తాసువా ఉపవాసం ప్రవక్త సల్లల్లాహు సల్లం యొక్క ఆశ
ఇస్లామిక్ క్యాలెండర్ లో ఈరోజు ముహర్రం మాసం యొక్క 9వ రోజు. ఈ దినాన్ని తాసూఆ అని అంటారు. ఈ శుభదినాన ప్రత్యేకత గురించి హదీసుల్లో ఎంతో ప్రాముఖ్యతో వ్రాయబడింది. అది ఏంటంటే ఈ పర్వదినాన ఉపవాసం పెట్టడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు:
عن أبي هريرة:] أفضَلُ الصِّيامِ بعدَ شَهرِ رمَضانَ شهرُ اللهِ المُحرَّمُ، وإنَّ أفضَلَ الصَّلاةِ بعد المفروضةِ صلاةٌ مِن اللَّيْلِ.
( سنن أبي داود: 2429 )
రంజాన్ మాసం ఉపవాసాల తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత ఈ ముహర్రం మాసం ఉపవాసాలకు ఉంది. అంటే రంజాన్ మాస ఉపవాసాలు ఎంతో ప్రాధాన్యత కూడినవి దాని తర్వాత ముహర్రం మాస ఉపవాసాలకు ఇవ్వబడింది. ప్రత్యేకంగా 9, 10వ రోజు ఉపవాసం ఉండటం గురించి ఎక్కువగా పరిగణించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మొహర్రం మాసం ఉపవాసాలు పెట్టేవారు. మరియు ఆ పర్వదినం గురించి ప్రత్యేకంగా పొగిడేవారు.
وصِيامُ يومِ عاشُوراءَ، إِنِّي أحْتَسِبُ على اللهِ أنْ يُكَفِّرَ السنَةَ التِي قَبْلَهُ (صحيح مسلم : 1162)
మొహర్రం పర్వదినాన అంటే ఆశూరా రోజు ఉపవాసం ఉండటం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన జీవితంలో గడిచిన సంవత్సరాలలో ఒక్క పూర్తి సంవత్సరం యొక్క పాపాలు పూర్తిగా మన్నించ బడతాయి. ఆ అల్లా ఆగ్రహించు గాక. అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు తన అంతిమ రోజులలో ఎంతో ఆశతో ఈ విధంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు:
لئن بقيتُ إلى قابلٍ لأصومَنَّ اليومَ التّاسعَ ( صحيح ابن ماجه: 1421)
ఒకవేళ నేను మరుసటి ఏడాది వరకు బ్రతికి ఉంటే కచ్చితంగా తాసూఆ (ముహర్రం 9వ దినం ) ఉపవాసం పెట్టి ఉండేవాడిని.
మేము ఆ ప్రియ ప్రవక్త యొక్క ప్రియ అనుచరులము ఆయన ప్రియ ఉమ్మత్లము కావున ఆయన ఆ కోరికను అనుసరించి ఆ ఉపవాసాన్ని పాటించాలి. అంతే కాకుండా ఆయన ఆశూరా ఉపవాసం మీరు కూడా కచ్చితంగా ఆ సున్నత్ ను అమలు చేయాలి. ఈ పర్వదినము యొక్క ప్రాముఖ్యతను మనమందరం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నాను.
ఆ అల్లా ఆగ్రహించు గాక.
ఈ ముహర్రం మాసం యొక్క ఆశూరా రోజు ఉపవాసం గురించి మన మత గురువులు ప్రత్యేకంగా ఒక మస్అలాను వెల్లడించారు. అది ఇది మనము కేవలం ఆశూరా రోజు ఉపవాసం పెట్టడం మక్రూహ్ గా పరిగణించబడుతుంది. అందువలన ఆ ఉపవాసంతో పాటు 9వ రోజు లేక 11వ రోజు ఉపవాసం పెట్టాలి.
والمكروه... تنزيها كعاشوراء وحده أي مفردا عن التاسع أو عن الحادي عشر (رد المحتار: 3\336)