంచి భర్త ప్రలాదించు అని” మరియ అబూ సల్మా ముందు చేసిన ఒప్పందం తిరిగి తీసుకుంటారు.
3 వ హిజ్రిలో హజరత్ అబూ సల్మా [ర] “ఊహుద్” యుద్దం లో పాల్గొన్నారు మరియు యుద్దం చేస్తూండగా ఒక విషబాణం వచ్చి ఆయనకు గుచ్చుకుంది. దాని తరువాత వైద్యం చేపిస్తారు మరియు ఆ గాయం ఎండిపోయింది. కానీ కొన్ని నేలల తరువాత ఆ గాయం పచ్చిగా అయ్యి చాలా నొప్పి తట్టుకోలేక అయన అల్లాహ్ దగ్గరకు చేరుకుంటారు. ఆయన మరణించిన తరువాత హజరత్ ఉమ్ము సల్మా[ర] ఎక్కువగా బాధ పడి ఏడుస్తూ మాటకి మాటకి అయన పేరు స్మరిస్తు ఉండేది.
ఎప్పుడైతే అబూ సల్మా[ర] యొక్క మరణ విషయం ప్రవక్త [స] విన్నారో అప్పుడు స్వయంగా ఉమ్ము సల్మా[ర] ఇంటికి వచ్చి ఆమెకు ఓర్పును ఇస్తారు. వారి కోసం దువా చేయిమని అంటారు. ఇలాగే “అబూసల్మా లో ప్రాణం లేకపోయిన కూడా ఆయని యొక్క కళ్లు తెరిచేవుంటాయి. అయితే ప్రవక్త [స] తమ యొక్క పవిత్రమైన చేయితో ఆయని యొక్క కళ్లు ముస్తారు.
మరియు అబూ సల్మా[ర] యొక్క జనజా నమాజ్ చదువుతున్నపుడు ప్రవక్త [స] (9) తొమ్మిది తకబీర్లు చెబుతారు, నమాజ్ ముగిసిన తరువాత ప్రజలు ప్రవక్త [స] తో అడుగుతారు; ఓ ప్రవక్త [స] మీరు నమాజ్ లో (9) తొమ్మిది తకబీర్లు ఎందుకు చెప్పారు?అప్పుడు ప్రవక్త[స] ఉల్లేఖించారు: అబూసల్మా[ర]కు (1000) వెయ్యి తకబీర్లు యొక్క హక్కు ఉంది.
ఒక రివాయత్లో వచ్చింది అది ఏమనగా ఎప్పుడైతే ప్రవక్త [స] అబూ సల్మా[ర] యొక్క మరణం తరువాత వెళ్లారో అప్పుడు ఉమ్ముసల్మాను ఓర్పించి ఇలా అన్నారు; ఓ ఉమ్ము సల్మా నువ్వు అబూసల్మా యొక్క హక్కులో దుఆ చేయి మరియు అల్లాహ్ తో అబూసల్మా లాగే ఇంకా మంచి మనిషి భర్తగా దొరకలని అడుగు అని ప్రవక్త చెప్పారు, అప్పుడు హజరత్ ఉమ్ము సల్మా[ర] ఆలోచిస్తుంది అబూసల్మా[ర] కన్నా మంచి భర్త ఎవరు కగలుతారు అని ఆలోచించి ప్రవక్త [స] ను పెళ్ళాడుతుంది.
హజరత్ ఉమ్ము సల్మా తమ జీవితంలో ఒక అదృష్టం పొందింది. అది ఏమనగా ప్రవక్త[స] యొక్క భార్య కావడం మరియు ఉమ్ముసల్మా (63)హిజిరీ లో (74) వయస్సులో ఈ లోకాన్ని వదిలింది. మరియు హజరత్ అబూ హురైరహ్[ర] ఆమె యొక్క జనజా నమాజ్ చదివించారు.