మదీనా వైపు హిజ్రత్

 హిజ్రత్ అనగా తమ స్వస్థలాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వేరే చోటికి వలస పోవుట.

కాలక్రమేణా మక్కా ముకర్రమాలో ఇస్లాం మతం విస్తరించసాగింది. ప్రజలు రోజురోజుకీ ఇస్లాం మతాన్ని స్వీకరించసాగారు. కానీ మక్కాలోని ముస్లింల విరోధులకు ఈ మాట అస్సలు నచ్చలేదు. వారు ముస్లింలను చెడు విధంగా సతాయించసాగారు మరియు ఎటువంటి బాధలను చేపట్టారంటే అవి వినగానే కళ్ళనుండి నీళ్లు బయటపడతాయి. అంతటి సంఘటనలు చేశారు మరి. అవి,

హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సహాబి అనగా అనుచరులు హజరత్ అబ్బాస్ రదియల్లాహ్ అన్హు గారిని‌ ఇస్లాం మతం స్వీకరించినచో అవిశ్వాసులు ఒకరోజు పన్నా మంటను వేడి చేశారు. దానిమీద ఈయనను పడుకోబెట్టారు. అంతటితో ఆపలేదు, మళ్లీ ఒక బలమైన మనిషిని ఆయన యొక్క వీపు‌ మీద నిలబెట్టారు. ఎందుకంటే ఆ బాధ వలన కదలకుండా ఉండేందుకు. ఇంతటి సంఘటన జరిగినా సరే ,హజరత్ ఖబ్బాబ్ రదియల్లాహ్ అన్హు గారు  మాత్రం ఇస్లాం మతాన్ని విడిచిపెట్టలేదు.

అంతేకాక హజరత్ బిలాల్ రదియల్లాహ్ అన్హు గారిని తమ యజమాని అయిన ఉమయ్య రోజూ మధ్యాహ్నపు మండే మండే ఎండలో ఇసుకపై బట్టలు లేకుండా పడుకోబెట్టేవాడు.సూర్యుని యొక్క వేడి చేత ఇసుక చాలా వేడిగా అయిపోయేది, ఇంతటితో కూడా ఆపలేదు, పడుకోబెట్టిన తర్వాత తమ ఛాతి గుండె మీద భారీ రాతిబండను పెట్టేవాడు. ఈ విధంగా ఇంత పని చేసినా యజమాని అయిన ఉమ్మయ్య హజరతే బిలాల్ రదియల్లాహ్ అన్హు దగ్గరికి వెళ్లి మళ్లీ అడుగుతాడు. ఇప్పుడైనా నీ యొక్క ఇస్లాం మతాన్ని విడిచి పెడతావా అని, బిలాల్ రదియల్లాహ్ అన్హు గారు ఇలా అన్నారు, నేను చచ్చినా కూడా నా ఇస్లాం మతాన్ని విడువలేను. అని అన్నారు.

         ‌‌ ఇస్లాం మతపు విరోధులు పెద్దపెద్ద వంశాల పెద్దవారిని కూడా విడిచిపెట్టలేదు. ఎలాగంటే హజరత్ అబూబకర్ సిద్ధిఖీ రదియల్లాహ్ అన్హు గారిని‌ బాగా కొట్టారు. సుహేబు ర్రూమి రదియల్లాహ్ అన్హు గారిని‌ ఎంతగా కొట్టారంటే, ఆయనను కొట్టినందువలన ఆయన స్పృహ కోల్పోయేవారు. ఈ విధంగా సతాయించి, హింసలు పెట్టేవారు విశ్వాసులు.

మక్కా హిందువులు అనగా అవిశ్వాసుల యొక్క బాధలు మరియు హింసల నుండి బయటపడడానికి మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుమతి చేత ముస్లింల ఒక సమూహం హబ్షాహ్ అనే రాజ్యం వైపు బయలుదేరింది. అనగా హిజ్రత్ చేయసాగింది.

ప్రపంచపు ఏడు పెద్ద ఖండాలలో ఆఫ్రికా ఒకటి మరియు ఇందులో ఒకచోట ఉంది. ఆ చోటు యొక్క పురాతన నామం ఇబిసినియా ఉండేది. ప్రస్తుతం ఇది ఇథియోపియా లేదా హబ్షాహ్ యొక్క పేరు చే ప్రసిద్ధి.  మక్కా నుండి హబ్షాహ్ చేరుకోవడానికి ఒక సముద్రం దాటవలసి ఉంటుంది.

విశ్వాసులు హబ్షాకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారంటే, ఆ హబ్షా‌హ్ అనే ప్రాంతం శాంతి మరియు  శుభాలకు మారగదర్శ ‌‌స్థా‌నం‌. అంతేకాక అక్కడి రాజు కూడా చాలా మంచివాడు. కాబట్టి విశ్వాసుల యొక్క సమూహం హబ్షాహ్‌ వైపు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుమతిచే బయలుదేరింది.

ఆ యొక్క హిజ్రత్ చేసే సమూహానికి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మనిషిని పెద్దగా నియమించారు. ఆయన హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్. హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహ్ అన్హు గారు హబ్షాహ్ యొక్క రాజు నజాషి ఎదుట ఇస్లాం మతం గురించి అంతా చెప్పారు. ఈ ఇస్లాం మతం రాజుకు చాలా బాగా నచ్చింది. వారు మన ముస్లింల సమూహాన్ని కూడా చాలా బాగా స్వాగతించి, వారికి చాలా సౌకర్యాలు కూడా కలిపెట్టారు.

           ఈ సమూహంలో ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహ్ అన్హుం లను కలిపి మొత్తం 13 మంది పురుషులు మరియు నలుగురు స్త్రీలు ఉన్నారు. కొన్ని మాసాల తరువాత మక్కా యొక్క పూర్తి ప్రజలు ముస్లింలుగా మారారని అబద్దపు కబురు ఈ హబ్షాహ్ లో ఉన్న సమూహానికి తెలిసింది. ఇది విని ఈ ప్రజలు మక్కాకు తిరిగి వచ్చేశారు. కానీ, ముస్లింలు మక్కాకు తిరిగి వచ్చిన తర్వాత, విరోధులు వీరిని ముందు కంటే కూడా ఎక్కువగా హింసించడం మొదలుపెట్టారు. ఇది చూసిన ముస్లింలు మహా ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం నుండి అనుమతి తీసుకుని, వారు మళ్ళీ హబ్షాహ్ వైపు ప్రయాణించసాగారు. ఈ ప్రయాణంలో జాఫర్ బిన్ అబూ తాలిబ్ మరియు వారి పత్ని అయినా అస్మాఅ్ , ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ మరియు వారిపత్ని రుక్కయ్య, జుబేర్ బిన్ ఔమ్, అబూసుఫియాన్ యొక్క కుమార్తె ఉమ్మే హబీబా రజియాల్లాహు అన్హుం మొదలగువారు ఉండేవారు. ఈ పయనంలో పురుషులు 28 మరియు స్త్రీలు 18 మంది ఉండేవారు.

         ఈ విధంగా ఆ విశ్వాసులు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా హింసిస్తుంటే ఆ అల్లాహ్  వారిని కూడా హిజ్రత్ చేయమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేయాల్సి వచ్చింది.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter