ఇస్లాంలో నమాజు యొక్క ప్రాముఖ్యత
నమాజ్ ఇస్లామ్ యొక్క యొదు స్థంబాలలో ఒకటి. నమాజ్ మనుషులను పాపాలను నుంచి దూరం పెడుతుంది. ఎలాగైతే ఖురాన్లో అల్లాహ్ ఆలా ఇలా ప్రస్తావించారు" إن الصلاة تنهى عن الفحشاء والمنكر.
మన ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం యొక్క మనశ్శాంతి కూడా నమాజ్ చదవడం. మేరాజ్ యొక్క కానుక కూడా నమాజ్, ప్రళయం దినం నాడు 10 అల్లాహ్ మొట్టమొదటిగా అడిగేది కూడా నమాజ్ గురించి..
నమాజ్ మేరాజ్ కానుక
మేరాజ్ (గగనయాత్ర) చేసిన రాత్రి ఆయనకి నమాజ్ కానుకగా ఇవ్వబడింది. దీని గురించి హదీసులో కూడా వివరించారు.
హాజల్ అనస్ బిన్ మాలిక్ (రజి) కథనం: దైవ ప్రవక్త (సల్లం) మేరాజ్ (గగన యాత్ర) చేసిన రాత్రి ఆయన పై యాభై నమాజులు విధిగా చేయబడ్డాయి. తర్వాత అవి తగ్గుతూ తగ్గుతూ చివరికి ఐదు నమాజాలు మిగిలాయి. అప్పుడు దేవుడి తరుపు నంచి ఇలా ప్రకటించబడింది: "ఓ ముహమ్మద్ ! నేను ఇచ్చినమాట తప్పేవాణ్ణి కాను. నీ అనుచర సమాజానికి ఈ ఐదు నమాజులకు బదలుగా యాభై నమాజుల పుణ్యం లభిస్తుంది."
నమాజ్ మూలంగా కంటి చలువ ప్రాప్తిస్తుంది. మన ప్రవక్త ఎప్పుడైనా ఖాళీ సమయం దొరుకుతే ముందుగా నమాజ్ చదివేవారు. ఏ యొక్క యిద్ధంలో గెలిచిన, ఏదైనా కష్టాలు ఎదురొచ్చిన, ఆనందంలో ఉన్న బాధలో ఉన్న నమాజుని వదిలేవారు కాదు, చదివే వారు.
దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు. అత్యంత నీచమైన దొంగ ఎవరంటే నమాజులో దొంగతనం చేసేవాడు. అంటే ఒళ్ళ బద్దకంతో నమాజులో రకూ సజ్దాలు సక్రమంగా చేయని వాడు. నమాజ్ ప్రాముఖ్యత చాలా ఉంది. మన దైవ ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇహలోకం వదలి వెళ్తున్నప్పుడు కూడా జీవితపు చివరి శ్వాస వరకు తన అనుచర సమాజానికి నమాజ్ గురించి తాకీదు చేశారు. దాని ప్రాముఖ్యత చాలా ఉంది. మన ప్రవక్త చిన్న పిల్లలకి కూడా అలువాటు చేయాలని భోదించారు. "మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకోగానే వారిని సమాజ్ చేయమని ఆదేశించండి. పదేళ్ళ వయసుకు చేరుకున్న తరువాత (నమాజ్ చదవకపోతే) వారిని దండించండి;" ఇంకా ఆ వయసులో వారిని వేర్వేరు పడకల మీద పడుకోబెట్టండి." అని భోదించారు.
ముస్లిములను కాఫిరులను వేరేగా చేసేది నమాజ్. ముఖ్యంగా ఖురాన్ ను కంఠస్తం చేసిన వారు నమాజ్ చదవకుండా పడుకుంటే రేపు ప్రళయదినాన అతని తలను రాళ్ళతో ఇసిరి ఇసిరి కొడతారు. మనము ఎలాగైనా ఎక్కడైన మన నమాజ్ ని ముందే అదా చేసేయాలి. ఎలాగైతే మన సహాబాలు చేసే వారు.
మన హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రజి) కథనం: నాకు మొలల వ్యాధి ఉండేది. "ఈ స్థితిలో నేను నమాజ్ ఎలా చేయాలి? అని నేను దైవప్రవక్తను అడిగాను. అందుకాయన 'నిలబడి నమాజ్ చేయాగలిగితే చెయ్యి, లేకపోతే కూర్చోని చెయ్యి. కూర్చోని కూడా చెయ్యలేకపోతే పడుకొని చెయ్యి" అని చెప్పారు.
దీనంతటితో మాకి అర్ధమవుతుంది. మేము ఎక్కడున్నా అప్పుడే మన నమాజ్ని అదా చేసేయాని, మనకి, అల్లాహ్ తబారక్ వతఆలా అందరినీ ప్రసాదించు గాక.