ఉపవాసం: షరతులు, సున్నతులు, ముస్తహబ్బాతులు, కఫ్ఫారా, మక్రూహాత్, ఖజా

ఉపవాసం: షరతులు, సున్నతులు, ముస్తహబ్బాతులు, కఫ్ఫారా, మక్రూహాత్, ఖజా

అల్లాహ్ తఆలా మానవులకు వారి శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి వారిపై ఉపవాసం పాటించాలని నిర్భందం చేశాడు. ఉపవాసంలో ఎన్నో ఆరోగ్య కిటుకులు మరియు రహస్యాలు దాగున్నాయి.

నిర్వచనం

ఉపవాసం పాటించాలని ఆరాధాన సంకల్పంతో, ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరచే విషయాలతో (భుజించటం, తినటం, త్రిగటం మరియు సంభోగం) దూరంగా ఉండటాన్ని ఉపవాసం అందురు.

రోజా షరతులు

స్త్రీల హైద్ (నెలసరి, ఋతు స్రావం) మరియు బాలింతల రక్తస్రావం నుంచి విముక్తి పొందటం,

మనసులో ఉపవాసం యొక్క నియ్యత్ నిచేయటం.

ఉపవాసం సున్నతులు మరియు ముస్తహబ్బాతులు

సేహ్రీ, రాత్రిలో నియ్యత్ చేయటం, సూర్యా స్తమమైన వెంటనే ఇఫ్తారి చేయటం, అబద్దాలు మరియు బూతుల నుంచి దూర పడటం, ఖర్జూరము లేదా (అది లేక పోతె) నీరు తో ఇఫ్తారి చేయటం, ఇఫ్తారి ముందు దుఅ మరియు ఖుర్ఆన్ పఠనం ఎక్కువ చేయటం.

ఉపవాసం యొక్కభగ్నం

     ఉపవాసాన్ని భగ్నం కల్గించే మార్గాలు రెండు:

 • ఖజా నిర్భందమయ్యే మార్గం:

     ఉదా....మరిచి పోయి తిని లేదా రతిసంభోగాని కి పాల్పడి తన ఉపవాసం భగన్మైందన్న భావంతో ఆహారాన్ని తినటం, పుక్కలించే లేదా ఈత కోట్టె సమయంలో అనుకోకుండ గొంతులో నీరు ప్రవేశించటం, చేవి లేదా ముక్కు లో నూనె వేసుకోవటం, కావాలని వాంతిచేసుకోవటం, అనుకోకుండ నోటి నుంచి వచ్చిన వాంతిని మింగేయటం, రాత్రి మిగిలివుందన్న భావనతో  సుబోహ్ సాదిఖ తరువాత సేహ్రీ చేయటం, సూర్యా స్తమమైందన్న భావనతో ముందే ఇఫ్తారి చేయటం, గులక రాయి, కాగితం, మట్టి మరియు అలవాటు లేని ఆహారం తినటం, బలవంతంగా ఎవరైన ఉపవాసిలేదా పనుకున్న వ్యక్తి నోటిలో నీరు పోయటం, కన్నీళ్ళ లేదాచెమట యొక్క ఉప్పుతనం నోట్లో రుచించటం, సుగంద ద్రవ్యాల పరిమళాన్ని అస్వాదించటం, పళ్ళల్లో చిక్కిన పదార్థాన్ని తినటం(ఆ పదార్థం శనగ కన్నా పెద్దదై ఉండాలి) ఒకవేళ శనగ కన్నా చిన్నదై ఉంటే దాన్ని నోటినుంచి తీసి మళ్ళీ తినటం, రంజాన్ ఉపవాసాలు కాకుండా ఇతర ఉపవాసాల (రంజాన్ ఖజా ఉపవాసాలు కూడా) భగ్నం వలన మరియు పేర్కోన్నబడిన అన్నిటి వలన కేవలం దాని ఖజా నిర్భందమవుతుంది.

 • ఖజా మరియు కఫ్ఫారా నిర్భందమయ్యే రూపాలు:

కఫ్ఫారా అనగా ఒక ఉపవాసానికి బదులుగా (మరొక ఉపవాసం ఉండటమే కాకుండా) :

 1. ఏదైనా బానిసని విముక్తి కల్పించటం (లేదా)
 2. క్రమం తప్పకుండా వరసుగా 60 రోజులు ఉపవాసం ఉండటం (లేదా)
 • 60 మంది పేదవారికి 2 పూటల కడుపు నిండా విందు ఏర్పాటుం చేయటం. కుదరక పోతే వారికి పచ్చి ధాన్యం దానం చేయటం. (ఉదా ప్రతి ఒక్కరికి అర్థ సాఅగోధుమ/ ఒక సాఅ బార్లీ లేదా ఖర్జూరం)ఒక సాఅ 2¼కి.గ్రాములకి సమానం

ఉపవాసిఆహారంగా, ఔషదంగా, రుచికరంగా ఏదైనా తను తినే పదార్థాల్ని (మట్టి తినే అలవాటు ఉన్నవాడు మట్టి తినటం) కావాలనే తినటం, కావాలనే సంభోగానికి పాల్పడటం ( ఆడ మగ ఇద్దరిపై ఖజా, కఫ్ఫారా నిర్భందమవుతుంది), సుర్మా, నూనె, మిస్వాక్ మొదలగు వస్తువులను వాడటం వలన ఉపవాసం భగ్నం అయ్యిందన్న భావంతో కావాలనే తినటం, త్రాగటం, సంభోగం చేయటం ద్వారా ఖజా మరియు కఫ్ఫారా నిర్భందమవుతుంది.

కఫ్ఫారా వాజిబ్ అయ్యే షరతులు

 • ఉపవాసి బుద్దివంతుడు, యుక్తవయుసుడు మరియు నివాసి (ప్రయాణంలో లేని వాడు) అయి వుండాలి
 • రంజాన్ యొక్క ఉపవాసం అయి ఉండాలి
 • ఉపవాసం నియ్యత్ రాత్రే చేసి ఉండాలి. నియ్యత్ లో “నేను రంజాన్ యొక్క ఉపవాసం ఉంటున్నా”నని నియ్యత్ చేయాలి
 • వ్యాధి, నెలసరి ఋతుస్రావం మరియు బాలింతల రక్తస్రావం, ఇతరుల బలవంతం మొదలగు కారాణాలు కాకుండా ఉపవాసాన్ని వదిలి వేయటం
 • అతను స్వయంగా కావాలని తన ఇష్టాను సారం ఉపవాసాన్ని భగ్నం చేసె పని చేయటం మరియు ఎవరూ అతని ఉపవాసాన్ని, భగ్నం చేయాటానికి బలవంతం పెట్టకుండా ఉండటం.
 • ఉపవాసాన్ని ఆహారం/రతిసంభోగం/ఔషదం లాంటి విషయాలతో భగ్నించటం.

మక్రూహాత్

 • అనవసరంగా ఏదైనా పదార్థాన్ని నమలటం, రుచి చూడటం(ఒకవేళ అవసరముంటే ఫర్వాలేదు. ఉదా, కొంతమందికి అన్నం వండుతున్నప్పుడు రుచిచూడటం)
 • నోట్లో లేదా ముక్కులో నీళ్ళు వేయటంలో ధారాళంగా వేయటం
 • అతిశయోక్తిగా ఇస్తింజా చేయటం
 • లాలజలాన్ని జమా చేసి మింగటం
 • సెహ్రీ తర్వాత నోట్లో ఉషోదయం అయ్యే వరకు నీళ్ళు ఉంచటం
 • బొగ్గు లేదా పేస్టు తో దంతాలు తోమటం
 • ఇఫ్తారీ చాలా ఆలస్యంగా చేయటం
 • గుసుల్ తప్పనిసరైన సమయంలో కావాలనే ఉదయం వరకు వేచి ఉండటం
 • గీబత్ ( అతను లేని పక్షంలో అతని చర్చ) చేయటం
 • అసత్యంమాడటం
 • బూతు మాటలు మాట్లాడటం(చివరగా పేర్కొన్నవన్ని ఎల్లప్పుడూ హానికరమే. కాని రమజాన్ ఉపవాసంలో మరింత హానికరం)

ముబాహాత్

 • సుర్మ పూయటం
 • శరీరం లేదా తల పై నూనె రాయటం
 • చల్లదనం కోసం స్నానం చేయటం
 • మిస్వాక్ (జవాల్ తరువాత) చేయటం
 • సువాసన చూడటం లేదా పూయటం
 • చేవి లో నీరు పోయటం
 • కన్ను లో మందు రాయటం
 • తన ఎంగిలి మింగటం
 • పుక్కలించిన తరువాత నోటి లో ని తేమ ని మింగటం
 • దంతాల మధ్య ఇరుక్కుపోయిన (శనగ కన్న చిన్నదైన) పదార్థాన్ని మింగటం
 • మరిచి పోయి తినటం మరియు త్రాగటం
 • అనుకోకుండా(తన ప్రమేయం లేకుండా) వాంతులవ్వటం
 • అనుకోకుండా ఈగ లేదా దూలి, దుమ్ము కంఠం లో పోవటం
 • సూది (ఇంజక్షన్) వేయుంచు కోవటం

ఉపవాసం ఉండక పోవాడానికి కారాణాలు

 • షర్ఈ ప్రయాణం (కష్టమున్న లేకపోయిన. కష్టం లేకపోతె ఉపవాసం ఉండటం మంచిది)
 • రోగి (ఉపవాసంతో తన రోగం పేరుగుతుందని భయముంటే)
 • గర్భవతి (ఉపవాసంతో తనకు లేదా తన బిడ్డకు ఆపద ఉన్నచో)
 • పాలు త్రాగించటం(తన బిడ్డ నీరసమయ్యే పక్షంలో. అమ్మైన, ఆయైన)
 • ముసలి తనం (ఉపవాసం పై శక్తి లేని విధంగా వయసు పై బడినవారు)
 • బలవంతం (ప్రాణ భయం లేదా హాని పై ఎవరైన బలవంతంగ ఉపవాసం వదలమంటే వదలచ్చు)

 

ఉపవాసాన్ని స్వననాశనం చేసే విషయాలు

 • ఉపవాసిహఠాత్తుగా రోగి అయితే ఉదా, తీవ్ర కడుపు నోప్పి, తనని పాము లేదా తేలు కుట్టినచో, గర్భవతిగ తన బిడ్డ పై ఆపద భయం ఉన్నచో లేదా దాహంతో (మరణభయం) ఉన్నచో, ఉపవాసం వదలటం పై (ప్రాణం తమడాంతో) బలవంతం చేసినచో ఉపవాసాన్ని వదలవచ్చు.

గమనిక

         పై చెప్పిన విషయాల రూపంలో (వృధ్యాపం లో తప్ప) ఆ కారణాలు తోలిగిపోతే, ఆ ఉపవాసాన్ని ఖజా చేయాలి. ముసలితనం కారణం వల్ల వదిలిన ఉపవాసాలకి ఖజా లేదు కాని ఫిద్యా ఇవ్వాలి. ఫిద్యాఅనగా ప్రతి ఉపవాసం బదలు ఒక పేదవానికి రెండు పూటల భోజనం పెట్టటం లేదా సద్ఖే ఫితర్ పరిణామం అదా చేయటం.

ఖజా చేసే విషయాలు

           ఫర్జ్ లేదా వాజిబ్ ఉపవాసాలు కేటాయించిన సమయాల్లో పాటించకపోతే (కారణం ఉన్నా/లేక పోయిన) లేదా ఉపవాసం పెట్టి వదిలిన పక్షంలో ఖజా చేయటం నిర్భందం. ఖజా కోరకు ఒక సమయం అంటూ లేదు, కాని వీలైనంత త్వరగా ఖజా చేయాలి.

 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter