"కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడి హై" అని నినదించిన స్వరం ఇకపై మన మధ్యలో లేదు

"సబ్ కా ఖూన్ షామిల్ హై యహా కి మిట్టి మే....కిసికే బాప్ కా హిందుస్థాన్ థోడి హై (ఈ నెలలో ప్రతి ఒక్కరి నెత్తురు దాగుంది.... హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తుకాబోదు.....దేశం అందరిది)" అంటూ రాహత్ ఇందోరి కవిత దేశమంతటా ఊర్రూతలూగింది. దేశంలో లో చోటు చేసుకునే చాలా ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఈ ప్రముఖ ఉర్దూ కవి కవితా ఒక నినాదం గా నిలిచింది. ఇటువంటి కవి ఇప్పుడు మన మధ్యలో లేర నే విషయం చాలా మందికి జీర్ణించుకో కపోవడం సహజమే. ఈ సంవత్సరం మనకి ఎన్నో చెడు అనుభవాలు ను ఇచ్చింది అందులో ఈయన మరణం కూడా ఒకటి.

ఆగస్టు 10న రాహత్ ఇందోరి (70) తన రాతలు మరియు గుర్తులు వదిలేసి ప్రపంచం నుండి తుది శ్వాసను విడిచారు. కరోనా పాజిటివ్ రావడంతో మధ్యప్రదేశ్ లోని శ్రీ అరబిందో హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతున్న సమయంలో గుండె నొప్పి రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కవి రాహత్ ఇందోరి మరణం పై దేశంలోని ప్రముఖులంతా సంతాపం తెలిపారు. "అబ్ నా మై హు, నా బాకీ హై జమానే మేరే...ఫిర్ బీ మష్హూర్ హై షహరోమే అఫ్సానే మేరే (ఇప్పుడు నేను గాని నా గతం గాని లేదు.... కానీ ఆ ఊళ్ళతో నా అనుబంధాలు ఎప్పటికీ ప్రస్తుతాలే)" అంటూ కవి రాసిన వాక్యాలతో నే అల్విదా చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter