క్యాలెండర్ కథ

క్యాలెండర్ కథ

 

ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా?తెలియదా,  రాండి దాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే క్యాలెండర్ను “గ్రెగోరియన్ క్యాలెండరుఅని అంటారు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లియస్ అనే వైద్యుడు జూలియన్ క్యాలెండర్ కు చేసిన సవరణల ఫలితమే ఈ క్యాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుబరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ క్యాలెండరు అనే పేరు వచ్చింది.

  • గ్రెగోరియన్ నేపథ్యం మరియు తయారి

మొదట ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఇది క్యాలెండరుగా రూపం దాల్చడానికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే..... క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ (355 రోజులు గా 10 నెలలుతో) - రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెల లను జోడించాడు.  కీ. పూ 46 లో జూలియస్ సీజర్ ఏర్పాటు చేసిన జూలియస్ క్యాలెండర్ కు 12 నెలలకు పేర్లు పెట్టడానికి గల కారణాలు తెలుసుకుందాం...

          క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ నే అనుసరించేవారు. ఆ రోమన్ క్యాలెండర్ను రోములుస్ అనే మొదటి రోమ్ చక్రవర్తి రూపొందించాడు. ఎప్పుడు రూపొందించాడు అనడానికి సరైన ఆధారాలు లేవు కానీ కొందరి చరిత్రకారుల కథనం ప్రకారం ఈ మొదటి రోమ్ చక్రవర్తి క్రీ. పూ. 753 వ సంవత్సరంలో రోమ్ నగరం స్థాపించి దానికి రాజు అయినాడు అని తెలుస్తుంది.

  • మార్పులు చేర్పులు

                        ఈ రోమన్ క్యాలెండర్ లో 304 రోజులుగా, మొత్తం 10 నెలలుగా మాత్రమే ఉండేది. ఈ రోమన్ క్యాలెండరు మార్చ్ నెల నుండి మొదలై డిసెంబర్ నెలతో ముగిసేది. ప్రతి నెల లో 30, 31 రోజులు క్రింద పేర్కోన్న విధంగాఉండేవి  

రోమన్ క్యాలెండర్

Roll number

తెలుగు

Meaning

Length in days

1

మార్చ్

Month of Mars

31

2

ఏప్రిల్

Month of Apru (Aphrodite)[15]

30

3

మే

Month of Maia[16]

31

4

జూన్

Month of Juno

30

5

జులై

Fifth Month

31

6

ఆగష్టు

Sixth Month

30

7

సెప్టెంబర్

Seventh Month

30

8

అక్టోబర్

Eighth Month

31

9

నవంబర్

Ninth Month

30

10

డిసెంబర్

Tenth Month

30

 

length of the year:

304


       పిదప ఈ రోమన్ క్యాలెండర్ లో చేసి కొన్ని రోజులను జోడించి 355  రోజులు, 10 నెలలుగా మార్పులు చేశారు. మిగతా కొన్ని రోజులకు నెల పేరు లేకుండా లెక్కించేవారు, ఇలా 355 రోజులయ్యేసరికి అందరికి ఇబ్బందికరంగానే ఉండేది. పండుగలు జరుపుకోవడానికి, వ్యవసాయ పంటలు వేయడానికి గందరగోళం గా ఉండేది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన పండుగా వచ్చే సంవత్సరానికి ఇదే తేదికి రాకపోయేది కాదు. అలాగే పంటలు వేయడానికి కూడా తేదీల్లో తేడా వచ్చేది, దాని వల్ల వారికి తికమకగా ఉండేది.

          ఆ తరువాత రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెలలను జోడించాడు. దానితో 12 నెలల క్యాలెండరుగా మార్పు చెందింది. దానితో కూడా ఎవరు సంతృప్తి పొందలేదు. అయినా ఆ క్యాలెండర్ క్రీ. పూ. 506 వ సంవత్సరం వరకు నెట్టుకొచ్చింది. ఎందుకంటే క్రీ. పూ. 753 నుండి 506 వ సంవత్సరం వరకు రోమ్ రాచరిక రాజులయిన ఏడుగురు రాజులచే పాలించబడింది. ఆ తరువాత క్రీ. పూ. 506 వ సంవత్సరం లో రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగి క్రీ. పూ. 27 వ సంవత్సరం వరకు రోమన్ రిపబ్లిక్ గా ఉంది. రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగాక ఎవరు నియంతగా ఎన్నికయితే వారు వారి రాజకీయ అవసరాలకోసం రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేస్తూ వచ్చారు. క్రీ. పూ. 46 వ సంవత్సరం లో జూలియస్ సీజర్ ( Julius caesar ) రోమ్ ప్రధాన పొప్ గా ఎన్నికయ్యాక, సాంప్రదాయక రోమన్ క్యాలెండర్ ఎన్నోమార్పులకు గురైందని గ్రహించి దానికి సంస్కరణ అవసరమని నిర్ణయించుకొని, అలెగ్జాండ్రియన్ సోసిజినెస్ అనే గ్రీక్ ఖగోళ శాస్త్రవేత్త సహాయం తీసుకోని అప్పటి రోమన్ క్యాలెండరు చాంద్రమానం ప్రకారంగా రూపొందించారు కావున తను సౌరమానం ప్రకారంగా లెక్కించాలని చూడగా 365.25 రోజులుగా లెక్కించబడినాయి. దానితో అప్పటి రోమన్ క్యాలెండరుకు 10 రోజులు జోడించి సంవత్సరానికి 365 రోజులుగా ఒక కొత్త క్యాలెండరును రూపొందించాడు. అలానే 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలకు ఒక రోజు కలపాలని ఆ సంవత్సరాన్నిలీప్ ఇయర్ గా ప్రకటించాడు, మరియు అప్పటివరకు మార్చ్ లో జరుపుకునే కొత్త సంవత్సరాన్ని జనవరి 1తో జరుపుకోవాలని మార్పులు చేసి క్రీ. పూ. 45 వ సంవత్సరం లో ప్రవేశపెట్టాడు. ఇలా జూలియస్ సీజర్ తో రూపొందింది కావున ఈ క్యాలెండర్ను జూలియస్ క్యాలెండర్ గా పిలువబడింది.

          క్రీ. పూ. 44 లో జూలియస్ సీజర్ హత్యకు గురైన తర్వాత అతని వారసుడు మార్క్ ఆంటోనీ జూలియస్ గౌరవార్ధం జూలియస్ జన్మించిన నెలైన క్విటిలిన్ (Quintilis) ను జులై గా మార్చాడు. ఆ తర్వాత  క్రీ. పూ. 27 లో అగస్టస్ (Augustus) రోమ్ నియంత్రణ భాద్యతను పొంది రోమ్ చుట్టూ ఉన్న దేశాలను కలుపుకొని ఒక పెద్ద రోమ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ. పూ. 9 వ సంవత్సరం వరకు లీప్ సంవత్సరం 4సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి 3సంవత్సరాలకు లెక్కించారు మత పెద్దలు, అలా 36 సంవత్సరాలు కొనసాగించారు. అది గమనించిన అగస్టస్ దానిని సరైన స్థానానికి తీసుకొరావడానికి 12 సంవత్సరాలు లీప్ ఇయర్ ను రద్దు చేసాడు. క్రీ. పూ. 8 వ సంవత్సరం లో అగస్టస్ గౌరవార్ధం అప్పటివరకు సెక్సటిలిన్ గా ఉన్న నెలను అగస్ట్ (August) గా మార్చారు. తిరిగి క్రీ. శ. 4 వ సంవత్సరం నుండి జూలియస్ ప్రతిపాదించిన విధంగా లెక్కించారు, తద్వారా తదుపరి లీప్ ఇయర్ క్రీ. శ. 8 వ సంవత్సరం నుండి కొనసాగింపబడినాయి.

ఆ తర్వాత కొందరు చక్రవర్తులు కొన్ని నెలల పేర్లను మార్చారు కానీ అవి అంత ప్రాముఖ్యత పొందక వాటి పాత నెలల పేర్లతోనే చలామణి అయినాయి. ఈ జూలియస్ క్యాలెండరు రోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ భాగం ప్రామాణికంగా తీసుకోనబడలేదు. కొత్త సంవత్సరాన్ని కూడా జనవరి 1న కాకుండా పాత రోమన్ క్యాలెండర్ మాదిరిగా మార్చ్ లో జరుపుకున్నారు. ఎందుకంటే జూలియస్ తప్పుగా లెక్కించాడని వారు భావించారు,అలా వారు భావించడం  కూడా నిజమైనదే. ఎందుకంటే జూలియస్ సౌరమానం సంవత్సరానికి 11నిమిషాలు ఎక్కువ లెక్కించడం వల్ల 1000 సంవత్సరాలకు 7రోజులు మరియు 15వ శతాబ్దం మధ్య నాటికీ ఏకంగా 10రోజులు ఎక్కువ కలిసాయి.

          క్రీ. శ. 1570 లో దీనిని గ్రహించిన రోమ్ చర్చ్ పోప్ గ్రెగొరీ XIII (Pope Gregory XIII) దీనిని సవరించాలని జేసుయిట్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టోఫర్ (క్రిస్టోఫర్) తో కలిసి జూలియస్ క్యాలెండరును కొద్దిగా సవరించి ఒక నూతన క్యాలెండర్ ను క్రీ. శ. 1582 లోతీసుకువచ్చాడు. అదే గ్రెగోరియన్ క్యాలెండర్. జూలియస్ తన క్యాలెండర్ లో సంవత్సరానికి 365.25 రోజులుగా లెక్కించగా, ఈ గ్రెగొరీ తన గ్రెగోరియన్ క్యాలెండర్ లో సంవత్సరానికి 365.2425 గా లెక్కించి, అప్పటికి 10 రోజులు ఎక్కువున్నవాటిని తొలగించి, జూలియస్ క్యాలెండర్ లోని లీప్ ఇయర్ ను కూడా కొద్దిగా సవరించి లీప్ ఇయర్ అనేది ఆ సంవత్సరాన్ని 4 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుంది మరియు శతాబ్దాన్ని మాత్రం 400 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుందని ప్రతిపాదించాడు. అనగా శతాబ్దం అనగా 1700,1800,1900,2000 లాంటివి కానీ ఇందులో లీప్ ఇయర్ మాత్రం 2000వ సంవత్సరం. ఎందుకనగా 2000 మాత్రమే 400తో సరిగ్గా భాగించబడుతుంది.

          ఈ గ్రెగొరీ రూపొందించిన గ్రెగోరియన్ క్యాలెండరు సౌరమానానికి కొద్ది దగ్గరగా లెక్కింపబడినది కావున ఈ క్యాలెండరు మెల్లి మెల్లిగా ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరించడం మొదలెట్టినాయి. పొప్ గ్రెగొరీ XIII కూడా జూలియస్ చెప్పినట్టుగానే కొత్త సంవత్సరం జనవరి 1నే అని నిర్ధారించాడు. అలాగే ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్ కూడా అప్పటివరకు 11వ నెలగా అనుసరిస్తున్న జనవరి ని మొదటి నెలగా ఉంచి నూతన సంవత్సరాన్ని ప్రారంభించాడు. దానితో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన జరుపుకోవడం మొదలయింది.ఎందుకు ఈ జనవరి 1నే జూలియస్, గ్రెగొరీ ప్రతిపాదించారనేదానికి సరైన ఆధారాలు లేవు కాని చరిత్రకారులు చెప్పేదేమిటంటే, డిసెంబర్ 25న జీసస్ జన్మించి జనవరి 1కి 8రోజులు అవుతుంది. ఆ రోజు జీసస్ కు నామకరణం చేసారని ఆ రోజు ప్రార్ధనలు జరుపుతారు కావున దానికి గుర్తుగా జనవరి 1ని కొత్త సంవత్సరంగా నిర్ధారించి ఉంటారని చెబుతారు. అంతేకాక ఈ రోమన్ మరియు జూలియస్ క్యాలెండర్ లోని నెలల పేర్లను పరిశీలిస్తే కారణం ఏంటో తెలుస్తుందంటారు.

  • నెలల పేర్లను వాటి కారణాలు

 

          జనవరి అనేది రోమన్ దేవుడు అయినా  జానుస్ (Janus) నుండి వచ్చింది. జానుస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి, ఒక ముఖం గడిచిన కాలం చూస్తుంటే, రెండో ముఖం రాబోయే కాలంను చూస్తుంది. కావున ఇది ఒక కారణం అయిఉంటుంది అని అంటారు.

అలాగే మిగతా నెలల పేర్లు కూడా పరిశీలిద్దాం.

ఫిబ్రవరి (February)  -  ఫెబ్రా (Febra) అనే పండుగ నుండి వచ్చింది.

మార్చ్ (March)  -  మార్స్ (Mars) అనే రోమన్ దేవుడు నుండి వచ్చింది. ఈ దేవుడు యుద్దానికి మరియు వ్యవసాయానికి అధిపతి. వ్యవసాయ పనులు కూడా ఈ నెలలోనే మొదలుపెట్టేవారు. కావున ఈ నెలనే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు.

ఏప్రిల్ (April)  - ఇది రోమన్ క్యాలెండర్ లో రెండవ నెలగా ఉండేది. ఏప్రిలిస్ (Aprilis) అనే పేరు నుండి వచ్చింది. ఏప్రిలిస్ అంటే వికసించడం అని అర్ధం, ఈ నెలలోనే పంటలు మొలకెత్తడం, చెట్లకు పూలు పూయడం మొదలవుతాయి.

మే (May)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో మూడవ నెలగా ఉండేది. మైస్ (Maius) అనే దేవుడి పేరుమీద గుడి వార్షికోత్సవాలను, పుట్టినరోజులను ఒక పండుగగా చేస్తారు. అందులోనుండి వచ్చింది.

జూన్ (June)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో నాల్గవ నెలగా ఉండేది. రోమన్ దేవత అయిన జూనో (Juno) నుండి వచ్చింది. ఈ దేవత ప్రేమ మరియు వివాహాల యొక్క దేవత. ఈ నెలల్లో వివాహం చేసుకోవడం అదృష్టంగా భావించేవాళ్లు.

జులై (July)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో క్విటిలిస్ (Quintilis) పేరుతొ ఐదవ నెలగా ఉండేది. క్విటిలిన్ అనగా ఐదు (Five) అని అర్ధం. దీన్ని జూలియన్ (Julian) గౌరవార్ధం జులై (July) గా మార్చారు.

ఆగష్టు (August)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో సెక్సటిలిన్ (Sextilis) పేరుతొ ఆరవ నెలగా ఉండేది. సెక్సటిలిన్ అనగా ఆరు (Six) అని అర్ధం. దీన్నిఅగస్టస్ (Augustes) గౌరవార్ధం ఆగష్టు (August) గా మార్చారు.

సెప్టెంబర్ (September)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఏడవ నెలగా ఉండేది.సెప్టెం (Septem) అనే పదం నుండి వచ్చింది. సెప్టెం అనగా సెవెన్ (seven) అని అర్ధం.

అక్టోబర్ (October)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఎనిమిదవ నెలగా ఉండేది. ఆక్టో (Octo) అనే పదం నుండి వచ్చింది. ఆక్టో అనగా ఎనిమిది (Eight) అని అర్ధం. 

నవంబర్ (November)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెలగా ఉండేది. నోవేమ్ (Novem) అనే పదం నుండి వచ్చింది. నోవేమ్ అనగా తొమ్మిది (Nine) అని అర్ధం.

డిసెంబర్ (December)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో పదవ నెలగా ఉండేది. డెసెమ్ (Decem) అనే పదం నుండి వచ్చింది. డెసెమ్ అనగా పది (Ten) అని అర్ధం.

  • అంగీకరణలు

మొదట ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ను కొన్ని దేశాలు స్వీకరించలేదు. జూలియస్ క్యాలెండర్ లోని లోపాలను సరిచేసి సౌరమానం కు దగ్గరగా లెక్కకట్టిందని భావించి మెల్ల మెల్లగా దీన్ని స్వీకరించడం మొదలెట్టినారు. దీన్ని ముందుగా క్రీ. శ. 1582 లో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ స్వీకరించాయి. అలాగే 1700 లో జర్మనీ, 1752 లో బ్రిటన్, 1873 లో జపాన్, 1875 లో ఈజిప్ట్, 1896 లో కొరియా, 1912లో చైనా, 1916 లో బల్గేరియా, 1918 లో రష్యా స్వీకరించాయి. తర్వాత 17, 18 శతాబ్దంలో తమ ఆదీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిష్ వారు దీన్ని ప్రవేశపెట్టారు.  ఇంతటి ప్రసిద్దిగాంచిన ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లో కూడా కొంత తప్పు ఉంది. అది ఏంటంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి 24సెకనులను ఎక్కువగా లెక్కించుకుంటున్నాము. ఆ ప్రకారంగా 3600 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. 19శతాబ్దంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తఐన సర్ జాన్ హెర్షెల్ (Sir John Herschel) దీన్ని సవరించడానికి ఒక ఉపాయం చెప్పాడు. అది ఏమిటంటే రాబోయే 4000 సంవత్సరం ను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలివేయడం అని. ఆ తర్వాత దీనిపై కమిటీ కూడా వేశారు, వారు కొన్ని ప్లాన్ లను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ అది ఇప్పటి వరకు ఎటు తేలలేదు. జూలియస్ క్యాలెండర్ ప్రకారం ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి చుస్తే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతానికి కొంత యధార్థతంగా ఉందని ఉరుకుంటున్నారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter