ఖాలిద్ బిన్ వలీద్ (ర) ఇస్లాం స్వీకరించక ముందు ఉహుద్ యుద్ధంలో

ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు  ఒక సామాన్య వ్యక్తి కారు. వారు ఒక పెద్ద సైనికుడలు మరియు ఒక తెలివైన సేనాధిపతి. ముందుగా వారు ఇస్లాం స్వీకరించలేదు. కానీ తరువాత వారు ఇస్లాం స్వీకరించి ఇస్లాం ధర్మాన్ని పాటించారు. అలాగే వారు గజ్వాయే ఉహుద్  మరియ ఖందక్ లాంటి  పెద్ద పెద్ద యుద్ధాలలో ఇస్లాంకి వ్యతిరేకంగా పాల్గొన్నారు.  అందున వీరి వల్ల ఉహుద్ యుద్ధంలో ముస్లింలకు చాలా నష్టం కలిగింది. వీరు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఎన్నో యుద్ధాలలో విజయం సాధించారు. ఎంత పెద్ద సైనికుడైన వారిని చూస్తే భయపడే వాడు.

బదర్ యుద్ధంలో ముస్లింలు శత్రువులపై విజయం సాధించారు. దీనివల్ల ముష్రికిన్ లకు చాలా పెద్ద నష్టం కలిగింది. ఈ యుద్ధంలో ముష్రికిన్ల చాలామంది చనిపోయారు. దీంట్లో వాళ్ళ నాయకుడు అబు జహల్ కూడా చనిపోయాడు.  కావున మక్కా వాళ్లకు చాలా కోపం కూడా వచ్చింది. మక్కా వాళ్ళు యుద్ధంలో జరిగిన నష్టం వల్ల కోపంతో వచ్చి పగ కోసం మరో యుధ్దానికి తలపెట్టారు. ఈ యుద్ధంలో శత్రువులకు   అబూ సూఫియాన్ నాయకత్వం వహిస్తాడు.  ఈ యుద్ధంలో ఖాలిద్ బిన్ వలీద్ కూడా ఉంటారు. యుద్ధం మొదలైన తరువాత మన నబి సల్లల్లాహు అలైహి వసల్లం 50 మందికి  దర్ర-ఎ-ఐనైన్  లో ఉంచుతారు.

తర్వాత మామూలు యుద్ధం మొదలవుతుంది. ముందుగా ముస్లింలు తమ బలం చూపిస్తూ ముష్రీన్లకీను కొట్టుకుపోయారు. మరియు ముష్రికీన్లు ముస్లింల ముందు ఉండలేక పారిపోయారు.   అప్పుడు ముస్లింలు అందరూ ఆనందంగా మాలే గనిమత్ (అంటే యుద్ధం తర్వాత ఓడిపోయిన సైనికుల ధనం) కోసం వెళ్లిపోయారు.  అప్పుడు దర్ర-ఎ-ఐనైన్ లో ఉన్నవారు కూడా వెళ్లిపోతారు. కానీ నబి సల్లల్లాహూ అలైహి వసల్లం వారిని ముందే హెచ్చరించారు. ఓడిపోయినా, విజయం సాధించినా మీరు ఇక్కడ నుంచి కదలకూడదు. కానీ 12 మంది తప్ప అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆ దారి నుంచి వచ్చేసారు. ఆ సమయంలో ముస్లింలు అందరూ మాలే గనిమత్ వెనకాల పడి ఉంటారు. అప్పుడు ఆ 12 మందిని షహీద్ చేసేసి  ముస్లింల పై దాడి చేసేస్తారు. దానివల్ల ముస్లింలకు చాలా నష్టం కలుగుతుంది. ఎవరు కాని ఈ యుద్దం లో ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.

ఈ యుద్ధం ముస్లింలకు చాలా నష్టం కలిగించిన యుద్ధాలలో మొదటిది. దీంట్లో ముస్లింలు అశ్రద్ధ వహించడం వలన ఈ నష్టం జరిగింది. కొందరు నబి సల్లల్లాహు అలైహి వసల్లం  మాట వినకుండా ఆ దారి నుంచి  వచ్చేస్తారు. అప్పుడు వాళ్లు రాకపోయి ఉంటే ముస్లింలు ఆ యుద్ధం కూడా గెలిచేవాళ్ళు. ఖాలిద్ బిన్ వలీద్ ఖందక్ యుద్దం లో కూడా ముష్రికీన్ల తరుపు నుండి ఉన్నారు.  కాని ఆ యుద్ధం లో ముస్లిములే విజయం సాధిస్తారు.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter