జకాత్ ముస్లింల విధి & ఆర్థిక వ్యవస్థ స్థైర్యం (Part - 2)
జకాత్ యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు -
జకాత్ రెండు భాగాలుగా విభజించబడును,
1: డబ్బు ద్వారా చెల్లించే జకాత్
2: మనసుతో జకాత్ ఇవ్వడం అనగా సదఖ యె ఫితర్.
జకాహ్ ఎప్పుడు విధి అగును:
- ముస్లింలపై, ఎందుకంటే జకాత్ వలన శుభ్రత మరియు శుభం ప్రాప్తమగును.
- స్వతంత్రుడై ఉండాలి. వేరే వారిపై ఆధారపడి ఉండరాదు.
- జకాతు చెల్లించడానికి కావలసిన నిర్ణీత పరిమితి (నిసాబ్) – పూర్తి అయి ఉండాలి.
- సమాజంలో శాంతిబధ్రతలు ఉండాలి మరియు ఆ ధనంలో వేరేవారి హక్కు ఉండరాదు.
- ఒక సంవత్సరము పూర్తి కావాలి.
జకాత్ ధనం యొక్క నిబంధనలు,
1: జకాత్ ఇచ్చేవారి సంపద తమదై ఉండాలి.
2: నిత్యవసర వస్తువులకు కావలసిన డబ్బు కన్నా ఎక్కువ ఉండాలి.
3: ధనంపై ఒక సంవత్సరం అయి ఉండాలి.
మరియు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం ఇలా చెప్పారు మీ దగ్గర 200 దీర్హంలో ఉంటే అప్పుడు మీరు దాంట్లో నుంచి 5 దిరములు తీసి జకాత్గా ఇవ్వాలి.
బంగారంపై 20 దినార్లు ఉంటే తప్ప జకాత్ విధింపబడదు. 20 దినార్లు ఉంటే దాంట్లో నుంచి అర్ధ దినార్ జకాత్గా ఇస్తారు.
వెండిధవంలో నుంచి జకాత్ ఇస్తే 612:360 గ్రాములు అయ్యి ఉండాలి. అదే బంగారం నుంచి అయితే 87:840 గ్రాములు అయ్యి ఉండాలి. వ్యాపారం యొక్క దినం బంగారు మరియు వెండి అనగా 612:360 లేదా 87:480 కి పైగా ఉంటే అప్పుడు జకాత్ వ్యాపారం నుంచి తీయొచ్చు.
వ్యాపారంలో జకాత్ వందలో 40వ భాగంలో తీస్తారు.
మరియు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా చెప్పారు ఒంటె, ఆవు మరియు గొర్రె ఈ జంతువులలో కూడా జకాత్ చెల్లించాలి.
ఎవరి దగ్గరైనా 5 కన్నా తక్కువగా ఒంటెలు ఉంటే జకాత్ ఇవ్వనవసరం లేదు, తన దగ్గర 30 నుంచి 39 వరకు ఆవులు ఉంటే దాంట్లో నుంచి రెండు సంవత్సరాల దూడను జకాత్గా ఇవ్వాలి. 40 నుంచి 59 వరకు ఆవులు ఉంటే మూడు సంవత్సరాల దూడను జకాత్గా ఇవ్వాలి.
ఎవరి దగ్గరైనా 40 నుంచి 120 వరకు గొర్రెలు ఉంటే ఒక గొర్రెలు జకాత్తుగా ఇవ్వాలి, అలాగే 121 నుంచి 200 వరకు ఉంటే రెండు గొర్రెలు ఇవ్వాలి. మరియు తన పంటలలో కూడా జకాత్ ఇవ్వాలి, దీనిపై ముఖ్యంగా ఇంత ఇవ్వాలి అని మన ఇమామ్ అబూ హనీఫా దగ్గర ప్రత్యేక వచనం లేదు, ఇంకా నువ్వే నీ పంటకి నీరు మందులు మొదలైనవి ఇస్తూ ఉంటే, నీవు దాంట్లో నుంచి 20వ భాగం జకాతుగా ఇవ్వాలి, లేదా వర్షం కురవడంతో అవుతుంటే పదవ భాగం జకాదుగా ఇవ్వాలి.