ఇస్లాంలో వడ్డీ యొక్క ఆచరణ

వడ్డీ

వడ్డీ అనగా అప్పు ఇచ్చి దానికన్నా ఎక్కువ మొత్తాన్ని పొందాటాన్ని వడ్డీ అంటారు. ఉదాహరణకి: ఒకరికి 1000 రూపాయలు అప్పుగా ఇచ్చి ఒక నెల తరువాత తిరిగి తీసుకునేటప్పుడు 1000 రూపాయలతో పాటు 500 రూపాయలు వడ్డీగా తీసుకోవడం. ఇలా చేయడం అల్లాహ్ కు ఇష్టం లేదు మరియు అల్లాహ్ దీనిని రద్దు చేశారు. ఏ వస్తువునైనా తీసుకొని తిరిగి ఇచ్చేటప్పుడు అది సరి సమానంగా తిరిగి ఇవ్వాలి లేక పోతే దానిని వడ్డీగా లెక్కపెడుతారు. వడ్డీ తినడం నిషేదం. వ్యాపారం చేయడం కూడా వడ్డీ లాంటిది. కానీ అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మం కోసం హలాల్ చేశారు. 

వడ్డీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:

ఎవరైతే వడ్డీ తీసుకుంటారో వాళ్ళకి అల్లాహ్ ప్రేమించడు. తమ నీడను  ప్రళయ దినం నాడు వాళ్ళకి ఇవ్వడు. అల్లాహ్ నమాజ్ చేదివేవారు మరియు జకాత్ ఇచ్చేవారికి తగిన ప్రతిఫలాలు ఇస్తాడు. మరియు వారికి ప్రతి దుఖం మరియు భయం నుంచి రక్షిస్తాడు. అదే విధంగా ఎవరైతే వడ్డీ తీసుకొని తింటారో వాళ్ళకి అల్లాహ్ వారి ఇంట్లో ఎన్నో కష్టాలను ఇస్తాడు మరియు కుటుంబాన్ని వారి నుంచి దూరం చేస్తాడు. అదే విధంగా ఎవరైతే వడ్డీ తీసుకుంటారో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఏమనగా మనం వడ్డీ ఇవ్వడంలో  మన డబ్బులు పేరుగుతాయని మరియు ధనవంతులు కావచ్చు అని ఆలోచిస్తారు. అనేక వివిధ రకాల ఆలోచనలు వస్తాయి. ఇది ఇస్లాంలో రద్దుచేయబడింది.

వడ్డీ తీసుకొనే వాళ్ళ స్థితి :

వడ్డీ తినేవారు తీర్పుదినం నాడు అటు ఇటు కష్టపడుతూ నిలబడతారు. తీర్పుదినం నాడు వాళ్ళకు నరకం తప్పదు. వాళ్ళకి తీర్పుదినం నాడు చాలా కష్టాలు దక్కుతాయి.  అబుహురైరాహ కథనం ప్రకారం మన ప్రవక్త ఇలా చెప్పారు: నేను మేరాజ్ రాత్రిలో కొందరిని చూశాను వారి కడుపులు పెద్ద పెద్ద ఇళ్ళాల్లా ఉన్నాయి. వాటిలో పాములు నిండి ఉన్నాయి. అవి బయట నుండి కనబడుతున్నాయి. వీళ్ళు ఎవరని నేను జిబరీల్ ను అడిగాను. దానికి జిబరీల్ వీరు వడ్డీ తినేవారని అన్నాడు. 

6 వస్తువుల మీద వడ్డీ తీసుకోరాడు:

ప్రవక్త సల్లాహు అలైహి వ సల్లం 6 వస్తువుల్లో స్పష్టంగా వడ్డీ తీసుకోరాదని ఆదేశించారు:

  1. బంగారం 2. వెండి 3. గోధుములు 4. జొన్నలు 5. ఖర్జూరాలు 6. ఉప్పు.

ఈ ఆరు వస్తువుల మీద వాడి తీసుకోరాదు కానీ ఎవరైనా వడ్డీ తీసుకోవలంటే ఉదాహరణకు: గోధములు:- గోధములకు బదులుగా గోధములు కొన్న అమ్మిన సరి సమానం ఉండాలి అంటే ఒక కిలో గోధములకు బదులు ఒక కిలో గోధములు అమ్మవచ్చు, కొనవచ్చు. ఈ విధంగా చేయకుండా ఒక కిలో గోధములకు బదులుగా రెండు కిలోల గోధములు తీసుకోవడం ఇలా చేస్తే ఇది వడ్డీ కింద అవుతుంది. ఇదే విధంగా బంగారం, వెండి, జొన్నలు, ఖర్జూరు, ఉప్పు దీంట్లో కూడా ఇలా చేయడం నిషేదం. 

ఏ వస్తువుల వ్యాపారం షరీఅత్ ప్రకారం అమ్మరాదు మరియు కొనరాదు:

ఒక బానిసకు బదులు ఇద్దరు బానిసల అమ్మకాలు చేయకూడదు. అదే విధంగా ఒక జంతువు బదులు రెండు జంతువులు అమ్మడం కొనడం చేయకూడదు. జంతువు గర్భంలోని బిడ్డను ఆ జంతువు జన్మించకుండానే దాన్ని అమ్మరాదు. జన్మించిన తరువాత అమ్మవచ్చు. అదే విధంగా చెట్టు పై ఉన్న పచ్చి కాయలను పండక ముందే అమ్మరాదు. పండిన తరువాత అమ్మవచ్చు. 

వడ్డీ దేనిని అంటారు అనగా 1 రూపాయికి బదులు 2 రూపాయలు తీసుకోవడం. వడ్డీ తీసుకోవడం వల్ల చాలా నాశతలు కలుగు తాయి మన స్థితి చాలా అగౌరమంగా  మారుతుంది. మన ప్రవక్త చూసిన వాళ్ళలాగే  మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వడ్డీ తీసుకుంటే మరియు 6 వస్తువుల పై వడ్డీ తీసుకోకూడదు బంగారం, వెండి, జొన్నలు, ఖర్జూరు, ఉప్పు గోధుములు మరియు ఒక వస్తువుకి రెండు వస్తువులను వ్యాపారం చేయకూడదు ఇది కూడా వడ్డీ లాగే వస్తుంది ఇలా చేయకూడదు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter