పరిశుభ్రతా తయమ్ముం
పరిశుభ్రతా తయమ్ముం
ముందుమాట:-
తయమ్ముమ్ అంటే సంకల్పం, ఉద్దేశం. ఎవరికైనా ఒకవేళ నీటి వినియోగం కుదరక పోతే లేక నీరు దొరక్కపోతే పరిశుబ్రమైన మట్టితో తయమ్ముమ్ చేయవచ్చును. మట్టితో పరిశుబ్రం చేసుకోవడానికి తయమ్ముమ్ అంటారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ తయమ్ముమ్ గురించి భోదించారు. ఎప్పుడైతే వజూ భంగమవుతుందో ఆ పరిస్ధితిలో తయమ్ముమ్ చేయాలి ఇవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త భోదించారు.
తయమ్ముమ్ చేసే పద్దతి:-
ముందుగా బిస్మిల్లాహ్ చదివి మనసులో నమాజు చేదివే సంకల్పం చేసుకొని, రెండు చేతులను పరిశుభ్రమైన మట్టిపై కొట్టి దులిపి ఆ రెండు చేతులతో ముఖాన్ని సారించాలి. ఆ తరువాత ఎడమచేతితో కుడి చేతిని మరియు కుడి చేతితో ఎడమచేతిని ముందు వెనుక తుడవాలి.
తయమ్ముమ్ గురించి ఖుర్ఆన్ హదీసుల్లో అల్లాహ్ ఇలా భోదించారు:-
అల్లాహ్ ఆదేశం ఏమనగా ఒక వేల మీరు రోగి అయ్యి ఉంటే, లేదా ప్రయాణం లో ఉంటే లేదా మాలమూత్ర విసర్జన చేసిఉంటే లేదా స్త్రీలతో సంభోగం చేసి ఉంటే మీకు నీళ్ళు దొరక్కపోతే పరిశుభ్రమైన మట్టినే చేతులతో అనట్టుకొని ఆ చేతులతో మీ ముఖమును మరియు మీ చేతులను తడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు.
عن عمران بن حصين -رضي الله عنهما- أن رسول الله -صلى الله عليه وسلم- رأى رجلًا مُعتزلًا، لم يُصَلِّ في القوم، فقال: (يا فلان، ما منعك
(أن تصلي في القوم؟) فقال: يا رسول الله أصابتني جنابةٌ، ولا مَاءَ، فقال: (عليك بالصَّعِيدِ، فإنه يَكْفِيَكَ).
ఇమ్రాన్ బిన్ హుస్సేన్ కథనం ప్రకారం: దేవ ప్రవక్త నమాజు చేయని వ్యక్తిని చూశారు, కాబట్టి ప్రవక్త ఇలా అన్నారూ : (ఓ మనువ! నీవెందుకు అందరితో కలిసి నమాజు చేయలేదు అని అడిగారు) అతను ఇలా అన్నాడు: ఓ దేవుని దూత, నేను అపవిత్రుడిని అయ్యాను, పైగా నీరు లేదు. అప్పుడు వాడిని ప్రవక్త పరిశుబ్రమైన మట్టితో తయమ్ముమ్ చేయమని ఆదేశిస్తారు.
ఏ పరిస్ధితులలో తయమ్ముమ్ చేయవచ్చు:-
ఎవరైతే{జనాబత్} పరిస్ధితిలో ఉంటి నీళ్ళు దొరక్కపోతే ఆ పరిస్ధితిలో తయమ్ముమ్ చేయవచ్చు. అదే విధంగా ప్రయాణంలో ఉండి నీళ్ళు లేక పోతే తయమ్ముమ్ చేయవచ్చు. అదే రకంగా రోగి ఉండే పరిస్ధితిలో నీళ్ళు ఉపయోగం హానికరమైతే తయమ్ముమ్ చేయవచ్చు. అదే ప్రకారంగా మూత్ర విసర్జన చేసుకున్న పరిస్ధితిలో నీళ్ళు దొరక్కపోతే తయమ్ముమ్ చేయవచ్చు.
తయమ్ముమ్ ఎప్పుడు భంగమవుతుంది:-
ఎవరైనా నీళ్ళు లేని పరిస్ధితిలో తయమ్ముమ్ చేసి నమాజ్ చదివి దాని తరువాత నీళ్ళు ఎవరైనా తెచ్చి ఇచ్చిన లేక నీళ్ళు దొరికిన అప్పుడు తయమ్ముమ్ భంగమవుతుంది. నమాజ్ మళ్ళీ చదవాలి. తయమ్ముమ్ చేసిన తరువాత ఆ విధంగానైనా నీళ్ళు దొరికితే తయమ్ముమ్ భంగమవుతుంది.
సంక్షిప్తం:-
తయమ్ముమ్ పరిశుభ్రమైన మట్టితో చేస్తారు. తయమ్ముమ్ చేసిన తరువాత నీళ్ళు దొరికితే తయమ్ముమ్ భంగమవుతుంది. తయమ్ముమ్ చేతులతో చేస్తారు. తయమ్ముమ్ రోగ పరిస్ధితిలో, నీళ్ళు లేని పరిస్ధితిలో ,మూత్ర విరజన, స్త్రీలతో సంభోగం, ప్రయాణం మొదలవి: ఉన్న పరిస్ధితిలలో తయమ్ముమ్ చేస్తారు. ఇంకా జనాబత్ పరిస్ధితిలో కూడా చేస్తారు.