జకాత్ ఎవరిపై ఖర్చు చేయాలి

ఆల్లాహ్ ఖుర్ఆన్ లో చెప్పాడు

انما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفه قلوبهم وفي الرقاب وفي سبيل الله وابن سبيل فريضه من الله والله عليم حكيم

నిశ్చయంగా, దానాలు ('సదఖాత్‌) 41 కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, 42 ('జకాత్‌) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాల నైతే (ఇస్లాంవైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్‌ మార్గంలో (పోయే వారికొరకు) మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్‌ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

فقير : ఆ వ్యక్తి ఎవరి దగ్గరైతే సంపద ఉంటుంది కానీ (نصاب) వరకు ఎదిగి ఉండడు

مسكين: ఆ వ్యక్తి ప్రాథమిక అవసరాల వరకు లభ్యత ఉండదు

عامل: ఎవరికి ఎవరికైతే మహారాజు జగత్ వసూల్ చేయడానికి  నియమించారు

في سبيل: ఎవరైతే ముజాహిద్దీన్ లేదా హజ్ కు వెళ్లి దారి మధ్యలోనే సంపద  అయిపోయి ఉంటారు

ابن سبيل: అనగా ప్రయాణికులు

జకాత్ యొక్క సంపద సంక్షేమ పనుల్లో మస్జిద్ కట్టడంలో లేకపోతే ఇతర పనుల్లో వాడకూడదు ఒకవేళ ఫకీరుని యాజమాన్యం అప్పగించి ఆ తర్వాత  సంక్షేమ పనుల్లో ఉపయోగించవచ్చు

ఎవరికి జకాత్ చెల్లించకూడదు

శ్లోకంలో పేర్కొన్న వారికంటే వేరే వాళ్లకు జకాతీస్తే జకాత్ చెల్లుబాటు కాదు ముందు పెరుకోబడిన వాళ్లతో పాటు కింద వచ్చే వారిని కూడా జకాత్ ఇవ్వడం సరికాదు

1) సొంత మూలం అంటే అమ్మ నాన్న తాత నానమ్మ తాతయ్య అమ్మమ్మ

2) సొంత సంతాని అంటే కొడుకు కూతురు మనవడు మనవరాలు

3) భార్యాభర్తలు మధ్యలో అంటే భార్య భర్తకు భర్త భార్యకు ఇవ్వలేరు

4) అవిశ్వాసికి

5) కోటీశ్వరుడిని అలానే కోటీశ్వరుడు చిన్న పిల్లలకు ఇవ్వలేము

6) బనూ హాషిమ్ అంటే హజ్రత్ అలి, హజ్రత్ ఉఖైల్ మరియు హజ్రత్ జాఫర్, హజ్రత్ అబ్బాస్ మరియు హజ్రత్ హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అంహుమ్ యొక్క పిల్లలను.

సంకల్పం అన్ని ఆరాధనలకు మూసం. ఆ ఆరాధనలు సరి కావాలంటే సంకల్పం ఖచ్చితం.

జకాత్ అదా కావాలంటే కూడా సంకల్పం ఖచ్చితం. సంకల్పం లేకుండా జకాత్ ఇస్తే ఇచ్చిన తర్వాత సంకల్పం చేస్తే సంకల్పం చేసేటప్పుడు చూస్తాము. ఒకవేళ ఎవరికైతే ఇచ్చాడొ అతని చేతిలో ఆ సంపద ఉంటే సంకల్పం అవుతుంది ఒక వేల లేని పరిస్థితుల్లో అదా కాదు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter