అల్లాహ్ మార్గంలో డబ్బు ఖర్చు చేయడం ఇహపరలోకాలలో మనశ్శాంతికి దారి
జకాత్ ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒక స్తంభం. ఈ విధిధనాన్ని ఇవ్వడం గురించి ఖురాన్ మరియు హదీసులో పలు చోట్ల అల్లాహ్ బోదించాడు. ప్రతి ధనవంతుడిపై (ఒక సంవత్సరం గడుస్తుందో) ఈ జకాత్ ఇవ్వడం విధి.
వాస్తవం ఏమనగా రంజాన్ మాసంలో ప్రార్థన యొక్క పుణ్యం అధికమవుతుంది. నఫీల్ యొక్క ప్రార్థన ఫరజ్ లాంటిది, ఒక ఫరజ్ ప్రార్థన 70 ఫర్ధ్ నమాజులతో సమానమైనది. ఉమ్రా యొక్క పుణ్యం హజ్ లాంటిది, మరియు రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో దాని పుణ్యం 7 రెట్లుకు పైగా అధికమవుతుంది.
జకాత్ యొక్క అర్థం శుభ్రం అవడం. ఖురాన్ లో అల్లాహ్ ఇలా బోధించాడు:
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا
వాస్తవానికి తన ఆత్మను శుధ్ధపరచుకున్న వాడే సఫలుడవుతాడు.
وَقَدْ خَابَ مَن دَسَّاهَا
మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.
ఈ ఆయత్ ఇహపరలోకాలతో కూడి ఉన్నది. దీంతో ఏం అర్థం అవుతుందంటే ఒక వ్యక్తి నరకం నుంచి విముక్తి పొంటాలంటే, తన డబ్బును అల్లాహ్ దారిలో ఖర్చు చేయాలి. ఒకేచోట ఎన్నో రోజులు నిలిచి ఉన్న నీరు మనిషి తాగితే శరీరంలో వ్యాధి వస్తాయి. జకాత్ కూడా అటువంటిదే.
అల్లాహ్ ఖురాన్ లో ఇలా బోధించాదు:
وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ
అల్లాహ్ ప్రీతిపొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసే వారి పోలిక: మెట్ట భూమిపై నున్న ఒక తోటవలె ఉంటుంది. దానిపై భారీవర్షం కురిసినపుడు అది రెండింతల ఫలమునిస్తుంది. భారీవర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు).
జీవితంలో ప్రతి ఘడియ ముఖ్యమైనది. ప్రపంచం యొక్క ఆశలలో మునిగి అల్లాహ్ మాటలను మరవకూడదు. ఖురాన్ లో ఇలా ఉంది:
وَأَنفِقُوا مِن مَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ
మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి: “ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు! నేను దాన-ధర్మాలు చేసి, సత్పురుషులలో చేరిపోయేవాడిని కదా?” అని పలికే స్థితి రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనో పాధినుండి ఖర్చుచేయండి
అవకాశం చేజారిపొక ముందే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అల్లాహదారిలో ఖర్చు చేయడంలో రెండు భాగాలు ఉన్నాయి:
1. واجب )తప్పనిసరి)
2. نفل (ఆదనం)
ఎవరైతే విధిధనాన్ని ఇవ్వరో వారు పెద్ద పాపాత్ములుగా గుర్తించబడతారు. అలాగే సదకా (ఆదన దానం) ఇవ్వడం కూడా పెద్ద పుణ్యమైన విషయం. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వారికోసం ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఒకప్పుడు మదీనాలో మంచి నీరు లేకపోవడంతో మదీనా యొక్క ముస్లింలకు చాలా కష్టం ఉండేది. మదీనాకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక బావి ఉండేది. అది ఒక యూదునికి చెందినది. అతడు ముస్లింలకు తన మంచి నీరు ఇచ్చేవాడు కాదు. ఇది గమనించిన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రియ సహబాలతో ఇలా అంటారు: ఎవరైతే ఆ మంచి నీటి సగం బావిని కొంటారో, వారు స్వర్గపుపానీయం తాగుతారు. అప్పుడు 12 వేల దిరహములు పెట్టి మన ప్రియ ప్రవక్త యొక్క ప్రియ అనుచరుడు హజ్రత్ ఉస్మాన్ రదియల్లాహు అన్హు కొని మదీనా యొక్క ముస్లింలకు ఉచితంగా ఆ మంచి నీటి బావిని ఇస్తారు. మదీనా యొక్క ముస్లింలకు అవసరం అయిన తరువాత కూడా ఆ నీరు మిగిలేది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదులను పిలిచి ఇలా అన్నారు: మదీనా ముస్లింల నీరు అవసరం తీరిన తరువాత మిగిలిన నీటిని మీరు ఉపయోగించుకోండి. మదీనా యొక్క ముస్లిం వారి అవసరం అయిన తర్వాత మిగిలిన నీరు యూదులు వాడుకునేవారు. ఏదో సమస్యతో ముస్లిం వారు వచ్చి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంతో ఇలా చెప్పారు: మీరు యూదులకు ఉచితంగా నీరు ఇవ్వడం మానేయండి. దాంతో మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: నీరు ఇవ్వడం మానలేము. కానీ ఆ అర్థ బావిని కూడా తీసుకోవచ్చు కదా!. అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు అన్హు 8 వేల ది పెట్టి మిగతా సగ బావిని కొని మదీనా వాసులకు ఉచితంగా దానం చేశారు.
హజరత్ అబూ మూసా అష్అరీ రదియల్లాహ్ అన్హు చెబుతున్నారు ఏమనగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా చెప్పారు ప్రతి మనిషి సదక అనేది ఇవ్వాలి ,అప్పుడు మేము “ఎవరి వద్దైనా ఏ వస్తువు లేకపోతే ఏం చేయాలి?” అని అడగగా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పని చేసి దాంట్లో అతడికి లాభం తీసుకుని సదకాగా ఇవ్వాలి! అప్పుడు మేము ఇలా అడిగాము ఇలా చేయలేకపోతే? ఏం చేయాలి అప్పుడు ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఇలా అన్నారు లేకపోతే సాటివారికి సహాయం చేయాలి అది కూడా చేయలేకపోతే? మనిషిలకు మంచి మాటలు చెప్పాలి అది కూడా చేయలేకపోతే? తమరికి తాము పెద్ద అనుకోకూడదు.
దీంతో ఏమీ అర్థం అవుతుంది అంటే సదకా అనేది ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా.
అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం గురించి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియ అల్లాహ్ అన్హ తో ఇలా అన్నారు:
لا تردي المساكين ولو بشق تمرة، يا عائشه احبي المساكين وقربيهم فان الله يقربڪ يوم القيامة.
ఓహ్ ఆయిషా! పేదవారిని తరమొద్దు ఒక ఖర్జూరపు ముక్కంతా సరే. పేదవారిని ప్రేమించు, వారిని దగ్గరికి తీసుకో, అల్లాహ్ ప్రళయ దినాన్న నిన్ను దగ్గరకి తీసుకుంటాడు.
సహల్ బిన్ సఅద్ ఉల్లేఖన ప్రకారం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చెప్పారు
أنا وڪافل اليتيم في الجنة هكذا وقال بأصبعيه السبابة الوسطي.
నేను మరియు అనాథ సరక్షకుడు స్వర్గంలో ఎలా ఉంటాం. ( తన చూపుడు వేలు & మధ్య వేలితో సూచిస్తూ చెప్పారు)
ఈ రంజాన్ మాసంలో అందరూ అల్లాహ్ చూపిన మార్గంలో నడవాలని, మంచి సంకల్పాలతో మరియు మంచి పనులతో అల్లాను వేడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.