ఈమాన్ మరియ ఇస్లాం

ఈమాన్ మరియ ఇస్లాం

కొని విషయాలు విశ్వసించడం అల్లాహ్ ఆజ్ఞ పాటించడం ప్రతి ముస్లిం కి తప్పనిసరి విధి. ఈ విశ్వాసం ఆజ్ఞాపాలన ఈమాన్ అని ఇస్లాం అని అంటారు.

ఇస్లాం కి సంబంధించిన ఐదు ముఖ్యాంశాలు:

1)అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు ఆరాధనలకు అర్హులు కారని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)అల్లాహ్ దాసుడు, మరియు ప్రవక్త అని విశ్వసించడం.

2)రేయింబవళ్ళలో ఐదు పూటల నమాజ్ చేయడం.

3)రంజాన్ నెలలో ఉపవాసం పాటించడం.

4)జకాత్ని చెల్లించడం.

5)శక్తి స్తోమతలు ఉన్నవారు హజ్జ్ కై కాబా మక్కా దర్శన చేయడం.

 ఈమాన్ (విశ్వాసం)

آمنت بالله وملائكته وكتبه ورسوله واليوم الآخر والقدر خيره وشره من الله تعالى والبعث بعد الموت

నేను విశ్వసించాను అల్లాహ్ ను, ఆయన దూతల్ని, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తను, తీరు తీర్పుదినాన్ని, మంచిదన్న చెడు అయినా జరిగేది అల్లాహ్ తరపున అని, మరణించిన పిదప (మరోజీవితం) తిరిగి లేపబడే విషయాన్ని.

ఇమాన్ 5 కలిమాలతో పూర్తవుతుంది

మొదటి కలిమా: స్వచ్ఛతా వాక్కు లేదా కలిమ-ఎ-తయ్యబా అంటారు.

అరబ్బీ లిపిలో :

  لَآ اِلٰهَ اِلَّااللهُ مُحَمَّدٌ رَّسُولُ اللہِ‎

తెలుగు లిప్యాంతరీకరణ

  లాఇలాహ ఇల్లల్లాహు, ముహమ్మదు ర్రసూలుల్లాహ్

తెలుగార్థం

   అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు , ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త

రెండవ కలిమా

దీనిని సాక్షివాక్కు లేదాకలిమా-ఎ-షహాదత్ అంటారు.

అరబ్బీ లిపిలో :

اشْهَدُ انْ لّآ اِلهَ اِلَّا اللّهُ وَحْدَه لَا شَرِيْكَ لَه، وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدً اعَبْدُه وَرَسُولُه

తెలుగు లిప్యాంతరీకరణ :

అష్ హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వహదహు లా షరీక లహు, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ

తెలుగుగార్థం :

నేను సాక్షీకరిస్తున్నారు, ఎవ్వరూ అర్హులు కారు ఆరాధనకు అల్లాహ్ తప్పితే, అతడు ఏకేశ్వరుడు, భాగస్వామిలేనివాడు, , నేను సాక్షీకరిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క సేవకుడూ , ప్రవక్తయని.

మూడవ కలిమ

దీనిని కీర్తి వాక్కు లేదా కలిమ-ఎ-తమ్ జీద్

అరబ్బీ లిపిలో :

سُبْحَان اللهِ وَ الْحَمْدُ لِلّهِ وَ لآ اِلهَ اِلّا اللّهُ، وَ اللّهُ اَكْبَرُ وَلا حَوْلَ وَلاَ قُوَّة ِ الَّا بِاللّهِ الْعَلِىّ الْعَظِيْم

తెలుగు లిప్యాంతరీకరణ :

సుబహానల్లాహి, వల్ హందు లిల్లాహి, వ ల ఇలాహ ఇల్లల్లాహు, వ అల్లాహు అక్బర్, వలా హౌలా వలా ఖువ్వతా ఇల్లా బిల్లాహిల్-అలియ్యిల్ అజీమ్

తెలుగార్థం :

కీర్తనలూ అల్లాహ్ కే శ్లాఘనలూ అల్లాహ్ కే, అల్లాహ్ తప్పితే ఎవ్వరూ ఆరాధించుటకు అర్హులుకారు, పూజకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, అల్లాహ్ పరమ శక్తిమంతుడు. ఏబలమూ, ఏశక్తీ అల్లాహ్ ను మించింది లేదు, అతడే బలశాలి అతడే ఘనశాలి.

నాలుగవ కలిమా

దీనిని ఏకేశ్వరవాక్కు తౌహీద్ లేదా కలిమ-ఎ-తౌహీద్ అంటారు.

అరబ్బీ లిపిలో :

لا الهَ اِلَّا اللّهُ وَحْدَهُ لا شَرِيْكَ لَهْ، لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ يُحْى وَ يُمِيْتُ وَ هُوَحَىُّ لَّا يَمُوْتُ اَبَدًا اَبَدًا ذُو الْجَلَالِ وَ الْاِكْرَامِ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلى كُلِّ شَئ ٍ قَدِيْرٌ

తెలుగు లిప్యాంతరీకరణ :

లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్ యి, వ యుమీతు వహువ హయ్యుల్లా యమూతు అబదన్ ,అబద జుల్ జలాలి వల్ ఇక్రామ్, బియదిల్-ఖైర్, వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.

తెలుగార్థం :

అల్లాహ్ తప్పితే వేరొకరు ఆరాధించుటకు అర్హులుగారు. అతనొక్కడే. అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు. సామ్రాజ్యం అతడికే, స్తోత్తములు అతనికే. అతడే జీవనాన్ని మృత్యువునూ నొసంగువాడు. అతడు సజీవి. అతడు చిరంజీవి. అతడే గౌరవాలూ ఔన్నత్యాలూ గల్గినవాడు. మంచి అతడిచేతుల్లోనేవుంది. అతడే మంచి. అతడే సకల శక్తిమంతుడు.

ఐదవ కలిమా

దీనిని అవిశ్వాస నిరాకరణా వాక్కు లేదా కలిమ-ఎ-రద్ద్-ఎ-కుఫ్ర్ అంటారు.

అరబ్బీ లిపిలో :

اَللّهُمََّ اِنّىْ اَعُوْدُ بِكَ مِنْ انْ اُشْرِكَ بِكَ شَيئًا وََّ اَنَا اَعْلَمُ بِه وَ اسْتَغْفِرُكَ لِمَا لا اَعْلَمُ بِه تُبْتُ عَنْهُ وَ تَبَرَّاْتُ مِنَ الْكُفْرِ وَ الشّرْكِ وَ الْكِذْبِ وَ الْغِيْبَةِ وَ الْبِدْعَةِ وَ النَّمِيْمَةِ وَ الْفَوَاحِشِ وَ الْبُهْتَانِ وَ الْمَعَاصِىْ كُلِّهَا وَ اَسْلَمْتُ وَ اَقُوْلُ لآ اِلهَ اِلَّا اللّهُ مُحَمَّدُ رَّسُوْلُ اللّهِ

తెలుగు లిప్యాంతరీకరణ :

అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మిన్ అన్ ఉష్ రిక, బికా షయ్ అన్,వ్వ అనా ఆలము బిహీ వస్తఘఫిరుక లిమా లా ఆలము బిహీ తుబ్ తు అన్ హు వ తబర్రాతు మినల్-కుఫ్రి వష్ షిర్కి వల్ కిజ్ బి, వల్-ఘీబతి వల్-బిద్అతి వన్ నమీమాతి వల్ ఫవాహిషి వల్ బుహ్ తాన వల్ మఆసి కుల్లిహా వ అస్ లమ్ తు వ అఖూలు లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్-రసూలుల్-లాహ్.

తెలుగార్థం :

" ఓ అల్లా! నీ శరణుజొచ్చుచున్నాను, నేను స్పృహతో ఉన్నంతవరకూ నీతో ఎవరినీ భాగస్వామిని చేయకూడదని. నాకు తెలియనివాటికి నేను క్షమకోరుచున్నాను. నా అజ్ఞానానికి పశ్చాత్తాపపడుతున్నాను, అవిశ్వాస దాస్యసృంఖనాలనుండి విముక్తి పొందగోరుతున్నాను, నీ భాగస్వామిని ఎవర్నీచేయక, , అన్ని పాపములనుండి. నేను నీ ఇక్షకర్పిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను ,: నీవు తప్ప పూజార్హుడు ఎవ్వరూ లేరని, ముహమ్మదు (శాంతికలుగునుగాక) నీ ప్రవక్తయని.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter