జకాత్ ముస్లింల విధి & ఆర్థిక వ్యవస్థ స్థైర్యం (Part - 1)

జకాత్ యొక్క అర్థం శుభ్రం అవడం లేదా పెరగడం. జకాహ్ అర్థము: నిర్నీత సమయంలో, నిర్ణీత ధనమునుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది.

జకాహ్ ఆవశ్యకత: ఇస్లాం మూలస్థంభాలలో జకాహ్ ఒక ముఖ్య మూలస్థంభము. ఖుర్’ఆన్ లో చాలా చోట్ల అల్లాహ్ సలాహ్ తో పాటు జకాహ్ ని కూడ విధిగా పేర్కొన్నాడు.

Al-Baqarah (2):43: وَأَقِيمُواْ الصَّلاَةَ وَآتُواْ الزَّكَاةَ وَارْكَعُواْ مَعَ الرَّاكِعِينَ

“సలాహ్ ను స్థాపించండి మరియు జకాహ్ ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. (అల్లాహు తఆలా ముందు వంగే వారితో మీరూ వంగిపోండి)” (2:43).

జకాత్ ఇవ్వడంతో డబ్బు తరుగుతుందన్న విషయాన్ని అల్లాహ్ తఆలా మనుషుల ఆలోచన నుండి తీసివేశాడు. ఈ జకాత్ పెరుగుదలకు తగిన కారణం మరియు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు: ما نقصت صدقت من مالي దీని అర్థం దానం చేయడంతో ధనంలో ఏమి తక్కువ కాదు. జకాత్ యొక్క ముఖ్యంశాలు మరియు దాని యొక్క లాభాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఈ చర్యతో ఎవరైనా అశ్రధ్ద వహిస్తే వాళ్లకి కూడా శిక్ష పడుతుంది. గుర్తుంచుకోవాల్సిన  ఇంకో విషయం ఏమిటంటే ఎప్పుడూ మనసు కలుగుతుందో అప్పుడు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆరాధన లాంటిది. దీని గురించి అల్లాహ్ 20 చోట్ల బోధించారు, జకాత్ చేయడం విధి (فرض). మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రవచించారు, జకాత్ అనేది ఇస్లాంలో ఒక భాగం. فرض అనగా ఎలాగైతే ఒక జీవి బతకడానికి గాలి, నీరు అవసరమో, దానీ కన్నా ఎక్కువ అవసరం అనేది فرض, మరియు మన మనసులలో ఇస్లాం యొక్క అణువు ఉండాలనుకుంటే దీనిని పాటించాలి. అల్లాహ్ యొక్క కరుణాలు మనమీద  కురువు గాక, మనకు అల్లాహ్ కళ్ళు ముక్కు నీరు ఇటువంటి ముఖ్యమైన అవయవాలతో పాటు మనిషికి జన్మనిచ్చాడు. ఆ అవయవాలను నడిపించడం అల్లాహ్ యొక్క ఇష్టం. ఎటు కావాలంటే అటు నడిపిస్తాడు, మరియు ఎవరైతే అల్లాహ్ ను నిజంగా విశ్వసిస్తారో వాళ్లు జకాత్ అనేది తప్పక తీస్తారు. ఎందుకంటే వాళ్లలో అల్లాహ్ యొక్క భయం ఉంటుంది. అల్లాహ్ యొక్క దారిలో తన ధనం ఖర్చు చేయడంతో, తనకు అల్లాహ్ తరుపు నుంచి చాలా బహుమతులు ఉన్నాయి. అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు చేయడం అంటే, అల్లాహ్ కు అప్పు ఇచ్చినట్టు, అది ప్రళయ దినం నాడు అవసరం అవుతుంది.

అల్లాహ్ దారిలో ఖర్చు చేయడం వల్ల లాభాలు

1: ఎంత అయితే అల్లాహ్ దారిలో ఖర్చు చేస్తారో దానికన్నా ఎన్నో రెట్లు అల్లాహుతాలా ప్రసాదిస్తాడు

2: ఆ దానం బదులు మంచి పుణ్యం దొరుకుతుంది.

3: ఆ దానం కారణంగా అల్లాహ్ వారి పాపలని క్షమిస్తాడు. ఇది అల్లా యొక్క వాగ్దానం.

           అల్లాహ్ దారిలో ఖర్చు చేసే వారి కోసం ఖురాన్ చాలా చోట్ల బహుమతులతో పురస్కరించింది. ఏమనగా ఎవరైతే అల్లాహ్ దారిలో ఖర్చు చేస్తారో వాళ్లకు మంచి వాళ్లలో పేరుపొందుతార. పూర్వం మనుషులుగా మరియు నిజమైన అల్లాహ్ భక్తుడుగా పేరు పొందుతారు అని ఇలా చాలా చోట్ల ఖురాన్లో ఉంది.

అల్లాహ్ దారిలో 1 రూపాయి ఖర్చు చేయడం 7 రుపాయల పుణ్యం దొరుకుతుంది.

ఇంకా ఇటువంటివి అన్ని తెలిసి కూడా ఎవరైతే జకాత్ నిర్లక్ష్యం వహిస్తారో వాళ్లకి రకరకాలుగా శిక్ష అనేది ఉంది. వాళ్లకి శిక్ష ప్రపంచం నుండి మొదలవతుంది. ప్రపంచంలో శిక్ష ఇంకొక ఉంది. అది అల్లాహ్ తఆలా పేదరికం చూపిస్తాడు.

 దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేశారు ప్రతిరోజు ఇద్దరు దైవ దూతలు దిగివస్తారు వారిలో ఒక దూత: '! ఖర్చు పెట్టే వాడికి ప్రతిఫలాన్ని ప్రసాదించు' అని ప్రార్థిస్తే రెండవ దూత: 'అల్లాహ్! కూడబెట్టుకునే వాడి సంపదను నాశనం చేయ్యి' అని అంటారు.

ఇంకొక హదీసులో ఇలా ఉంది, ఏ ఊరిలో అయితే జకాత్ ఇవ్వరో, ఆ ఊరిలో వాళ్లకి కరువు అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే బంగారం, వెండి కోసం డబ్బులు జమా చేసి దేవుడి దారిలో ఖర్చు పెట్టరో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించబడును. ఏ బంగారమును అయితే వాళ్లు జమ చేశారో, ఆ బంగారమును కాల్చి వాళ్ళ చెవిలో నూరిలో వేయడం జరుగుతుంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter