ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్
ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్
ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ యొక్క పూర్తి పేరు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ బిన్ హుసైన్ బిన్ ఫాతిమా బిన్త్
ముహమ్మద్ {సల్లలాహు అలైహి వ సల్లం}. కర్బాలా నుంచి హుసైన్ మరియు వాళ్ళ కుటుంబంలో ఉన్న యువకులను మరియు మగ బిడ్డలని చంపేశారు తమరి హజరత్ ఇమామ్ ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ ఆ కర్బాల లో మరణాన్ని తకాలేదు.
ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ నుంచి తప్ప ప్రవక్త ముహమ్మద్{సల్లలాహు అలైహి వ సల్లం} యొక్క తరాలు పుట్టలేదు. ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ లేకపోతే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ప్రవక్త {సల్లలాహు అలైహి వ సల్లం} యొక్క తరం నుంచి ఉండేవారే కాదు. ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ మదీనా యొక్క ఫుకాహా మరియు అల్లాహ్ ప్రార్ధన చేసేవారిలో నుంచి ఉండేవారు. అందువలన వారి సమూహం తమరుని “సయ్యిద్ అల్ ఆబిదీన్ “سید العابدین”
దాని తరువాత అల్లాహ్ కోసం చేసే ప్రార్ధన లో ఓ ఎత్తు స్తాయికి తాకినప్పుడు తమరిని తమ సమూహం జైనుల్ ఆబిదీన్ అని పిలవడం మొదల పెట్టారు.
ఒక సారి హిషామ్ బిన్ అబ్దుల్ మాలిక్ {ఇతను యువరాజు, ఉమయ్యిద్ కు కాబోయే పాలకుడు} హజ్జ్ చేయడం కోసం ఒక సైన్యం తో కలిసి మక్కాకు చేరుకుంటారు. అప్పుడు అక్కడ చాలా ప్రజలు ఉన్న వలన ఆ సైన్యం వాళ్ళందరిని జరుపుతారు. కానీ ఆ ప్రజలు ఎవ్వరూ అక్కడ నుండి కదలరు. కానీ ఎప్పుడైతే ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ అక్కడికి చేరుతారో అప్పుడు గుంపు మొత్తం ఆ ప్రజలందరూ అక్కడ నుండి జరిగి తమరిని { الحجر الأسود} హజ్రె అస్వద్ నల్ల రాయిను తాకే అవకాశం ఇస్తారు. అప్పుడు అలీ జైనుల్ ఆబిదీన్ ఆ హజ్రె అస్వద్ ను ముద్దు పెట్టుకొని హజ్జ్యాత్రను మొదల పెడుతారు. అప్పుడు అది చూసిన హిషామ్ బిన్ అబ్దుల్ మాలిక్ చాలా ఆశ్చర్యంగా గమనించాడు. అప్పుడు వాడీ సైన్యం వాడితో ఇలా ప్రశ్నించారు “ఓ! యువరాజా! ఇతను ఎవరు” హిషామ్ బిన్ అబ్దుల్ మాలిక్ ఇలా చెబుతాడు నాకు ఇతను ఎవరో తెలియదు. హిషామ్ బిన్ అబ్దుల్ మాలిక్ ను అతను ఎవరో తెలిసి కూడా అతను ఎవరో చెబితే ఆ సైన్యం అతని వైపు వెలిపోతుందేమోనని అతనితో కలిసి పోతుందని చాలా భయం వేసింది. అందువలన హిషామ్ బిన్ అబ్దుల్ మాలిక్ తమ సైన్యాని అతడు ఎవరో తెలియదు అని చెప్పాడు. అప్పుడు వాడి సైన్యం నుంచి ఓ కవి ఎవడి పేరైతే ఫరజ్దక్ అతను ఒక పద్యం పాడాడు దానిలో కొంచం మీ ముందు పెడుతున్నాను:
هذا ابن فاطمة إن كنت جاهله بجده أنبياء الله قد ختموا
ఇతడు ఫాతిమా కుమారుడే వారి తాత దేవుడి ప్రవక్తల యొక్క చివరి ప్రవక్త.
ما قال لا قط إلا في تشهده لولا التشهد كانت لاؤه نعم
తమరు ఎప్పుడు లా {లేదు, కాదు} అన్న మాట చెప్పలేదూ. ఒక్క చోటు తప్ప అది { تشهد} తషహ్హుద్ లో తప్ప మరి ఇంకెక్కడ చెప్పాలేదు.
ఈ పద్యం మొదటి నుంచి చివరి వరకు హజరత్ ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ గురించి చాలా బాగా చెప్పారు.
ఇలా అతని గురించి ఫరజ్దక్ చాలా చెప్పాడు. హిషామ్‌కి కోపం వచ్చింది మరియు అతని పారితోషికాన్ని నిలిపివేసి ఇలా అన్నాడు: మీరు మా గురించి అలాంటిదేమీ చెప్పలేదా? అతను ఇలా అన్నాడు: అతని తాత వంటి తాతని, అతని తండ్రి వంటి తండ్రిని మరియు అతని తల్లి వంటి తల్లిని తీసుకురండి, నేను మీ మధ్య అదే చెప్పగలను, కాబట్టి వారు అతన్ని మక్కా మరియు మదీనా మధ్య అస్ఫాన్‌లో బంధించారు. ఇది అలీ జైనుల్ ఆబిదీన్ను నివేదించబడింది. ఇబ్న్ అల్-హుస్సేన్, కాబట్టి అతను అతనికి పన్నెండు వేల దిర్హామ్‌లు పంపి ఇలా అన్నాడు: ఓ అబూ ఫిరాస్, మమ్మల్ని క్షమించు, అప్పుడు ఫరజ్దక్ తమరి బాహుమానులని తిరస్కరించి ఇలా చెప్పాడు: నేను చెప్పింది దేవునికి మరియు అతని దూతకి కోసం బాహుమానుల కోసం డబ్బుల కోసం కాదు, మరియు నేను అతని నుండి ఏమీ ఆశించను. కాబట్టి అతను దానిని అతనికి తిరిగి ఇచ్చిడు అప్పుడు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ అతనికి తిరిగి ఇచ్చి ఇలా చెప్పారు: మేము ఎవరికైనా బహుమానం ఇచ్చిన లేక ఎవరికైనా డబ్బులిచ్చిన మేము తిరిగి దానిని తీసుకోము.
దాని తరువాత ఒక రోజు ఒక మనిషి ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ చాలా బూతు మాటలు తమరి ముందే చెబుతూ ఉంటాడు. దానిని ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ విని విననట్టుగా అతనికి ఏమి చెప్పకుండా తమరు తమ పని చేసుకొని ఉంటారు. అప్పుడు ఆ మనిషి తమరి ముందు పోయి నేను మిమ్మల్నే చెబుతున్నది మీరు ఎందుకు నన్ను ఏమి చెప్పటం లేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ ఒక అందమైన జవాబు ఇచ్చారు. అల్లాహ్ ఖురాన్ లో బొదిస్తున్నారు: “మీరు ఇతరులని క్షమించండి” ఆ మాట మీద నేను నిలబడి నిన్ను క్షమించాను ఆ మాట వినిన ఆ మనిషి హజరత్ ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ను క్షమాపన అడిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హజరత్ ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ ను వారి సమూహం వాళ్ళు తమరు పిసినారి అని చెప్పేవారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమనగా ప్రతి రోజు ప్రతి రాత్రి ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ 100 లేదా దానికి మించి ఇల్లుల ముండా తినే వస్తువుల బస్తాలను పెట్టేవారు.
ఎప్పుడైతే ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ ఈ లోకాన్ని విడిచారో అప్పుడు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ ను స్నానం చేపించేతప్పుడు అక్కడున్న ప్రజలందరూ అతని వీపు మీద కొన్ని గుర్తులను గమనించారు. దాని ప్రశ్నించేటప్పుడు జవాబు ఇలా లభించింది “రాత్రి చీకటిలో అనాధాల కోసం మోస్తున్న భారం {బస్తాలు} దీని కారణంగా ఆ గుర్తులు పడ్డాయని తెలిసింది.
ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ తమరి జీవితాన్ని ప్రవక్త యొక్క సున్నత్ మరియు ప్రవక్త అనుచరల మాటల మీద అడుగుజాడలను అనుసరించారు. దాని తరువాత ఉమయ్యిద్ పాలకుడు వాలిద్ బిన్ అబ్దుల్ మలిక్ తమరికి మోసపూరితంగా విషం ని తినిపించి చంపేసాడు. 95వ హిజ్రీ ముహర్రం 18వ తేదీన ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ శుక్రవారం రోజున మరణించారు. ఇంకొందరు ఇలా భోదించారు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ 95వ హిజ్రీ ముహర్రం 25వ తేదీన మరణించారు. మరియు కొందరు ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్ 95వ హిజ్రీ రబ్బీఉల్ అవ్వల్ 14వ తేదీన మరణించారు.
దీనినుంచి మనం తెలుసుకోవాలిసిన మాట ఏమనగా మేము ఇతరుల సహాయం చేయాలి, ఇతరులని క్షమించాలి మరియు అల్లాహ్ కోసం చాలా చాలా బాగా ప్రార్ధన చేయాలి.