ప్రవక్త (స) వారి కుటుంబం మరియు వారి రాక ముందు అరబ్ దేశం
Arab before prophet, islamonweb.net

ప్రవక్త (స) వారి కుటుంబం మరియు వారి రాక ముందు అరబ్ దేశం

       అంతిమ రోజు వరకు రాబోవు మొత్తం మానవాళికి మార్గ దర్శకం కోసం నియమింపబడిన ముహమ్మద్(స)ను స్వీకరించే భాగ్యం అల్లాహ సుబ్హానహు వతాలా  అరబ్బులకు ప్రసాదించాడు. సాధారణముగ ప్రపంచము అభివృద్ది దశ లో పురోగతి చెందు చున్న కాలమై ఉండెనది. మానవునికి ఒక మంచి లక్ష్యము కొరకు సన్మార్గము లోనికి తీసుకొని వెళ్ళటానికి అవసరమైన మార్గాలు ఆకాలములో లేకుండెను. ఆకాలంలో అరబ్బులు విగ్రహరాధన లో మునిగి ఉండేవారు. "లాత్”"ఉజ్జ"మనాత్”లాంటి  ప్రధాన విగ్రహాలే కాకుండ ప్రతి ఇంటి లో కూడ ప్రత్యేకంగా ఒక్కొక్క విగ్రహ ముండేది.

        ఏక దైవ మైన అల్లాహుతాలా ను ఆరాధించటానికి హజ్రత్ ఇబ్రాహీం(అ) మరియు వారి సుపుత్రు లైన హజ్రత్ ఇస్మాయిల్(అ) ఇరువురు కలిసి పవిత్ర కాబాలయాన్ని నిర్మించారు. దాని చుట్టు ప్రక్కల లో అరబ్బులు మూడు వందల అరవై (౩60‍) విగ్రహాలను ఏర్పర్చుకొన్నారు. జూదం, మధ్యపానం, వంటివి వారి జీవితాలలో ప్రధాన భాగము లై ఉండేవి. వ్యాపార వర్తక బృందాలను లూటి చేయుటయే కాకుండా చిన్న చిన్న విషయాల కోసం సంవత్సరాల తరబడి యుద్దాలు చేసేవారు. ఇటువంటి అరేబియన్ సమాజములో ఒకరిని చంపడమనేది వారికి అంత గంభీర మైన విషయమేమి కాదు. ఆడబిడ్డల పుట్టుకను అవమానకరంగా భావించి వారిని సజీవ దహనం చేసేవారు. అదేవిధంగా పేదరికానికి భయపడి పుట్టిన మగ బిడ్డల ను సైతం చంపేవారు. ఇంత విశాలమైన ఒక సమాజము లో నీతికి ధర్మానికి మరియు దైవభయానికి విలువ లేకుండ పోయినది. ఈ విధముగా, ఈ సమాజము నైతికంగా దిగజారి అవమానపాలై ఉండేది. 

        అయితే అరబ్బుల లో అనేక మంచి గుణాలు కూడ ఉండేవి. వారు ధైర్యవంతులు, ధర్మాత్ములు, సత్యవంతులే కాకుండా స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వారు కూడాను. వారు సాదా సీదా జీవనం గడిపే నిరాడంబరులు. ఆ కాలం లో రోమన్ పేర్షియన్, ఇండియన్, సమాజముల వలె జ్ఞానులు కాక జ్ఞాన బోధ చేయు వారు లేక సతమతమగు చుండిరి. తమను ఉత్తమ మార్గము లో నడిపించే బోధనలను సంపూర్ణ పవిత్రత తో స్వీకరించ గల మానసిక స్ధితిలో వారు ఉండిరి. ఆ బోధనలను అవగాహన చేసుకొని తదనుగుణముగా నడచుకొనుటకు తహతహలాడుచుండిరి. ఈ సన్మార్గ ప్రవర్తనను పెంచుకొనుటకు సభ్య సమాజ నిర్మాణమునకు ఎటువంటి త్యాగమునకైనను సిద్దముగా ఉండిరి. సరిగ్గ అటువంటి సమయము లో క్రీ.శ. 6వ శతాబ్ధము చివరి లో అంతిమ ప్రవక్త యైన మహమ్మద్(స) ను ప్రవక్తగా  స్వీకరించే భాగ్యం అరబ్బులకు లభించినది.

 

ముహమ్మద్ (స)గారి కుటుంబము:

 

                హజ్రత్ ఇబ్రాహీం(అ) మరియు వారి సుపుత్రులైన హజ్రత్ ఇస్మాయీల్(అ) గారి వంశములో అంతిమ ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్(స) జన్మించారు. బాబిలోనియాలో జన్మించిన హజ్రత్ ఇబ్రాహీం(అ) చాలా కాలం వరకు స్వదేశీయులను ఏకదైవ విశ్వాసములోనికి ఆహ్వానించే పనిలో నిమగ్నమై ఉండిరి. ఇందుకొరకు వారు అనేక పరీక్షలు, కష్టాలు ఎదుర్కొన్నారు. వీరు చివరికి షిర్క్ నుంచి రక్షింపడటానికి తమ పత్నియైన హాజిరాబీబీ మరియు వారి సుపుత్రులైన హాజ్రత్ ఇస్మాయీల్(అ)ను తమ వెంట తీసుకొని"మక్కా"ను లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరారు. ఆ రోజులలో మక్కా  నిర్మానుష్యమైన ప్రదేశంగా ఉండేది.  అక్కడ భోజన వసతి సౌకర్యములేవి లేవు.  తోడు ఎవరు లేరు. ఆ క్లిష్ట భూమిలో పత్ని హాజిరా బీబీ, మరియు వారి సుపుత్రులైన హజ్రత్ ఇస్మాయీల్(అ) గారిని వదలి వెళ్ళాలని హజ్రత్ ఇబ్రాహిం (అ) గారికి అల్లాహు తాలా ఆదేశించెను. వారు అల్లాహు తాల ఆదేశాల్ని శిరసావహించారు. అల్లాహు తాలా యొక్క ఆదేశాలను శిరసావహించుటలో హాజిరబీబీ కి ఎటువంటి దుఖము కలగ లేదు. ప్రపంచనాధుడైన అల్లాహు తాలా యొక్క సంరక్షణను వారు  గట్టిగా విశ్వశించారు. తరువాత జరిగిన సంఘటన వారి విశ్వాసమును యాధార్ధం చేసినది. త్రాగటానికి నీరు లేక పసికందు ఏడ్చినప్పుడు హాజిర బీబీ నాలుగు వైపులూ నీటి కోసం పరుగులు తీశారు. చివరికి వారి సమీపములో నే ఒక నీటి ఊట వెలసినది. ఆ ఊట నుంచి నీరు పొంగిప్రహించడాన్ని చూసి హాజిర బీబీ "జం జం" అని కేక పెట్టారు (జం జం) అనగా సురియాని బాష లో ఆగుము అని అర్ధం. "జం జం" నీరు అనే పేరు తో పిలుప బడే ఆ నీరు నేటి వరకు కూడా నిరాటంకముగా వస్తూనే ఉన్నాయి. అవి చాల పవిత్రమైనవే కాకుండా అనుగ్రహము గలవి కూడాను.

        హజ్రత్ ఇస్మాయిల్(అ)గారి బాల్యం లో అసాధారణమైన ఒక పరీక్ష జరిగినది. తమ ప్రియ సుపుత్రులైన హజ్రాత్ ఇస్మాయిల్(అ) ను బలి ఇవ్వాలని హజ్రత్ ఇబ్రాహిం(అ) ను అల్లాహా సుబహానహు వ తఆలా ఆదేశించెను. తండ్రి కుమారులిరువురు ఆ పరీక్షలో నెగ్గారు. అల్లాహుతాలా యొక్క భవనమైన పవిత్ర"కాబాలయాన్ని" నిర్మించే భాగ్యం ఈ ఇరువురి మహా ప్రవక్తలకు అల్లాసుబహానుతాలా ప్రసాదించెను. కాబాలయ నిర్మాణము పూర్తి చేసిన తరువాత ఆ ఇరువురు ప్రవక్తలు అల్లాహుతాలా ను ఇలా ప్ర్రార్ధించారు. [" మమ్ములను కాపాడే ఓనాధా మమ్ములను నీవు స్వీకరించు"][రబ్బన తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీమ్](మొదటి కాండము)

        కాబాలయ నిర్మాణము తరువాత కూడ ఇస్మాయిల్(అ) మక్కాలో నే నివశించసాగారు. పవిత్ర గృహము చుట్టూ ఒక పెద్ద సమాజము పెరిగి పెద్దదైనది. హజ్రాత్ ఇస్మాయిల్(అ) గారి పవిత్ర సంతతి లో నుంచి ముహమ్మద్(స) గారి 40 వ పితామహు లైన "అద్నాన్" అనే అతను జన్మించారు. అతని సంతానము నుంచి "ఫిహర్ బిన్  మాలిక్ వచ్చారు "ఖురేష్" అనే పేరు తొ పిలువ బడే వీరు కూడా ఆ సంతతికి చెందిన వారే. ఫిహర్ వారసుల లో "ఖుసయ్ బిన్ కిలాబ్" కు  మక్కా యొక్క నాయకత్వం వచ్చి చేరినది. పవిత్ర కాబా సంరక్షణ"జం.జం"బావి యొక్క కాపలా పరస్పర సమాలోచనల నాయకత్వము మొదలైనవన్ని వారి శుభ ప్రదమైన హస్తాల లో ఉండేవి. వారి వంశ పరంపర నుండి అబ్దుల్ మునాఫ్ వచ్చారు. వారి పెద్ద కుమారులైన హాషిం నాయకత్వ గుణములు గల వ్యక్తి అబ్దుల్ మునాఫ్ గారి మరొక కుమారుడైన అబ్దుల్ ముతల్లిబ్ మరణించినప్పుడు అధికారాలన్ని హాషింగారి కుమారుడు మరియు ముహమ్మద్(స) గారి తాత అయిన అబ్దుల్ ముతల్లిబ్ గారికి సంక్రమించాయి. అబ్దుల్ ముతల్లిబ్  గారు తమ తాత ముత్తాతల కంటె ఉన్నతస్ధానం, కీర్తిప్రతిష్ఠలు మరియు స్నేహశీలాన్నిపొంద గలిగారు. వారి సుపుత్రులైన అబ్దుల్లా యే ప్రవక్త ముహమ్మద్(స) గారి పితామహులు. బనుసుహ్ర తెగకు అధిపతి అయిన వహబ్ గారి పుత్రి అమీన(ర) యే ముహ్మద్(స) గారి తల్లి. ముహమ్మద్(స) అమీన(ర) గారి గర్భము లో ఉన్నప్పుడే వారి తండ్రి అబ్దుల్లా మరణించారు.

 ముహమ్మద్(స) గారి తెగ అయిన "ఖురేష్" పవిత్ర కాబాలయానికి సంరక్షకులు అనే గౌరవము తొ ఇతర అరబ్బుల కంటే చాల అధికంగా వీరు గౌరవింపభడ్డారు. వారినాయకత్వ మహిమ భాష శుద్ధి మరియు వారి స్వభావమహిమ ను చూసి వారిని అందరు అభిమానించి అంగీకరించారు. అంతకుముందు "ఖురేష్" తెగకు చెందిన వారు హజ్రత్ ఇబ్రాహీం(అ)మరియు హజ్రత్ ఇస్మాయీల్(అ) గార్లు చూపిన పవిత్ర సన్మార్గమైన ఏకదైవారాధననే చేస్తుండేవారు. తరువాత "అంరుబ్ను లుహయ్య" అనే అతను విగ్రహారాధన ప్రారంభించాడు. ఒక సారి "సిరియా" కు వెళ్ళిన తను విగ్రహములతో తిరిగి వచ్చాడు. అది చూసి ప్రజలు ఆకర్షింపబడ్డారు. తరువాత క్రమంగా విగ్రహారాధన మక్కా మరియు ఇతర అరబ్ దేశాలలో వ్యాపించింది. అయితే హజ్రత్ మహమ్మద్(స) గారి తాతముత్తాతలలో ఏ ఒక్కరు కూడ విగ్రహారాధన చెయ్యుట గాని చెడు మార్గములో పయనించుటగాని చేయలేదు. 

డా. పి. అబ్దుల్ గఫ్ఫార్

చిత్తూరు

 

 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter