తరావీహ్ నమాజ్: విశిష్టత (Part - 1)

ముస్లింలందరూ రంజాన్ కి స్వాగతం పలకడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ మాసం బర్కత్, కరుణ, మన్నింపుల మాసం ఇందులో ప్రతి ఒక్క ప్రార్థన మరియు ఆరాధనల యొక్క పుణ్యాలు మరియు ప్రతిఫలాలు పెంపొందించబడతాయిز సైతాన్ బంధింపబడుతుంది, స్వర్గపు ద్వారాలు తెరువబడుతాయి నరక ద్వారాలు మూయబడుతాయి. ఈ మాసంలో ప్రత్యేకంగా రెండు ఆరాధనలు చేపడతారో ముఖ్యం ఒకటి ఉపవాసం మరొకటి తరావీహ్ నమాజ్ యొక్క విశిష్టత ప్రవక్త యొక్క ప్రవచనాలలో చాలా స్పష్టంగా వివరించబడింది.

 عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

          హజరత్ అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు - ఎవరైతే రంజాన్ మాసంలో విశ్వాసంతో పుణ్యాన్ని సంపాదించే ఉద్దేశంతో నఫిల్ నమాజులు చేస్తాడో, అతని వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి.

          ఎప్పుడైతే ఒక దాసుడు పాపాలతో శుద్ధి అవుతాడో అల్లాహ్ అతన్ని ఇష్టపడతాడు మరియు అతను స్వర్గానికి అర్హుడు అవుతాడు. ఒక దాసుని పాపాలే అతనిపై అల్లాహ్ యొక్క క్రోధం తెప్పిస్తాయి కానీ అవే పాపాలు మన్నింపబడితే అతను అల్లాహ్ కు దగ్గరవుతాడు. అందువలన తరావీ నమాజ్ మనిషి యొక్క పాపాలను మన్నింపబడేలా తోడ్పడుతాయి.

عن عائشة رضي الله عنها أنَّ النَّبيَّ صلَّى اللهُ عليه وسلَّم صلَّى في المسجِدِ فصَلَّى بصلاتِه ناسٌ، ثمَّ صلَّى من القابلةِ، فكَثُرَ النَّاسُ، ثمَّ اجتَمَعوا من الليلةِ الثَّالثةِ، فلم يخرُجْ إليهم رسولُ اللهِ صلَّى اللهُ عليه وسلَّم، فلمَّا أصبح قال: قد رأيتُ الذي صنعْتُم فلم يمنَعْني من الخروجِ إليكم إلَّا أنِّي خَشِيتُ أن تُفرَضَ عليكم، وذلك في رَمَضانَ

          ఆయిషా రదియల్లాహ్ అన్హా కథనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో (నఫిల్) నమాజ్ చేశారు. వారితోపాటు సహాబాలు కూడా నమాజ్ చదివారు. ఆ తర్వాత రోజు కూడా నమాజ్ చేశారు, అప్పుడు ప్రజలు అధికంగా వచ్చారు. మరి మూడవ రోజు ప్రజలు (నమాజ్ కోసం) చేరుకున్నారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాలేదు మరియు పొద్దున్న వారితో ప్రవక్త ఇలా సెలవిచ్చారు: మీరు చేసిన పనిని నేను గమనించాను. నేను (నమాజ్ కి) రాకపోవడానికి కారణం ఆ నమాజు మీపై విధించబడుతుందని భయం తప్ప మరేమీ లేదు. అది రంజాన్ నెలలోని ఘటన.

          ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క తన ఉమ్మత్ పై చూపిన ఒక కారుణ్య ఘటన. మూడవరోజు ప్రవక్త ఎందుకు రాలేదని గమనిస్తే అది అల్లాహ్ తన ఉమ్మత్ పై ఈ నమాజ్  ను విధిస్తాడు అన్న భయం మాత్రమే. అది విధింపబడిన తర్వాత తన ఉమ్మత్ ఆ నమాజుపై  సరిగ్గా శ్రద్ధ వహించకపోతే వారు పాపులవుతారని భయంతో రాలేదు. అలాగే ఈ నమాజ్ యొక్క మహత్యం గురించి ఇంకొక హదీస్

عبد الرحمن بن عوف، عن رسول الله صلى الله عليه وسلم أنه ذكر شهر رمضان ففضله على الشهور، وقال:  «من قام رمضان إيمانا واحتسابا خرج من ذنوبه كيوم ولدته أمه»

          అబ్దుల్ రహమాన్ ఇబ్ను ఔఫ్ కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ మాసం గురించి మరియు ఇతర మాసాల కంటే దాని విశిష్టత ప్రస్తావించి ఇలా ప్రవచించారు: ఎవరైతే విశ్వాసంతో, పుణ్య ఫలాపేక్షతో రంజాన్ మాసంలో ఖియాం (రాత్రిళ్ళు దైవారాధనలో) చేస్తాడో తన తల్లి జన్మనిచ్చిన రోజులా పాపాల నుండి వస్తాడు.

          మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ప్రవచించారు: నిశ్చయంగా అల్లాహుతాలా రంజాన్ యొక్క ఉపవాసాలు మీపై విధించాడు, నేను మీకోసం ఖియామ్ ను సున్నత్ గా ఖరారు చేశాను. అందువలన మీలో ఎవరైనా రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండి, ఖియామను ఆచరిస్తే తనను తన అమ్మ జన్మనిచ్చిన రోజులా పాపాల నుండి శుద్ధి అవుతాడు.

          ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన సహాబాలకు రంజాన్ యొక్క ఖియామ్ (తరావీహ్) ఆచరించాలని ప్రోత్సహించారు, కానీ ఆజ్ఞాపించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకం విడిచిన తర్వాత అబూబకర్ మరియు ఉమర్ రదియల్లాహు  యొక్క ముందు రోజుల్లో మునుపట్లగే రంజాన్ ఖియాం నడిచింది. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు  అన్హు అందరిని ఉబయ్యి ఇబ్ క'అబ్  రదియల్లాహు అన్హు ఇమామత్ లో అందరిని జమా చేశారు. ఆ కాలంలో అందరూ నమాజ్ సామూహికంగానే చదివేవారు. ఇమామ్ ఇబ్ను హజర్ అస్కల్లాని తన పుస్తకం తల్ఖీస్ التلخيص   లో  ప్రస్తావించారు:

          ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు రాత్రుల్లో 20 రకాతులు తారవీహ్ నమాజు చదివించారు. కానీ మూడవ రోజులో ప్రజలు జమా అయ్యాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హుజ్రా నుండి బయటకు రాలేదు. మరి తెల్లవారి ఇలా చెప్పారు – మీ పై 20 రకాతుల తారవీహ్ నమాజు విధింపబడుతుందను మరియు మీరు దానిని సరిగ్గా చేపట్టరని నాకు భయమేసింది.

عن أبي هريرة، قال: خرج رسول الله صلى الله عليه وسلم، فإذا أناس في رمضان يصلون في ناحية المسجد، فقال: «ما هؤلاء؟»، فقيل: هؤلاء ناس ليس معهم قرآن، وأبي بن كعب يصلي، وهم يصلون بصلاته، فقال النبي صلى الله عليه وسلم: «أصابوا، ونعم ما صنعوا»

          హజ్రత్ అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు కథనం – ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం (హుజ్రా నుండి) బయటకు వస్తే, అక్కడివారు రంజాన్లో మసీదు మూల నమాజు చేస్తున్నారు, వీరందురూ ఎవరు అని ప్రవక్త అడిగారు, వీరందరు ఖురాన్ నేర్చుకోని వారు, వారికి ఉబయ్యి రదియల్లాహు అన్హు నమాజ్ చదివిస్తున్నారు. అప్పుడు ప్రవక్త ఇలా బదులిచ్చారు – వీరు సరైన పని చేశారు, వారు చేసింది ఉత్తమం.

బుఖారీలోని మరొక ఉల్లేఖనం- عن عبد الرحمن بن عبد القاري أنه قال خرجت مع عمر بن الخطاب رضي الله عنه ليلة في رمضان إلى المسجد فإذا الناس أوزاع متفرقون يصلي الرجل لنفسه ويصلي الرجل فيصلي بصلاته الرهط فقال عمر إني أرى لو جمعت هؤلاء على قارئ واحد لكان أمثل ثم عزم فجمعهم على أبي بن كعب ثم خرجت معه ليلة أخرى والناس يصلون بصلاة قارئهم قال عمر نعم البدعة هذه والتي ينامون عنها أفضل من التي يقومون, يريد آخر الليل وكان الناس يقومون أوله

          అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ ఖారి రదియల్లాహు అన్హు కథనం: నేను ఒకరోజు రాత్రి ఉమర్ రదియల్లాహు  అన్హు తో కలిసి మసీదులోకి వెళ్లాను. అక్కడ ప్రజలు వేరువేరుగా నఫీల్ నమాజులు చదువుతున్నారు. (రంజాన్ లో తరావీ నమాజ్ ప్రతి వ్యక్తి వేరువేరుగా చదువుతున్నారు). కొందరు ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతున్నారు. వీళ్లందరినీ ఒకే ఇమామ్ వెనక చేస్తే బాగుంటుందని చెప్పి నిశ్చయించుకొని, ఉబయ్యి బిన్ క'అబ్ రదియల్లాహు అన్హు ను ఇమాముగా చేసి, అందరిని అతని వెనుక నిలబెట్టారు. అనంతరం ఉబయ్యి రదియల్లాహు అన్హు అందరికీ తరావీహ్ నమాజు చదివించసాగారు. నేను రెండవ రోజు రాత్రి కూడా ఉమర్ రదియల్లాహు అన్హు వెంట మసీదుకు వెళ్లాను. ప్రజలందరూ ఒకే ఇమాము వెనక తరావీహ్ నమాజు చదువుతున్నారు. అది చూసిన ఉమర్ రదియల్లాహు  అన్హు ఈ పద్ధతి బాగుంది. దీన్ని చదవకుండా నిద్రపోయే వారు చదివే వారి కన్నా ఉత్తములు. అంటే రాత్రి ప్రారంభంలో చదవే ప్రజలు. అప్పుడు ప్రారంభ రాత్రిలో చదువుకునేవారు. (బుఖారీ)

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter