అసలైన పరీక్ష
మార్చి నెల మొదలవుతుంది అంటే చాలు చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు, వారందరిలో ఒకటే ఆందోళన. పరీక్షలు. మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు కొనసాగుతున్న ఈ వివిధ పరీక్షలలో ఎంతో మంది తమ భవిష్యత్తుని ముడి పెట్టవుకున్నారు. చిన్న పిల్లలు, పదో తరగతి చదివుతున్న వారు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్లు, వివిధ కోర్సెస్ చేస్తున్న వాళ్లకి, వీరందరి ఆలోచన పరీక్షలలో ఉత్తీర్ణమవడం ఒకటి ఉంటుంది. ఈ కాలం పరీక్షల కాలం. ముఖ్యంగా తల్లిదండ్రులు వీరు తమ పిల్లల భవిష్యత్తు ఈ పరీక్షలలోనే ముడిపడి ఉంది అని భ్రమపడుతుంటారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణమైతేనే వాళ్ళ భవిష్యత్తు ముందుకు సాగుతుంది అని ఎంతో ఆసక్తిగా ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరీక్షలు భవిష్యత్తుని నిర్ణయించవు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయితే అందరూ సంతోషిస్తారు. కానీ ఒకవేళ విఫలమైతే ఎంతోమంది తను చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ప్రయత్నాలన్నీ పనికి రాలేదు అని ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి ఒక ఆలోచనతో ఈ సమాజంలో బతుకు సాగుతుంది. కానీ నిజం ఏమిటంటే ఈ పరీక్షలలో ఉత్తీర్ణమైతే భవిష్యత్తు ముందుకు సాగుతుంది అనేది ఒకవైపు నిజమే అయ్యి ఉండొచ్చు. కానీ ఈ పరీక్షలలో విఫలమైతే భవిష్యత్తు ముందుకు సాగదు అన్న ఆలోచన సరైనది కాదు. ఇందులో తక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు వచ్చేలాగా వేరే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో ప్రయత్నించి సరి చేసుకోవచ్చు, పరీక్షలలో విఫలమైతే తన నైపుణ్యాన్ని బట్టి వివిధ రంగాల్లో ప్రయత్నించవచ్చు.
కేవలం కొన్ని రోజులు జరిగే చిన్న చిన్న పరీక్షలకే మనుషులు ఇంత ఆందోళన చెందుతుంటే అసలైన పరీక్ష, అల్లాహ్ తరపు నుంచి వచ్చే పరీక్ష, మనిషి మరణం తర్వాత మళ్లీ బ్రతికిన సమయంలో జరిగే పరీక్ష, ఈ పరీక్షను బట్టి ముందుండే జీవితం ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఈ పరీక్షలలో మన అల్లాహ్ పరీక్ష తీసుకుంటాడు, పరీక్ష రాసే వాళ్ళు ఈ సృష్టి, పరీక్షలలో ఉత్తీర్ణమైతే అతనికి స్వర్గంలో ఆనందాలు ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ పరీక్షలలో విఫలమైతే నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. ఇంతటి పెద్ద పరీక్ష ముందుకు వస్తుందని తెలిసి కూడా దానితో అశ్రద్ధగా ప్రవర్తించడం ఎంతవరకు సరైనది. ఆ పరీక్షలో మనకు ఇతరులను చూసి కాఫీ కొట్టే అవకాశం ఉండదు. ఆ పరీక్షలో రెండో అవకాశం ఉండదు. ఆ పరీక్షలో దయ కరుణ జాలి అనేటివి ఉండవు.
قَولِهِ - صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ -: " كُلُّكُم رَاعٍ فَمَسؤُولٌ عَن رَعِيَّتِهِ، فَالأَمِيرُ الَّذِي عَلَى النَّاسِ رَاعٍ وَهُوَ مَسؤُولٌ عَنهُم، وَالرَّجُلُ رَاعٍ عَلَى أَهلِ بَيتِهِ وَهُوَ مَسؤُولٌ عَنهُم، وَالمَرأَةُ رَاعِيَةٌ عَلَى بَيتِ بَعلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسؤُولَةٌ عَنهُم، وَالعَبدُ رَاعٍ عَلَى مَالِ سَيِّدِهِ وَهُوَ مَسؤُولٌ عَنهُ، أَلا فَكُلُّكم رَاعٍ وَكُلُّكم مَسؤُولٌ عَن رَعِيَّتِهِ " مُتَّفَقٌ عَلَيهِ.
وَعَن قَولِهِ - عَلَيهِ الصَّلاةُ وَالسَّلامُ -: " إِنَّ اللهَ سَائِلٌ كُلَّ رَاعٍ عَمَّا استَرعَاهُ، أَحفِظَ ذَلِكَ أَم ضَيَّعَ؟ حَتَّى يُسأَلَ الرَّجُلُ عَن أَهلِ بَيتِهِ"
దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లం గారు ఈ విధంగా తెలియజేశారు: అల్లాహ్ ప్రతి సంరక్షకుడిని,అతని అధికారంలో ఉన్న వాటి గురించి అడుగుతాడు. అతను ప్రజలను రక్షించాడా లేదా నాశనం చేశాడా అని. చివరికి మనిషితో అతని కుటుంబ సభ్యుల గురించి కూడా అడుగుతాడు.
ఈ పరీక్షలో ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరితో సంబంధం ఉంటుంది. తల్లితండ్రులతో వేరే పరీక్ష, దాయదులతో వేరే పరీక్ష, ఇరుగు పొరుగు వారితో వేరొక పరీక్ష, మిత్రులతో వేరు పరీక్ష. కాబట్టి ప్రతి ఒక్క పరీక్షతో శ్రధగా వహించాలి.ఈ పరీక్ష జీవితాంతం ఉంటుంది. దీని ఫలితాలు తుడిదినం, పరలోకంలో అల్లాహ్ అందరి ముందు ప్రకటిస్తాడు.
وَقَالَ - سُبحَانَهُ -: ﴿ فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ * عَمَّا كَانُوا يَعْمَلُونَ
నీ ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మేము వారందరినీ ప్రశ్నిస్తాము వారు చేస్తూ ఉన్న కర్మలను గురించి. (సూరాహ్ హిజ్ర్:92)
وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا ﴾ [الإسراء: 36]
మరియు ఓ మానవుడా నీకు తెలియని విషయాల గురించి వెంటపడకు. ఎందుకంటే చూపులు వినికిడి హృదయము అన్నిటినీ గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
وَقَالَ - صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ -: "لا تَزُولُ قَدَمَا ابنِ آدَمَ يَومَ القِيَامَةِ مِن عِندِ رَبِّهِ حَتَّى يُسأَلَ عَن خَمسٍ: عَن عُمُرِهِ فِيمَ أَفنَاهُ، وَعَن شَبَابِهِ فِيمَ أَبلاهُ، وَعَن مَالِهِ مِن أَينَ اكتَسَبَهُ وَفِيمَ أَنفَقَهُ، وَمَاذَا عَمِلَ فِيمَا عَلِمَ
ఇప్పుడు ఈ పరీక్షలో శ్రద్ధ చూపే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ? ఈ పరీక్షని ధ్యాసతో పూర్తి అవగాహనతో తీసుకోవాలి.