ముహర్రం మరియు ఆషూరా దిన విశిష్టత

హిజ్రి సంవత్సరం యొక్క ప్రారంభం మొదలై ఇప్పటికే పద్నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరంలో మేమందరం చేరుకున్నాం. ముహర్రం మాసం ఇస్లాం పంచాంగంలోని తొలి మాసం. ఈ మాసం ఎనలేని విశిష్టతలతో కూడి ఉన్నది. కాని నేటి ముస్లిం సమాజ సోదరులకు ఇస్లాం పంచాంగంలో ఉండే నెలలు పూర్తిగా తెలుసుకోవడంలో ఇంకా సంపూర్ణత పొందాలి. ఇస్లాం తమ మతం అనే చాటుకు చెప్పే ప్రజలు ఇస్లాం మాసాలను వాటి చరిత్రా విశిష్టతలను తెలుసుకోవడం వారి యొక్క జీవిత భాగస్వామ్య కర్తవ్యం. మన‌‌ దృష్టిలో ఏదైనా కొత్త సంవత్సరమో లేదా కొత్త మాసమో ఉందంటే అది ఇస్లాం ప్రకారమే, నవ్య మాసాన్ని ఆహ్వనించే సున్నత్ మార్గాలు‌ కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరించడం మరియు పాటించడం ప్రతి ముస్లింకి తప్పనిసరి. ఉదాహరణకు నెలలోని ఇరవై తొమ్మిది రోజులు గడిచేపోగా, సూర్యాస్తమయం తర్వాత నెలవంకను చూడటానికి కాచుకొని ఉండుట, చూసిన వెంటనే దువా చదవడం వటువంటివి సున్నత్ మార్గాలలో వస్తాయి. వీటిని గనుక ఒకవేళ పాటిస్తే మన జీవితంలో సుఖసంపదల మార్గాలు తెరువబడుతాయి. పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ లో ముహర్రం మాస విశిష్టత గురించి తెలుపుతూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ

 “యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటి నుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాల్లో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా 9: 36)

అంటే – భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ దృష్టిలో సంవత్సరపు మాసాల సంఖ్య పన్నెండు మాత్రమే. అందులో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. దీనిలో ముహర్రం మాసం కూడా ఒకటి. ముహర్రం ప్రత్యేకతకు సంబంధించి చెప్పుకుంటూపోతే ఓ పుస్తకమే రచించవచ్చు. కానీ ఇక్కడ ఆషూరా గురించి రాయాలని నిర్ణయించుకోవడం జరిగింది.

ఆషూరా దిన విశిష్టత:

ఈ ఆషూరా దినాన ఇస్లాం చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి వాటిలో కొన్ని క్రింద పేర్కొనడం జరిగినది:

  1. ఆషూరా దినం నాడు అల్లాహ్, ఆదమ్ (అలైహిస్సలాం) పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు.
  2. నూహ్ (అలైహిస్సలాం) పడవ జూదీ పర్వతంపై ఆగిన దినమే ఆషూరా దినం.
  3. ఈ రోజే ఇబ్రాహీం (అలైహిస్సలాం) జన్మించారు.
  4. ఈ రోజే అల్లాహ్ ఫిరౌన్, అతడి జాతిని సముద్రంలో ముంచి, మూసా (అలైహిస్సలాం) మరియు ఆయన అనుచర సమాజమైన బనీ ఇస్రాయీల్ కు వారి నుండి ముక్తిని ప్రసాదించాడు.
  5. అలాగే యూనుస్ (అలైహిస్సలాం) పట్టణానికి చెందిన ప్రజలపై కూడా అల్లాహ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు.

అబూ ఖతాదా (రదియల్లాహు  అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఆషూరా దినపు ఉపవాసం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా సెలవిచ్చారు:

ఆషూరా దినాన ఉపవాసం :

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆషూరా దినం నాడు ఉపవాసం వుండి, తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించినపుడు – “ఆ రోజును యూదులు, క్రైస్తవులు గౌరవిస్తారు” అని ఆయనకు చెప్పబడింది. దీనిపై ఆయన ఇలా సెలవిచ్చారు. వచ్చే సంవత్సరం ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) మనం 9వ ముహర్రం నాడు కూడా ఉపవాసం ఉందాం. కానీ తర్వాతి సంవత్సరం (ఆషూరా దినం) రావడానికి ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. (సహీ ముస్లిం – కితాబ్ సియామ్ : 1134)

ఈ హదీసు ద్వారా తెలిసే విషయం– ఒకవేళ ఎవరైనా మొహర్రం 9న ఉపవాసం వుండలేకపోతే, ముహర్రం 10న ఉపవాసం పాటించిన తర్వాత యూదులు, క్రైస్తవులను వ్యతిరేకించడానికి ముహర్రం 11న కూడా ఉపవాసం ఉండాలి.

చివరిగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరికీ నిషేధిత మాసాలను గౌరవించి, వాటిలో మరియు ఇతర మాసాల్లో కూడా ఆయన అవిధేయతకు దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!

 

 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter