హిజ్రత్ ఇస్లామిక చరిత్రలో జరిగిన మైలురాయి సంఘటన - మొదటి భాగం

1421 సంవత్సరాల క్రితం మక్కా మదీనా ఉన్న ఈ భూమిలో ఒక మహా ఘటన జరిగినది. ఆ ఘటన ద్వారా అల్లాహ్ సుబహానహు వతఆలా ఇస్లాం ధర్మానికి విజయం ప్రసాదించాడు.

ఇంత పెద్ద మహాఘటన తెలియని వారు ఉండరు. *ఇంత* అనే పదం చాలా చిన్నది కావచ్చు. కానీ దాని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది.

మక్కా.... ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.... అబూబకర్ రదియల్లాహు అన్హు..... కపటం...... విమోచనం.... గుహ......... సాలీడు పురుగు.........ఖురైష్...... సురాఖా.... అస్మా రదియల్లాహు అన్హా........... అన్సార్........ మదీనా.... ఇదంతా ఆ చరిత్ర యొక్క ఉప శీర్షికలు.

దాని వివరణకు వెళితే.... మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 13 సంవత్సరాల పాటు ఇస్లాం ప్రబోధించారు. చాలా సంవత్సరాలు, ప్రజల నుంచి ఎన్నో కష్టాలు, దారుణాలు ఎదుర్కొన్నారు. వారి కష్టాలు కఠినంగా మారడం తర్వాత, ఒకరోజు రాత్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించగా వారి కలలో వలస చేయవలసిందిగా సందేశం లభించింది. అందులో ఉన్న ఒక ఖర్జూరపు తోట కనిపించింది. ఈ సందేశాన్ని ఆజ్ఞగా భావించి, మక్కా నుంచి ఎన్నో యాత్ర సమూహాలు మదీనాకు బయలుదేరాయి. బయలుదేరేటప్పుడు వారు తమతో పాటు తమ ధర్మాన్ని తోడుగా తీసుకొని, మిగతా ఇల్లు, సంపద అన్నీ మక్కాలోనే విడిచిపెట్టారు. అబూబకర్ రదియల్లాహు అన్హు కూడా వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆగమని చెప్పారు. (తొందరపడకు అల్లాహ్ నీకు ఒక తోటి ప్రయాణికుడిని ప్రసాదిస్తాడు).

ఇది ఇలా ఉండగా, మరోపక్క ప్రవక్త యొక్క వలస ద్వారా వచ్చే ప్రమాదాన్ని ఖురైష్ గ్రహించక తప్పలేదు. అందువలన, తొందరగా దారుల్ నద్వాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో సమయం చేజారిపోక ముందే ప్రవక్తని చంపాలని ప్రయత్నించారు. తర్వాత అబూజహల్ దారణమైన విమోచక అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదేమనగా ప్రతి ఒక్క తెగ నుంచి ఒక దట్టమైన యువకుడు వచ్చి, చేతిలో ఒక ఖడ్గం తీసుకుని ఒక్కవేటుగా అందరూ ముహమ్మద్ను దాడి చేసి చంపేయాలి. అప్పుడు ప్రతి ఒక్క తెగ తమ పగ తీర్చుకున్నట్టుంటుంది. ఈ అభిప్రాయాన్ని ప్రతి తెగవారు ఉత్తమ అభిప్రాయంగా మెచ్చుకున్నారు మరియు ఏకీభవించారు.

 (ఓ ప్రవక్తా!) సత్య-తిరస్కారులు మిమ్మల్ని బంధించటానికి, హతమార్చటానికి, లేదా వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికితెచ్చుకోండి)! వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్‌ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే కుట్రలు పన్నటంలో అందరికంటే ఉత్తముడు.

శత్రువులు పన్నిన ఈ కుట్రని జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చేరవేశి ఇలా అన్నారు (ఈరోజు రాత్రి మీరు మీ ఇంట్లో పడుకోవద్దు)

అబూబకర్ రదియల్లాహు అన్హు ఇంట్లో కుటుంబంతో కూర్చుని ఉండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముసుగు కప్పుకొని ప్రవేశించారు. ఈ సందర్భం చూసి అబూబకర్ రదియల్లాహు అన్హు చాలా గాభరాపడ్డారు. ఎందుకంటే ఈ సమయంలో ఈ వేషంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ రాలేదు కనుక. ఓ అబూబకర్ నీ వద్ద ఉన్నవన్నింటిని  వలసకు సిధ్ధం చేయి.

నా వద్ద ఉన్నది నా కుటుంబం మాత్రమే

సరే, ఇప్పడు నాకు వలస వెళ్ళేందుకు ఆత్ర వచ్చింది

అలాయితే, నేను మీతో రావడానికి సిధ్ధమే. అని ఏడవసాగారు. అప్పుడు ఓ కవిత చెప్పారు

సంతోషం నాపై ఆవహించింది, అందున ఆ అధిక సంతోషం ఇచ్చిన విషయమే, నా కంట కన్నీరు తెప్పించింది.

ఆయిషా రదియల్లాహు అన్హా కథనం ప్రకారం సంతోషంతో ఎక్కువయి ఏడ్చిన వారిలో ఆ రోజు నా తండ్రి అబూబకర్ రదియల్లాహు అన్హు కన్నా ఎక్కువగా ఎవర్ని చూడలేదు.

ఓ ప్రవక్త, నా దగ్గర ఉన్న రెండు ఒంటెల్లో ఒకటిని తీసుకోండి.

డబ్బుతో ఉంటేనే తీసుకుంటానని ప్రవక్త చెప్పారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహ్ సల్లం తన ఇంటికి వెళ్లి అలీ రదియల్లాహు అన్హుతో తన వద్ద ఉన్న అమానుతలన్నిటినీ తన యజమానులకు చేరవేయని ఆజ్ఞాపించారు. ఆ రాత్రిలో ఖురైష్ నాయకులంతా చేరుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చడానికి బయలుదేరారు. కానీ దేవుని మహత్వం ద్వారా ప్రవక్త తలుపు తెరుచుకొని శత్రువుల మధ్య నుంచి వెళుతున్నా కూడా ఎవరు చూడలేకపోయారు. నేల నుండి కొంత మట్టి తీసుకొని ఖురైష్ కళ్ళల్లో కొట్టి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రదియల్లాహు అన్హును మంచం పై ముఖం కప్పుకొని పడుకోమన్నారు. బయటివారు మంచం పైన శరీరాన్ని మాత్రమే చూడగలిగారు. ప్రతి ఒక్కరూ అది ప్రవక్త అని నమ్మారు కానీ తెల్లవారి చూస్తే వారందరూ మోసపోయారని తెలుసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రికే వెళ్ళిపోయారని అప్పుడు వారికి తెలిసింది. అప్పటికప్పుడే మక్కాలోని ప్రతి మార్గంలో ఒక ఒక మనిషిని పెట్టారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పట్టుకున్న వారికి 100 ఒంటెల బహుమానాన్ని ప్రకటించారు.

మక్కా నుండి మదినాకు పోయే మార్గంలో ఖురైష్ మనుషులు ఉంటారని తనకోసం వెతుకుతుంటారని ప్రవక్తకు ముందే తెలుసు. అందుకని వేరే మార్గం ద్వారా ప్రవక్త వెళ్లారు అక్కడ దారిలో సౌర్ అనే గుహ లో మూడు రోజులు ఉన్నారు. ఆ గుహలోని అన్ని కన్నాలను కప్పెయ్యాలని అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రయత్నించారు. కానీ చివరికి రెండు చిన్న కన్నాలు మిగిలిపోయాయి. అక్కడ తను తన పాదాలు పెట్టి ఒకన్నాలను కప్పేసారు. ఆ తర్వాత ప్రవక్త గుహలో ప్రవేశించి, అబూబకర్ రదియల్లాహు అన్హు ఒడిలో నిద్రపోయారు. నిద్ర సమయాన ఒక సర్పం ఒక పాదం మీద కాటు వేసింది. కదిలితే ప్రవక్త నిద్ర చెడిపోతుందేమో నన్న భయంతో అబూబకర్ రదియల్లాహు అన్హు సహించారు. కానీ కంటి నిండా వచ్చిన కన్నీళ్లు ఎక్కువ ప్రవక్త ముఖంపై పడ్డాయి. దాంతో ప్రవక్త నిద్రలేచారు. చూస్తే ఒక సర్పం ఒక పాదాన్ని కాటు వేసి ఉంది. ఏమైందని అడగగా పాము కాటు వేసిన సంగతి చెప్పారు. అప్పుడు ప్రవక్త తన నోటిలోని లాలాజలం తీసుకొని కాటిన చోటు రాయగా, దాంతో దాని విరుగుడు లభించింది.

అబూబకర్ రదియల్లాహు అన్హు కుమారుడు అబ్దుల్లాహా ఓ దిట్ట వివేక యువకుడు. దిన సమయంలో ఖురైష్ వారు మాట్లాడే మాటలను వారు పన్నే కుట్రలను గమనిస్తూ, రాత్రి సమయాన ఎవరికి తెలియకుండా గుహలో ప్రవేశించి అక్కడ ప్రవక్తతో మరియు తన తండ్రికి సమాచారం అందించేవాడు. తిరిగి మక్కాకి తెల్లవారి ముందే చేరుకునేవాడు. అలాగే ఆయిషా మరియు అస్మా రదియల్లాహు అన్హమా వారి కోసం ఆహారం సిద్ధం చేసేవారు. ఆహారాన్ని కట్టి గుహకి అస్మా రదియల్లాహు అన్హా వెళ్లేవారు. ఒకసారి ఆహారం కట్టడం కోసం తన నడికట్టును రెండు భాగాలుగా చీర్చి ఒకటి తను పట్టుకొని రెండోది ఆహారాన్ని కట్టారు. అందువల్ల తనకు జాతు నితాఖైన్ అని బిరుదు లభించింది. అలాగే ఒకరి వద్ద అబూబకర్ రదియల్లాహు అన్హు వద్ద ఆమిర్ ఇబ్ను ఫుహైరా అనే వ్యక్తి పని చేసేవాడు. అతను అబూబకర్ రదియల్లాహు యొక్క మేకలకు కాపరిగా ఉండేవాడు. సాయంత్రం వేళ ఆ మేకలను తోడుకుంటూ గుహ వైపు వెళ్లేవాడు. అక్కడదాని పాలు తాగిపించి రాత్రి అవ్వగానే తిరిగి ఇంటికి చేరుకునేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ ఉరైఖిత్ అనే ఓ అముస్లిమును (అతను స్వచ్ఛంద మార్గదర్శకుడు మరియు రహదారిలో నైపుణ్యం కలిగి ఉన్నావాడని) మదీనాకు మార్గదర్శికా నియమించుకున్నారు. మూడు రాత్రుల తర్వాత సౌరు గుహలో అతనిని కలుసుకున్నారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter