షేఖ్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్, ఆత్మజ్ఞాన జీవితగాథ

షేఖ్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్, ఆత్మజ్ఞాన జీవితగాథ

    యావత్ ముస్లిం సమాజంలో అందరి వద్ద పేరున్న వ్యక్తి షేఖ్  అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్. ప్రవక్త   صلى الله عليه و سلم మరియు వారిని అనుసరింరచే సహాబాల యొక్క షరీఅత్ ను ప్రవక్త కాలం తర్వాత వచ్చిన వారు వ్యతిరేకంగా అమలు చేయసాగారు. ఆ వ్యతిరేకాన్ని తీసివేయడానికి, తొలగించడానికి ఎందరో మహాపురుషులు ప్రయత్నించారు. అలా చేసిన వారిలో ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ ఖదిర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్. ఆ ప్రభావం వలన ఇప్పటికి అంటే తొమ్మిది శతాబ్దాల తర్వాత కూడా ముస్లిం సమాజం వారి మతసేవలను గుర్తిస్తుంది.
 విద్యాభ్యాసం 
 షేఖ్  అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ పెర్షియాలో హి.470 లో జన్మించారు. వారి సంతానం పితృత్వంతో హజ్రత్ హసన్ رضي الله عنه  మరియు మాతృత్వంతో హజ్రత్ హుసైన్ رضي الله عنه తో కలుస్తుంది. అంతే కాకుండా వారి బంధుత్వం నాలుగు ఖలీఫాలతో కలుస్తుంది. వారి తండ్రిం పేరు అబూ సాలిహ్ మూసా జంగీ దోస్త్. తల్లి పేరు ఉమ్ము-ల్-ఖైర్. అనాథగా పుట్టిన షేఖ్  జీలానీ (ర.అ) ను పెంచటంలో తన తల్లి మంచి పాత్ర పోషించింది.
ప్రథమ విద్యనభ్యసించి ఉన్నత విద్య కోసం 18వ ఏటలో వారు బగ్దాద్ కు ప్రయాణమయ్యారు. వారిని అభ్యాసించిన గురువులు ఆనాటి కాలపు మహోన్నతులుగా, మహా పండితులుగా ప్రఖ్యాత చెందిన వారు. ఆ తర్వాత ఆత్మజ్ఞాన విద్యనభ్యసించు కొరకు బగ్దాద్ వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళారు.
అబుల్ వఫా ఇబ్నె అఖీల్,మహమ్మద్ ఇబ్ను ముహమ్మద్ ఇబ్నెబాఖిల్లానీ, అబుజకరియ్యా తబ్రీజీ, మొదలగువారు ఆ కాలనాటి మత గురువుత్లో ముఖ్యమైనవారు మరియు వారి చూపినవారు ముఖ్యంగా హమ్మాద్ ఇబ్నె ముసల్లం(బగ్దాద్) ఖాజీ అబూసయీద్(హంబలీ మస్లక్ ఫకీహ్).
 షేఖ్  అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఉన్నత విద్యనభ్యసించేందుకు ఎక్కువగా ధ్యాస ఇస్తిఖామత్ పై పట్టుదల చూపారు. వారి దైవారాధనలు, ప్రార్థనలు వారి విద్యకు ఏరకంగా కూడాను అడ్డుపడలేదు. ఎందుకంటే వారికి విద్యలో అంత ధ్యాస ఉండేది.
సామాజిక నేపథ్యం
వారు జన్మించిన కాలంలో ప్రజలు దుర్మార్గ బాట చివరికి చేరారు. అంధకారం, అజ్ఞానం ఆ కాలాన్ని ఏలేవి. నాలుగు శతాబ్దాల నుంచి వస్తున్న రాజనీతి అంశాలు ప్రజలపై చాలా దుర్ప్రభావం చూపాయి. ధన దురాశ, అధికార వాంఛలు వారిలో చాలా అధికంగా ఉండేవి. సొంత ముస్లిములే తమ అల్లాహ్ ను వారి ప్రవక్తను మరచిపోయారు. ప్రజల ఆర్థిక స్థితుల పై ధనికులకు దానం చేసే మనస్సు ఉండేది కాదు. వారి పేదరికం వారిని అసూయ మరియు ఈర్ష్య వైపు దారి చూపాయి. అధికారం వహించాలి, డబ్బు సంపాదించాలి మొదలగు కోరికలు వారిని తమ జీవితాల నుంచి నిర్లక్ష్యం చేశాయి. ప్రజల పరిపాలనకి ఇస్లామిక ధర్మం నుంచి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఉంటే కూడా పేరుకనే ఉండేది.
 ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ఇహలోకం నుంచి  పరలోకానికి,  నటన నుంచి సన్మార్గానికి  మరియు డబ్బుదురాశ నుంచి దైవకాంక్ష వరకు వారి మనస్సులను మలుపు తిప్పే ఓ వ్యక్తిత్వాన్ని కోరేది ఆ నాటి కాలం.
అబుల్ హసన్ ఇలా ప్రస్తావించారు: హుజ్జతుల్ ఇస్లాం ఇమామ్ గజాలీ (రహ్మతుల్లా అలైహి) తన శక్తి సామార్థ్యాలతో, విద్య, మార్పు ప్రయత్నాలతో, ప్రజలముందు నిలబడ్డారు. వారు గ్రీకు తత్వాల దాడి నుంచి, అంతర్ నాస్తికత్వం నుంచి, పండితుల మత మార్పు నుంచి ఇస్లాం పై వచ్చే విమర్మలను ఎదుర్కోవలసిన వ్యక్తిగా మారారు. కాని ఇస్లామిక సమూహం ఓ  ఉన్నతాత్మ వ్యక్తితవాన్ని, వివిధ సమూహాల్ని ఏకపరిచే  వ్యక్తిత్వాత్ని, తన ప్రసంగ ప్రచారాలతో, మత ఆత్మలు, కూడిన వ్యక్తిత్వాన్ని కోరింది.
 విద్యా భోదన మరియు ప్రచారణ:
 విద్యాభ్యాసంలో మరియు ఆత్మజ్ఞానలో వృద్ధి చెందాక మత ప్రచార  రంగంలో షేఖ్  జీలానీ  ప్రవేశించారు. తన గురువు అబూ సయీద్ బాబుల్ అజ్జ్ లో తీసుకున్నారు. దాంతో వారు తన విద్యాభోదన ప్రారంభించారు. వారి భోదన చాలా ప్రఖ్యాత చెందింది. ప్రజలు ఎక్కువగా అక్కడికి చేరుకోసాగారు. ఆ తర్వాత ఆ మద్రసా ని విశాలం చేశారు. సంపన్నులు వారి ధనంతో మరియు పేదలు వారి పనితో ఆ మద్రసాని విశాలపరిచారు. హిజ్రి 522 లో ఆ మద్రసా పూర్తిగా నియమించబడింది. అప్పటినుంచి ఇరాఖ్ యొక్క ఆత్మజ్ఞాన కేంద్రంగా మారింది. వారి ఆధర్వ్యంలో ఇరాఖ్ పరిపాలించబడింది. ఇరాఖ్ కాకుండా ప్రపంచ మూలల నుంచి జనాభా తరలిరాసాగారు. వారిలో రాజులు, మంత్రులు, తంత్రులు, కూడా ఉన్నారు. వారి మజ్లిస్ లో కనీసం 70 వేల మంది పాల్గొనేవారు. వారి మజ్లిస్ లో ఆత్మజ్ఞనం తో పాటు వేరే 13 విద్యలు కూడా ఉండేవి. ముఖ్యంగా తఫ్సీర్, హదీస్, ఫిఖ్, నహ్వ్, ఇల్ముల్ హదీస్ వగైరా.
 వారు షాఫీ మరియు హంబలీ మస్లక్ లో ఫత్వా ఇచ్చేవారు. వారి ఫత్వా ఇతర పండితులను మరియు మత గురువులను ఆశ్చర్యపరిచేవి. ఒకసారి ఒకతను నేను ప్రార్థన చేస్తుండగా నాలాంటి ప్రార్థన ఈ భూలోకంలో ఇతరులెవ్వరూ ఆ ప్రార్థన చేయకూడదు. అలా చేసినచో నా శ్రీమతికి విడాకులు అవుతాయని ప్రమాణం చేశాడు. అప్పుడు దీని పరిష్కారం ఎలా. అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ  వద్ద ప్రశ్నిస్తాడు. దానికి జవాబులో షేఖ్  జీలానీ  నీవు కాబతుల్లాహ్ వద్ద ఎవరినీ రాకుండా ఏడు తవాఫ్ లు చేయి. అప్పుడు నీ ప్రమాణం పూర్తవుతుంది.
 ప్రపంచ కోరికను మరియు దురాశతో బతుకుతున్న ప్రజలను దైవ మార్గానికి తరలించే ఓ ప్రచారకునికి ఉండవలసిన విశేషణాలు వారిలో లభించేవి. దైవశుద్ధి వారిలో సంపూర్ణంగా ఉండేది. మత ప్రచారంలో వారికి దైవ సధ్భావం తప్ప మరే ఇతర ఆశలు వారికి ఉండేవి కావు. సృష్టి కోసం కోరే మంచితనాన్ని నాలో ప్రవేశింపచేసిన అల్లాహ్ ను నేను స్మరిస్తూ ఉంటాను. అని వారు ఎల్లప్పుడూ చెప్పేవారు.
 నేను మంచికోరేవాన్ని. ఇతరుల నుంచి ఏమి ఆశించను. నా ఫలం నా అల్లాహ్ వద్ద ఉంది. నాకు ఈ ప్రపంచం నుంచి ఎటువంటి సంభందం లేదు. నేను ఇహలోక భక్తుడుని కాను. నేను అల్లాహ్ యొక్క భక్తున్ని. అహద్, ఖదీం, యొక్క ఆరాధన చేశేవాన్ని. నా సుఖం మీ విజయంలో ఉంది, నా దుఖం మీ ఓటమిలో ఉంది. (الفتح الرباني)
 మత ప్రచారం కోసం అల్లాహ్ నియమించబడిన తమ శరీరాత్మ, అంతరాత్మతో వారికి ఎటువంటి సంబందం ఉండేది కాదు. అల్లాహ్ తన సౌకర్యాలను ఎక్కువ చేస్తే సంతోషపడటం, తక్కువ చేస్తే నిర్సక్ష్య పడటం తన జీవితం ఆదర్శం కాదు. తన సమాజ ప్రజలు తనతో రాజీ పడక పోయిన షేఖ్  జీలానీ తమ పని తాము చూసుకునేవారు. వారు ఎల్లప్పుడూ చెప్పేవారు మనిషి అంతరాత్మలో దైవం ప్రవేశిస్తే మనిషి నిష్క్రమిస్తాడు. ఒక ఎండిన చెట్టు నుంచి ఆకులు రాలినట్టుగా తన చుట్టూ ఉన్న మనుషులు తన ఆత్మ ప్రపంచం నుంచి రాలిపోతారు. ఆ సందర్భంలో ఎవ్వరూ లేని లోకం జీవించవచ్చు. అతను తన హృదయంతో అంధుడు మరియు మూగవాడు అవుతాడు. ప్రజలతో వారి దృష్టి ఈ విధంగానే ఉండేది. ప్రజల నుంచి ఎటువంటి బెదిరింపులు వచ్చినా వారు పట్టించుకునే వారు కాదు. వాటిని ఉపేక్షిస్తారు. ధనం, రాజ్యం వారి మతప్రచారానికి ఎటువంటి విధంగా కూడా అడ్డుపడేవి కావు. న్యాయానికి, చట్టానికి వ్యతిరేకంగా ఉండే నాయకులను వారు వదిలేవారు కాదు. ఆ కాలంలో ముఖ్తఫీ అనే రాజు యహ్యా బిన్ సయీద్ అనే దౌర్జన్యున్ని ఖాజీగా నియమించాడు. అప్పుడు ఖుత్బుర్రబ్బానీ మింబర్ పై రాజుతోను ఉద్దేశిస్తూ ప్రసంగంలో చెప్పారు ప్రజల పై మీరు అందరి కన్నా హింసాత్ముకున్ని మీరు అధికారం ఇచ్చారు. కరుణామయుడైనా అల్లాహ్ ముందు పరలోకంలో దీనికి జవాబు ఇవ్వక తప్పదు. ఈ మాటలు వినగానే రాజు కంటి నుంచి కన్నీరు కార్చారు. భయంతో అతన్ని అధికారం నుంచి తొలగించారు. 
 దుర్మర్గంలో ఉన్న పండితులను కూడా వారు సన్మార్గంలో నడిపించేవారు. ఆ కాలంలో ప్రపంచ ప్రయోజనాల కోసం పనిచేసే రాజ పాదసేవ పండితులు కూడా ఉండేవారు. అల్లాహ్ యొక్క సమ్మతి కోసం మరియు పరలోక ఆలోచనలతో జీవితం గడిపిన  పూర్వీకుల జీవిత ఆదర్శం నుంచి దూరమయిన వారిని జీలానీ షేఖ్  తన ఆత్మబలంతో పోరాడేవారు. ఓ సారి ఇలాంటి పండితుడిని ఓ సలహా కూడా ఇచ్చారు. ఓ హింసకుడికి సేవ చేయటంలో, హరాం ఆహారం సేకరించటంలో నీకు సిగ్గులేదా (లేక) దురాశ నిన్ను ప్రోత్సహించినదా.
ఎన్నాళ్ళనీ ఈ నరహింస రాజుల సేవఫలాన్నీ సేకరిస్తూంఉంటావు వారి రాజ్యం తొలిగింపోవడంలో అనుమానం లేదు. కానీ శాశ్వతంగా ఉండే రాజాధిరాజను నీవు వదులుతున్నావు. స్ధిరమైన దైవ విశ్వాసం, అసాధారణమైన ధైర్యం, సధ్భానం లోచెప్పేమాటలు, మాట మరియు చేతలలో సమానత్వం, ప్రజలు చేప్పే మాటలను వినకుండా దైవమార్గంలో పయనించటంలో వారిని ఎక్కువ బలాన్నిచ్చాయ. 
ఇస్లామిక సిద్ధంతాల నుంచి దూరమయన వారి రోగాలను షేఖ్  జీలానీ(ర) తన ప్రచార గమ్యంలా చేపట్టారు.ఈమాటలు ఫతూహు-ల్-గైబ్ మరియు ఇతర ప్రముఖ రచనలలో మనం చూడగలము. విశ్వాసం ఫలితాలైన భక్తి, ఆశ, భయం, ప్రపంచ త్యాగం హృదయంలో సృష్టించట మరియు దుర్గుణాలైన దురాశ, గర్వం, దేహేచ్ఛ లాంటి వాటిని హృదయం నుంచి తొలగించటాన్ని వారి ఉపన్యాసాల అంశాలు చేసేవారు.
భాషాశుద్ధి, మాటల శక్తి, మానసిక విశుద్ధి వారి ఉపన్యాసాలని విక్కువుగా బలపరిచేవి. వారి నుంచి ఎన్నో మహిమలు విలువడ్డాయి. మృతి చెందిన దేహాలను తిరిగి బ్రతికించడం అన్నిట్లో ఉత్తమమైనదని ఎక్కువక్కువుగా పండితులు అభిప్రాయం చెప్పారు. వారి జీవనశైలి వారి భోదనల కన్నా ఎక్కువుగా ప్రజల పై ప్రభావం చూపేవి. తన సొంత ధనాన్ని ఇతరులకి దానం చేస్తూ ధన దురాశకు వ్యతిరేకంగా ప్రజలకు భోదించేవారు. ప్రముఖ ఇస్లామిక చరికత్రకారుడైన సర్వవత్ సౌలత్ ఇలా ప్రస్తావిస్తున్నాడు.
అబ్దల్ ఖాదిర్ జీలానీ (ర) ఓ నాయకుడు కాదు. కాని వారి ధనదానం ఆ కాలం రాజుల కాన్నా అధికంగా ఉండేది. తనకి ఎవరైనా బహుమతి అయి ఇస్తే వాటిని ఆకలున్నావారికి మరియు కావాల్సివున్న వారికి  పంచేవారు. ప్రపంచ యావత్ ధనం నా వద్ద ఉంచితే దాన్నినేను పేదవారి మరియు బీదవారి కోసం ఖర్చు పెడతా. (ملت اسلامیہ مختصر تاريخ 283 )
స్వాధీనం, వ్యాప్తి
షేఖ్  జీలానీ బిరుదు ముహ్యుద్దీన్(మతాన్నిబతికించేవాడు) వారు చేసే పనులు వారి ఈ బీరుదుతో సమానంగా ఉండేవి.
ప్రపంచ అందచందాలను చూసి మైమరచిపోయిన, మరియు సన్మార్గం నుండి దూరమయిన వారి రాజ్యాలు వచ్చి ఇస్లాం మరియు ముస్లింలను దుర్మార్గంలో పడేసేయి. వారి గమ్యం దీనీనీ తన జీవితం ముందు ఉంచి ఇస్లాంమత ప్రచారం చేసే వారు. వీటికి సాక్ష్యం సల్జూక్ మరియు అబ్బాసీ యెక్క వైర కాలం. వారి మధ్య ఎక్కువగా గొడవలు జరిగేరి. అధికంగా గెలిచే రాజ్యం 519 హిజిరి లో జరిగిన పోరాటంలో సుల్తాన్  యెక్క సైన్యం అబ్బాస్ రాజ్యాన్ని ఓడించింది. ఈ సంఘటన రాజధాని అయిన బగ్దాద్ ను  వణికించింది మరియు ప్రతి చోట కష్టాలు స్పష్టమయ్యాయి. అరాజ్యకత్వం రాజ్యం ఏలింది. చివరికి రాజ మరణంతో ఇవన్ని తొలిగిపోయాయి. ఈ సమయంలో ముస్లిం సమూహానికి మేలు చేయటానికి షేఖ్  జీలానీ ముందు నిలబడ్డారు. ఆ సమూహరోగానికి  ఓ అసలైన ఔషదం వారి వద్ద ఉండేది. అప్పుడు ముస్లింలు యెక్క అపజయం ఎంత సత్యమో వారు తెలియజేశారు.
ప్రవక్త ముహమ్మద్( సొలల్లాహు అలైహి వసల్లం) యెక్క  మత గోడలు పడిపోతున్నాయి. వారి నిర్మానమ నాశనం అవుతుంది. ఓ ప్రజల్లారా! రండి, ఈ మత గోడలను  పునఃనిర్మిద్దాం. వాటి పునాది తయారు చేద్దాం. ఈ పదాలకు విశ్వాసాత్మబలం ఉండేది.
శతబ్దాల ముందు హసనుల్ బసరీ(రహ్మతుల్లా అలైహి) మార్తూపుల్ కర్ఖీ, ఫుజైల్ బిన్ ఇయాజ్, జునైదుల్ బగ్దాది తీసుకున్న బాధ్యతలను పూరించాక వారి కన్నాఎక్కువ బాధ్యతుడిగా వీరు పూరించారు. ఇది బగ్దాద్ మరియు ఇతర ప్రాంతాలలో మంచి ప్రభావం చూపించినది.
ఈ మాటల ప్రభావం ప్రపంచ ధనం సౌకర్యాలు కోల్పోయిన తరువాత వాటిని తిరిగి రప్పించగలిగాయి. యూదులు, క్రైస్తవులు నుంచి 5000 కు పైగా ఇస్లాం స్వీకరించారు. లక్షల కొద్ది ముస్లింలు నిజమైన ఆత్మీయత కాంతి వైపు తరలి వచ్చారు.
షేఖ్  జీలానీ(రహ్మతుల్లా అలైహి) వారి మత ప్రచారాన్ని వారి ప్రాంతం వరకే సరిపెట్ట లేదు. తన శిష్యులను మతవిద్య భోదించి ఇతర ప్రాంతాలకు పంపారు.వారు ఇస్లామిక విశ్వంలో కోనకోనాలో స్థిరపడ్డారు. తన 50వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఈ పనిని అర్థ శతాబ్దం వరకు జారి పెట్టారు. 561 హిజరీ లో షేఖ్  జీలానీ (రహ్మతుల్లా అలైహి) తుదిశ్వాస విడిచే వరకు ఈ ఇస్లామిక సమాజ నూతనత్వం ముందుకు సాగారు.
వారు మొదలు పెట్టిన ఈ పని వారి మృత్యు వరకు ఆగలేదు. వారి నుంచి ఆత్మవిద్యను పొందిన వారి శిష్యలు ఈ పనిని  కొనసాగించారు. ఇస్లాం మత  వ్యాప్తిలో ఈ శిష్యులు తమ సత్తా చాటారు. ఇస్లాం యుధ్దం చేయని ప్రాంతాలో(లేదా) ఇస్లాం పరిపాలించని ప్రాంతాల వరకు వీరి శిష్యులు మతాన్ని వ్యాపించడంలో మంచి పాత్ర పోషించారు. అబుల్ హసన్ అలీ హసన్ ఇలా తన  రచనలో ప్రస్తావించారు: బ్లాక్ ఆఫ్రికా, ఇందోనేషియా, చైనా, మరియు భారత్ లో కూడా వారి శిష్యులు వ్యాపించపోయారు. رجال الفكر و الدعوة (268)
చరిత్ర దుర్ఘటన ఏమనగా తాతారీలు ఇస్లామిక ప్రాంతాల పై దాడి చేసి, అక్కడి ముస్లింలపై ఖబ్జా చేశారు. మరియు  ఇస్లామిక గమ్యాలను తుడిపి వేయాలని ప్రతి మూల నుంచి ప్రయత్నించారు. ఈ దుర్దృష్ట సందర్భంలో కఠినంతో కూడిన తాతారి ప్రజల మధ్యలో షేఖ్  అబ్దుల్ ఖాదిర్ జీలానీ యొక్క శిష్యులు ఇస్లామిక కీర్తితో వారిని దైవ మార్గం వైపు మరలించారు. కత్తి కటారును లేకుండా, ఖడ్గం కన్నా పదునైన మాటలతో, పదాలతో, హృదయ పిలుపులతో తాతారీల కఠిన ఎదలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. చరిత్ర మలుపును తిప్పిన ఘటన ఇది. తాతారుల తర్వాతి సంతానంలో ఇస్లాం కోసం తమ గుండెలను త్యాగం చేసేవారు పుట్టారు.
 శతాబ్దాల పైగా భారత దేశాన్ని పరిపాలించిన మొగల్ రాజులు తాతారీ యొక్క వారసులే. అంతే కాకుండా, బైతుల్ ముఖద్దస్ ను యూదులు మరియూ క్రైస్తవ బారి నుంచి తప్పించిన సేనాధిపతి అయిన సుల్తాన్ సలాహుద్దీన్ అయ్యూబీ పై మరియు వారి సహచరులపై కూడా షేఖ్  అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు వారి శిష్యుల యొక్క మంచి ప్రభావం వారిపై చాలా బాగా పడింది. హిజ్రీ 6వ శతాబ్దంలో వారు వ్యాపించిన మత ప్రకాశం తొమ్మిది వందల సంవత్సరాల పైగా (ఇప్పుడు కూడా) ఖాదిరియ్యత్ పేరు తో ప్రఖ్యాత చెందుతున్నది.
 ముస్లిం సమాజంలో పుట్టిన ఆత్మజ్ఞానులు మరియు ప్రచారకులు ఎక్కువగా ఖాద్రియ్యా తరీఖత్ లో సంబందం ఉన్నవారే. ఇస్లామిక మత ప్రచార రంగంలో ప్రాముఖ్య చెందిన బాఖియ్యాతుస్సాలిహాత్ యొక్క వ్వవస్థాపకులు హజ్రత్ షాహ్  అబ్దుల్ వహ్హాబ్, ఖిలాఫత్ రైట్ యొక్క ప్రధాని ఆలి కుట్టి ముస్లియార్ మరియు ఎందరో మత పండితులు ఆత్మజ్ఞానులు కూడా ఖాద్రియ్యా తరీఖత్ తో సంబంధిచినవారే. ఈ విశ్వంలో ముస్లిం ఉన్న ప్రతి ప్రాంతంలో ఖాద్రియ్యా తరీఖత్ లో ఉన్నవారు ఉండేఉంటారు. షేఖ్  జీలానీ చేసిన ఈ మత సేవలను ఇస్లామిక విశ్వం ఏ ఉన్నత స్థాయు ఇచ్చందో దీని నుంచి మనం అర్థంచేసుకోవచ్చు.

Related Posts

Leave A Comment

1 Comments

Voting Poll

Get Newsletter