మదీనా వైపు హిజ్రత్ యొక్క సన్నాహాలు

మన ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి సల్లం యొక్క అలనా పాలన ముందుగా తమ మాతా తరువాత, తమ చిన్నన్న మళ్ళీ, వివాహం తర్వాత తమ సతీమణి ఖదీజా రదియల్లాహు అన్హా ఎల్లప్పుడూ తమకు తోడుగా ఉండేది. వీరి మరణం తర్వాత మన ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లంకు తోడుగా వారి సహాబీలు అనగా అనుచరులు మాత్రమే మిగిలారు. వీరి మీద రకరకాలుగా హింసలు మరియు బాధలు అవిశ్వాసులు చేపడుతుండేవారు.

ఇందుచేత మదినాలోని ప్రజలు మన ప్రియ నాయకుని రాక కోసం ఎదురు చూస్తుండేవారు. ఎందుకంటే వారు, వీరితో అతిథి మర్యాదలతో మరియు సకల సౌకర్యాలతో చేపడతారని ఒప్పందం చేసుకున్నారు.

ముస్లింలపై అవిశ్వాసులు బాగా హింసించడంతో వారు హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుమతిచే మదీనా మునవ్వరా వైపు హిజ్రాత్ చేశారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై కూడా హింస పెట్ట సాగారు. అయితే అల్లాహ్ వీరిని మదీనా వైపు హిజరత్ చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మక్కా ముకర్రమాలో కేవలం కొందరు ముస్లిం బానిసలు, హజరత్ అబూబకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు గారు, హజరత్ అలీ రదియల్లాహ్ అన్హు గారు మరియు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు మరియు కొందరు మిగిలి ఉండేవారు.

దాదాపు ముస్లింలందరూ హిజ్రత్ చేయడంతో అవిశ్వాసులు ఒక పన్నాగం పన్నారు. అదేమిటంటే ప్రతి వంశం నుండి ఒకరు వచ్చి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంను చుట్టుముట్టి, తర్వాత, ఆయన ప్రార్థన కోసం పొద్దున్నే బయటికి వచ్చినప్పుడు, అందరూ కలిసి దాడి చేయాలి. ఈ మాట అబూ జహాల్ అన్నాడు.

దీని ప్రకారమే అంతా జరిగింది. ఈ సంఘటన గురించి తెలిసిన హుజూర్ సల్లలాహు అలైహి సల్లం గారు అలీ రజియాల్లాహు అన్హు గారిని‌ పిలిచి, ఇలా సెలవిచ్చారు. మీరు నా మంచం మీద నా కంబళి కప్పుకుని నిద్రించండి. మరియు ప్రజలకు తిరిగి వారికి సామాన్లు (అమానతులను) ఇచ్చేయండి. అనగా ప్రజలు వీరు చాలా మంచివారని, నమ్మకస్తుడని, నిజాయితీపరుడని తమ విలువైన సామాన్లు మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం దగ్గర ఉంచేవారు.

మహా ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారు బయటకి వస్తే చాలామంది తమను చుట్టుముట్టారు .దీనితో హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు సూరా యాసీన్ చదివి ఆ అవిశ్వాసులపై మట్టి ఊది వాళ్ల కళ్ళు ముందు నుండి చాలా సులభంగా వెళ్లిపోయారు. కానీ ఎవరూ చూడలేకపోయారు. ఇక నేరుగా హజరత్ అబూబకర్ సిద్ధిఖీ రదియల్లాహు అన్హు గారి దగ్గరికి వెళ్లారు. మదీనా వైపు హిజరత్ కొరకు రెండు ఒంటెలను సిద్ధం చేసి ఉంచమని ఆజ్ఞాపించారు. అంతేకాక ఆ ఒంటెలను మూడు రాత్రులకు మొత్తం గారే సూర్ అనగా సౌర్ అనే కొండమీద హాజరు చేయాలని వాటిని అబ్దుల్లా బిన్ ఉరైఖిత్ కు బాధ్యతగా అప్పగించారు.

అదే రాత్రికి హుజూర్ సల్లలాహు అలైహి వసల్లం గారు మరియు హజరత్ అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు గారు గుహ వద్ద చేరుకున్నారు. ఆ గుహలో ఇద్దరూ మూడు రాత్రుల వరకు ఉన్నారు. హజరత్ అబూబకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు యొక్క కుమారుడు అబ్దుల్లా రాత్రి గుహలో తోడుగా నిద్రించి, ఖురైష్  అవిశ్వాసులు ఏమి చేస్తున్నారు, దీని గురించి సంభాషించి మరియు ప్రొద్దున్నే పట్టణానికి తిరిగి వెళ్ళిపోతారు. హజరత్ అబూబకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు యొక్క బానిసైన ఆమిర్ బిన్ ఫుహైరా వారి గొర్రెల కాపరి, మరియు వారి కోసం రాత్రి రెండు గొర్రెలను వాటి పాలు వారికి త్రాగడానికి వీలుగా గుహలోనికి తీసుకువెళ్లేవారు.

అవిశ్వాసులు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం వెతక సాగారు. ఎంత వెతికినా కనపడకపోయేసరికి వారు వారి పాదచారలను గ్రహించారు. వాటి వలన వారి దగ్గరకు చేరుకోవాలని అనుకున్నారు. మొత్తానికి ఆ పాదచారాలను అనుసరించి గుహ వద్దకు చేరుకున్నారు. కానీ అక్కడ సాలీడు పురుగు తన వల అల్లింది. ఒక పావురం గుడ్డు కూడా పెట్టింది. ఇది చూసినవారు చాలా మంది ఇలా చెప్పారు, మహమ్మద్ గనుక ఇందులోనికి వెళ్ళి ఉంటే ఈ సాలీడు వల వేసి ఉండేది కాదు మరియు ఆ పావురం గుడ్లు కూడా పెట్టేది కాదు, అని తిరిగి వెళ్ళిపోయారు. ఈ స్థితిలో అబూబకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు గారు హుజూర్ సల్లలాహు అలైహి వసల్లం  గారితో ఇలా అడిగారు, ఓ రసూలల్లాహ్, ఒకవేళ వాళ్లలో నుంచి ఎవరైనా మన పాదచారాలను చూస్తే ఏమవుతుంది. అప్పుడు హుజూర్ సల్లలాహు అలైహి వ సల్లం గారు ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ మనతో పాటే ఉన్నారు. మనకు కీడు ఏమాత్రం తలపెట్టడు. మూడు రాత్రుల తర్వాత మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  గారు మరియు హజరత్ అబూబకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు గారు ఒంటెల మీద మదీనా వైపు పయనాన్ని ప్రారంభించారు. వీరితోపాటు ఆమిర్ బిన్ ఫుహైరా మరియు అబ్దుల్లా బిన్ ఉరైఖిత్ కూడా ఉన్నారు. ఈ విధంగా మదీనా వైపు ప్రయాణాన్ని ఆరంభించారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter