ఉమ్మడి పౌరస్మృతి రాజకీయపు వ్యూహం

ఒకే దేశం.. ఒకే చట్టం.. ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్‌గా ఉన్నా అమలు అంత ఈజీ కాదా? యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఎందుకు వ్యతిరేకత వస్తోంది. మత సంస్థలు ఎందుకు ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తలెత్తబోయే సమస్యలేంటి? కేంద్రంలోని బీజేపీ సర్కార్ యూనిఫామ్ సివిల్ కోడ్‌ని ఎందుకింత సీరియస్‌గా తీసుకుంది?2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ముఖ్యమైన 4 అంశాలను కచ్చితంగా అమలు చేసే తీరుతాం అని వాగ్దానం చేసింది. అందులోని 3 అంశాలను ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ మరియు రామ మందిర నిర్మాణం లాంటి కీలకఅంశాలను ఎన్నో దశాబ్దాలుగా పరిష్కరించడనవి సత్వరగా పరిష్కరించడ్డాయి.  ఇంక మిగిలినది ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) మాత్రమే, దాన్ని కూడా 2024 ఎన్నికల ముందే ఖచ్చితంగా అమలు పరుస్తామని బీజేపీ సర్కార్ ముందడుగు వేస్తుంది.  

యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? ముందు దీని గురించి తెలిస్తేనే ఇది ఎందుకంత చర్చాంశనీయంగా మారిందో అర్థమవుతుంది. కొన్ని మతాల మరియు వర్గాల వారు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారు బీజేపీ సర్కార్ ఎందుకు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే మతంతో సంబంధం లేని పౌరసత్వ చట్టంగా పేర్కొనే యూనిఫామే సివిల్ కోడ్ అనగా మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత దేశంలో ఉన్న ప్రతి పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం, అంటే నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్థి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​.

 ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్థులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు.ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న అన్న మతాలు తమ పర్సనల్ లా కు లోబడి పని చేస్తున్నాయి. హిందువుల కోసం ది హిందు మ్యారేజ్ యాక్ట్ 1955,  ముస్లిం ల కోసం ముస్లిం పర్సనల్ లా1937, క్రిష్టియన్ల కోసం ది ఇండియన్ క్రిష్టియన్ మ్యారేజ్ యాక్ట్1872 లాంటి వేరు వేరు చట్టాలున్నాయి. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో మతానికి  ఒక్కోలా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే యూనిఫాం సివిల్ కోడ్. ఈ డిమాండ్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది.

ఇప్పటివరకు దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరీఅత్ లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. దాంతో చాలాకాలంగా దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు యూనిఫాం సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై చర్చ మొదలవడంతో ముస్లింల షరీఅత్ చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరీఅత్ చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు.. ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్‌ని నేరంగా చిత్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టంగా మార్చింది. యూనిఫాం సివిల్ కోడ్ వచ్చే దాకా.. దేశంలో లింగ సమానత్వం సాధ్యం కాదనే వాదనలున్నాయి. కానీ.. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు.

భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని.. కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయ్. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 వీలు కల్పిస్తుంది. కానీ.. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో పెను మార్పులు చోటుచేసుకొంటాయి. మరియు విభిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది ఎంతో కష్టమైన విషయం. హిందువులైనా, ముస్లింలైనా వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లోనూ విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ షరీఅత్ చట్టాలను పాటించే వాళ్లున్నారు. బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయి.

ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్టప్రకారం ఆడ, మగ ఇద్దరూ సమానమేననే క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుతమున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. బహుభార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. దేశ సమగ్రత విఛ్చీన్నమవుతుంది. జాతీయత పట్ల భ్రమలు మొదలై భారతీయత భావం తగ్గిపొంతుంది. ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల చాలా ప్రతికూలతలూ ఉన్నాయి.అందులో ఒక ప్రతికూలత   భిన్న మతాలు, ఆచారాలకు నిలవు అయిన ఇండియాలో యూసీసీ వంటి చట్టాల అమలు అసాధ్యమని, ఒక వేళ అమలు చేసినా ప్రజల మత స్వేచ్ఛపై భారీ ప్రభావం పడుతుందన్నది ప్రజల వాదన.ఉమ్మడి పౌరస్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలు భావించే అవకాశం ఉంది. మతం లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యమేంటనే నిరసనలు తలెత్తొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా భావించొచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల.. కొందరు దీనిని వ్యతిరేకించొచ్చు.

ఇప్పటివరకు ఉమ్మడి పౌర స్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు.. పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

యూసీసీ గురించి భారత రాజ్యాంగం ఏం చెబుతోంది?

రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్​ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు.

వాస్తవానికి ఈ యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​పై ప్రభుత్వాలు మాట్లాడటం ఇది కొత్త విషయం ఏం కాదు. బీజేపీ కన్నా ముందే కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు ఈ ఉమ్మడి పౌర స్మృతిపై చర్చలు జరిపాయి. కానీ ఇప్పటివరకు యూసీసీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి.

ఉమ్మడి పౌర స్మృతి- రాజకీయాల కోసమేనా?

దేశంలోని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ యూసీసీని వాడుకోవడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమతమ నియోజకవర్గాల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు, తరచుగా ఈ యూనిఫామ్​ సివిల్​ కోడ్​ అంశాన్ని లేవనెత్తి, ఈ ప్రయోజనాలుంటాయి ఆ ప్రయోజనాలంటూయని వారికి చెబుతున్నారని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి పౌర స్మృతితో మైనారిటీలపై అధిక ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు అంటున్నారు.

ఇప్పుడున్న వ్యక్తిగత చట్టాలు మతాల అనుగుణంగా ఉన్నాయని, వాటినే ప్రజలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. వీటి స్థానంలో యూసీసీని తీసుకొస్తే మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని యూనిఫామ్​ సివిల్​ కోడ్​ను రూపొందించినా క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు.

 

 

 

 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter