ఇమామ్ ఆజాం అబూ హనీఫా (699-769AD) యొక్క జీవిత చరిత్ర 

ఇస్లాం మతంలో నాలుగు అనుసరించే మజ్హబ్లు ఉన్నాయి. అవి ఏమనగా (హనఫీ,మాలికీ,షాఫఈ మరియు హంబలీ). అయితే ఇందులో ఎక్కువ ముస్లింలు అనుసరించేది హనఫీ మజ్హబ్. అంతేగాక ఈ నాలుగు మజ్హబులకి నలుగురు ప్రముఖ ఇమాములు ఉన్నారు. వారు

  1. ఇమామ్ అబూ హనీఫా (ర) అయన హనఫీ యొక్క ఇమామ్,
  2. మాలికీ యొక్క ఇమామ్ పేరు హజరత్ మాలిక్ (ర) మరియు ఆయన మరోపేరు ఇమామ్ దారుల్ హిజర (دارالحجرہ) మరియు తండ్రి పేరు అనస్, ఆయన మదీనాలో 93 హిజిరిలో జన్మించారు
  3. షాఫీ యొక్క ఇమామ్ పేరు మహమ్మద్, కున్యత్ అబూ అబ్దుల్లాహ్ అయన 150 హిజిరి లో జన్మించారు.
  4. హంబలీ మజ్హబు యొక్క ఇమామ్ పూర్తి పేరు అహ్మద్, కున్యత్ అబూ అబ్దుల్లాహ్ మరియు తండ్రి పేరు మహమ్మద్,ఆయన యొక్క తాత పేరు హంబల్ అందుకని ఆయన అహ్మద్ బిన్ హంబల్ పేరుతో పిలవబడుతారు. మరియు రబీవుల్ అవ్వల్ మాసం 164 హిజరా బగ్దాద్ లో జన్మించారు.

ఇమామ్ అబూ హనీఫా ఈ నలుగురు ఇమామ్‌లలో మొదటివారు మరియు ఈ నాలుగు మజ్హబులలో ఎక్కువగా స్వీకరించేది హనఫీ మజ్హబే. అంతేగాక మొట్టమొదటిగా స్థాపించింది హనఫీ మజ్హబ్. ఈ హనఫీ యొక్క అసలు పేరు ఇమామ్ హజరత్ నుమాన్ ఇబ్ను సాబిత్ (ర) కానీ అయన అబూ హనీఫా అని ప్రసిద్ధి చెందారు. ఆయనకు కర్మశాస్త్రం యొక్క ఇమాములలో ఒక పెద్ద ప్రముఖ ఇమాముగా భావిస్తారు. ఆయనే మొదటి ఇమాము కూడానూ. హజరత్ అబూ హనీఫా (అలైహి రెహ్మా) యొక్క తాత "అల్ మర్జుబాన్". హజరత్ అలీ (ర) ని కలిశారు మరియు అలీ (ర) అయన యొక్క జాతి కోసం దువా కూడా చేసారు. అయితే వారి తాత యొక్క జాతిలోనే వారి యొక్క మనవడుగా హజరత్ నుమాన్ బిన్ సాబిత్ (ర) జన్మించారు. అయన 80 హిజ్రీ లో (697) ఇరాక్ లోని కుఫా లో ఉమయ్యద్ ఖిలాఫత్ కాలంలో జన్మించారు. ఆయన 15 సంవత్సరాల వయస్సులోనే ఖురాన్ కంఠస్తం చేసారు. చాలామంది పండితులు, చరిత్రకారుల ప్రకారం అబూ హనీఫా తాబయి (తాబేయి అనగా ప్రవక్త (స) యొక్క సహచరుడుని కలిసిన వ్యక్తిని తాబయి అంటారు). అయితే వివిధ మూలాల ప్రకారం ఇమామ్ అబూ హనీఫా హజరత్ అనస్ ఇబ్ను మాలిక్ ను మరియు అనేక సహచరులను కలిసారు.

అబూ హనీఫా (ర) తమ తల్లి తండ్రుల యొక్క ఏకైక కుమారుడు. అయన యొక్క తండ్రి సాబిత్ ఒక గొప్ప దుస్తుల వ్యాపారస్తుడు. అయితే అబూ హనీఫా (ర) తన చాల చిన్న వయస్సు నుండి తమ తండ్రితో వ్యాపారం లో నిమగ్నమై ఉన్నారు. అయన (16) సంవత్సరాల వయస్సులోనే తమ తండ్రి మరణించారు. అయితే ఇమామ్ అబూ హనీఫా (ర) వ్యాపారం కోసం ఎన్నో ప్రయాణాలు చేసేవారు. అంతేగాక ఎక్కువగా ప్రజలు వారి యొక్క దుకాణమునకు వచ్చి దుస్తులు కొనేవారు. ఎందుకంటే అయన వ్యాపారం చాలా నిజాయితీగా మరియు నమ్మకంగా చేసేవారు.

అబూ హనీఫా (ర) ఎక్కువగా వ్యాపారం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఒక పర్యటలో అయన ఇమామ్ (అల్-షైబానీ) ని కలుసుకున్నారు. ఆ ఇమామ్ ఇస్లాం మతాన్ని మరింత  లోతుగా అధ్యయనం చేయమని సలహా ఇచ్చారు. ఈ ఒక్క సలహానే ఇమామ్ అబూ హనీఫా జీవితాన్ని మార్చివేసింది. అయన ఇస్లాం యొక్క గొప్ప పండితులలో ఒకరయ్యారు. అయన వేదాంత శాస్త్రం, అఖీదా, ఫిఖ్ (ఇస్లామిక్ తీర్పులు) మరియు హదీస్ (ప్రవక్త సూక్తులు) వాటిలో సహా మతం యొక్క బహుళ శాఖలలో ప్రావిణ్యం సంపాదించారు. ప్రవక్త (స) యొక్క హదీసులను మరియు ఖురాన్ (గంధాన్ని) మొత్తం చదివి కంఠస్తం చేసారు. ఇమామ్ అబూ హనీఫా (ర) ఎక్కువగా భేటీలలో పాల్గొనేవారు. వారి ముందు ఎవ్వరైన కాని ఓటమి ఒప్పుకోవలసిందే. అతి చిన్న వయస్సులోనే పెద్ద ఇమాములతో పోటీపడేవారు. అంతేగాక అయన "నాస్తికులు, ముర్తద్ద్ (అనగా ఇస్లాం మతాన్ని విడిచిపెట్టినవారు వారిని ముర్తద్ద్ అంటారు). ముఅతజిలా మరియు ఖారిజీలను కూడా తమ యొక్క తెలివి విద్య ద్వారా డిబేట్లలో ఓడించేవారు. అంతేగాక అయన తమ యొక్క ప్రాంతంలో తమ విద్యార్థులను డిబేట్లలో పాల్గొనమని ఉత్సాహపరిచేవారు.

అలాగే అయన యొక్క చిన్న వయస్సులోనే ఒక సంఘన జరిగింది. అదేమనగా కుఫా చెందిన ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ రాజు "నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికీ ఎవరైనా జవాబు ఇవ్వగలరా?" అని  ప్రకటించాడు. ఆ సమయంలో అక్కడ ఎందురో పెద్ద ప్రముఖ పండితులు ఉన్నా కూడా, ఎవ్వరు ముందుకు రాలేదు. కానీ హజరత్ అబూ హనీఫా (ర) అతి చిన్న వయస్సులోనే తమ యొక్క తండ్రి చేతివేలు పట్టుకొని ముందుకి వచ్చి, ఆ రాజు ముందర నిలబడతారు. అంతే ఆ రాజు అక్కడి ప్రజలు ఆ చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోతారు. రాజు మొదటి ప్రశ్న అడుగుతాడు.

  1. "మీ అల్లాహ్ ఇప్పుడు ఎటువైపు వున్నాడు" (అనగా అల్లాహ్ యొక్క దిశ ఇప్పుడు ఎటువైపువుంది?) అని ప్రశ్నిస్తాడు అప్పుడు అబూ హనీఫా సమయం వృధా చేయకుండానే జవాబు చెబుతారు. ముందు అయన ఒక కొవ్వొత్తి తెప్పిస్తారు. దానిని వెలిగించిన తరువాత అయన ఇలా అంటారు ఈ కొవ్వొత్తి కాంతి యొక్క ముందరి భాగం ఏదో చెప్పగలవా? అప్పుడు ఆ రాజుకి జవాబు రాదు అప్పుడు అబూ హనీఫా అంటారు ఈ కొవ్వొత్తి యొక్క కాంతి లాగే అల్లాహ్ కు దిశ అనేది ఒక వైపు లేదు ఈ కొవ్వొత్తి కాంతి లాగే అల్లాహ్ యొక్క కాంతి ప్రతివైపు వ్యాపించివుంది.
  2. అల్లాహ్ ఒక్కడేనా లేదా అల్లాహ్ పైన కూడా ఎవరైనా వున్నారా? అప్పుడు అబూ హనీఫా జవాబు ఇస్తారు: ముందు మీరు తొమ్మిది నుంచి పైకి లెక్క పెట్టండి అనంటారు. అప్పుడు ఆ రాజు లెక్క మొదలు పెడతాడు మరియు ఒకటి వరకు వచ్చి ఆగిపోతాడు. అప్పుడు అబూ హనీఫా అంటారు ఎందుకు ఆగిపోయారు? ఇంకా లెక్క పెట్టండి అని ఒకటి పైన ఇంక లెక్క లేదే అని, అప్పుడు అబూ హనీఫా చెబుతారు, అలాగే అల్లాహ్ కూడా ఒక్కడే అల్లాహ్ పైన కూడా మరొక దేవుడు లేడు! అని తెలివిగా జవాబిస్తారు. అప్పుడు ఆ రాజుకి కోపం వస్తుంది ఎందుకంటే ప్రతి ప్రశ్నలో అబూ హనీఫాతో ఓడిపోతున్నాడని. కానీ ఆయనని ఓడించాలని మూడోవప్రశ్న అడుగుతాడు
  3. ఇప్పుడు అల్లాహ్ ఏమి చేస్తున్నాడు? అప్పుడు అబూ హనీఫా ఆ ప్రశ్నకు రెండే ముక్కల్లో చాల అద్భుతమైన జవాబిసారు. "ఇప్పుడు అల్లాహ్ నీకు నా వాళ్ళ అవమానపరుస్తున్నాడు మరియు నాకు ఇంక పరువు పెంచుతున్నాడు. అలా ఆ రాజుని అబూ హనీఫా చాల తెలివిగా ఓడిస్తారు. అంతేగాక ఇమామ్ అబూ హనీఫా తమ యొక్క చిన్న వయస్సులోనే జ్ఞానపరుడు, తెలివైన వారు మరియు నిజతియపరుడు కూడా.

హజరత్ ఇమామ్ అబూ హనీఫాకు చాల ఉపాద్యుయులు వున్నారు. వారిలో ప్రముఖుడు కుఫా ఇమామ్ (అహ్మద్ ఇబ్ను అబూ సులైమాన్). తమ కాలంలో మక్కా యొక్క అత్యంత ప్రభామతమైన హదీసు పండితుడు (అతా ఇబ్ను అబీ రబ్బాహ్) ఆయన హజరత్ అబూ హనీఫా యొక్క ఉపాధ్యాయులలో కూడా వున్నారు. అంతేకాకుండా అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ (ఉమర్ (ర) యొక్క కుమారుడు) మరియు మైమునా బింత్ అల్ హరిత్ నుండి విముక్తి పొందిన బానిస అయిన అతా ఇబ్ను యాసిర్ కూడా అయన యొక్క ఉపాధ్యాయులు.

ఇమామ్ అబూ హనీఫా యొక్క విద్యార్ధుల సంఖ్య (700) కంటే ఎక్కువ, మరియు అయన యొక్క అత్యంత ప్రసిద్ధ విద్యార్థి (ఇమామ్ అబూ యూసుఫ్). అయన యొక్క విద్యార్థులు ఈ లోకంలో ఇస్లాంను పెంచడానికి ఎన్నో దేశాలను ప్రయాణించారు. ఆఫ్గనిస్తాన్, బుఖారా, పాకిస్తాన్ మరియు భారతదేశంలోకి కూడా వచ్చారు. ఇమామ్ అబూ హనీఫా తమ యొక్క జీవితంలో అనేక వివిధ పుస్తకాలు రాసారు అంతేగాకుండా అయన 40,000 పైగా హదీసులను సేకరించారు. అయన ఫిఖ్ లో ఒక మాస్అలా రాసేముందు రెండు రకాత్ నమాజ్ చదివి అల్లాహ్ తో దువా చేసి మరీ రాసేవారు.

          ఆఖరికి అబూ హనీఫా 15 రజబ్ 150, (15 ఆగస్టు,767) జైలులో తమ ప్రాణాలు విరిచారు. అయన తమ ప్రాణాలు ఎలా విరిచారంటే, 130 హిజిరి అబ్బాసిద్ కాలంలో అబూ హనీఫాకి (అబుల్ అబ్బాస్ అస్సుఫ్ఫాహ్) అనే ఒక గవర్నర్ ఆయనకి రాష్ట్ర ఖజానాల బాధ్యతను స్వీకరించమని కోరాడు. కానీ ఇమామ్ అబూ హనీఫా (ర) కి భక్తి ఎక్కువ మరియు అల్లాహ్ యొక్క భక్తి ఎక్కడ నానుంచి తక్కువైపోతుందో అని ఆ అగ్న్యాపని నిరాకరించారు. అందుకని ఆ గవర్నర్ ఆయనను జైలులో వుంచి కొరడాతో ఆయనని చనిపోయేదాక శిక్షించాడు. కానీ కొద్దీ రోజుల తరువాత జైలునుంచి విడుదల అయ్యారు. మక్కాకు వలస వెళ్లాడు, అక్కడ (అబ్బాసిద్ ఖలీఫా అల్ మన్సూర్) అధికారంలోకి వచ్చేవరకు అయన అక్కడే వున్నారు. ఆ తరువాత ఖలీఫా అల్ మన్సూర్ అధికారంలోకి వచ్చాక అబూ హనీఫా (ర) తో కలిసి ప్రధాన న్యాయమూర్తి పదివికి తీసుకోవాలని ఒక ప్రతిపాదన చేసాడు. కానీ అయన అది కూడా రద్దు చేయడంతో ఇమామ్ ను మళ్లి అరెస్ట్ చేసి కొరడా దెబ్బలు కొట్టారు.

ఇమామ్ అబూ హనీఫా 150 హిజ్రి, (769) లో (70) సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇస్లాం యొక్క ప్రముఖ పండితుడు ఇమామ్ అబూ హనీఫా తమ ప్రాణాలు కోల్పోయిన తరువాత ఆయన యొక్క జనాజా నమాజు ఆచరించడానికి మొత్తం 6 జమాత్లు హాజరయ్యాయి. అందులో మొదటి జమాతులో (50,000) యాభై వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ రోజు వరకు ఆయనను ప్రజలు గుర్తుచేస్తున్నారు మరియు అయన యొక్క మజ్హాబును కొన్ని మిలియన్లకు పైగా ముస్లింలు అనుసరిస్తున్నారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter