బాబరీ మసీదు విషయంలో జరిగిందేమిటి?
బాబరీ మసీదు కూల్చివేత ఇండియా దేశ చరిత్రలోనే మరువలేని ఓ ఘోర ఘటన. ఈ ఘటన హిందూ-ముస్లిం సోదరుల మధ్య ద్వేషపురిత విషం వెదజల్లింది. తమ స్వార్థ రాజకీయ నేపథ్యాల కోసం బాబరీ మసీదుని కొంతమంది రాజకీయ వేత్తలు దుర్వినియోగ పరచారు. 31 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వరకు అయోధ్యలోని చారిత్రక బాబరీ మసీదును మూసివేసి, 1992 డిసెంబర్ 6 న మసీదుని కొన్ని ద్వేషవాదులు పడగొట్టారు. మొఘల్ రాజయిన జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్ కాలంలో గవర్నర్ సూచన మేరకు నిర్మింపబడిన ఈ మసీదులో 1949 వరకు అజానిస్తూ ముస్లింలు అందరూ నమాజు ఆచరిస్తూ వస్తున్నారు. 421 సంవత్సరాల చరిత్ర గల ఈ మసీదులో కొంత ద్వేషవాదులు డిసెంబర్ 22-23 రాత్రిన మసీదు గర్భ భాగంలో గోపురం నేరుగా రామ విగ్రహం తో పాటు ఇతర విగ్రహాలు పెట్టి డిసెంబర్ 6 న 1992 ఆదివారం మసీదును ధ్వంసం చేశారు.
హిందూ ఉగ్రవాదుల వాదన మేరకు, ఈ మసీదు వారి దేవుడైన రామ యొక్క అసలు జన్మభూమి పై నిర్మించబడింది. ఈ వివాదంపై 1859 లో బ్రిటిష్ ప్రభుత్వం మసీదుని రెండు భాగాలుగా విడగొట్టింది. లోపలి భాగం ముస్లింలకైతే, వెలుపలి భాగం హిందువుల కోసం. 1949 లో ఒక హఠాత్ ప్రణాళిక ప్రకారం మసీదులో విగ్రహం వెలిసిందని హిందువులు వాదించారు. ఇందున దేశంలో మత కలహాలు మొదలైన కారణంగా, అప్పటి ప్రభుత్వం మసీదును మూసివేయాల్సిందిగా నిర్ణయించింది. హిందువులు వారి పథకం ప్రకారం ఒక్కొక్కడుగు ముందుకు వెళ్తూ, 1984 లో బాబరీ మసీదున ముందు స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఈ మిషన్ కి సారథిగా పైకి కనిపించింది రథయాత్ర చేపట్టిన లాల్ కృష్ణ అద్వానీయే అయినా, ఈ పన్నాగం వెనుక ఎందరో రాజకీయ కుట్ర దారులు, మత నాయకులు పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. దీని కారణంగా శాంతిభరిత భారత గాలి ద్వేష కాలుష్యానికి గురైంది. అలాగే 1991 లో ఉత్తరప్రదేశ్ లో భాజాపా ప్రభుత్వం వచ్చింది. ఇంకేముంది, హిందూ అగ్ర నేతలు తమ అశుద్ధ కుట్ర పథకాన్ని ఆచరించేందుకు అవకాశం నెలకొల్పారు. అలా 1992 డిసెంబర్ 2 న వారంతా కలిసి మసీదును పడగొట్టారు. తర్వాత హిందూ-ముస్లింల మధ్య మత కలహాలు దేశవ్యాప్తంగా భగ్గుమన్నాయి. అందులో వేలాదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశ ప్రజాస్వామ్యం గాయపడింది. *హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి, ఆపస్ మే హైఁ భాయి భాయి* అంటూ కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్న భారతీయుల చరిత్రలో మరువలేని మచ్చ పడింది. ఆ గాయం ఇప్పటికీ నయం కాలేదు.
ఆ కాలంలో హిందూ రాజకీయ అగ్రనేతలకి వ్యతిరేకంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటి ఫలితం భారతదేశ ఇతర కేసుల వలె అయింది. బాబరీ మసీదు కూల్చివేతకి 28 సంవత్సరాల తర్వాత ఆ నాయకులందరూ నిర్దోషులై స్వేచ్ఛగా బయట తిరగసాగారు. నేరస్తుల నేరాన్ని కప్పివేసి వారి వైపున సత్యవాదన కోసం అసత్య ఆధారాలు కల్పించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అధికారులు, ఆ న్యాయస్థానంలో తీర్పునిచ్చిన మూర్తుల కంటే పెద్ద దోషులు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన ఆధారాలను బట్టే న్యాయమూర్తులు తీర్పునిస్తారన్నది తెలిసిన వాస్తవమే. ఈ తీర్పుల ద్వారా, దోషులు నిర్దోషులవుతారన్న ధీమాతో నేరస్థుల బయటకి వచ్చి మరిన్ని నేరాలకు పాల్పడతారు. నేరం సహజం మరియు సాంప్రదాయంగా మారుతుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ముసుగు వెనక నుండి రేయి చీకటిలో జరిగిన కథనం కాదు. పట్టపగలు నిండు వెలుతురులో క్షమించరాన్ని నేరం. ప్రపంచం కను చూసిన సత్యం.
మందిరం-మసీదు వివాదస్పద స్థల తీర్పు కోసం కేటాయింపబడిన జడ్జ్ ల బెంచ్ అధ్యక్షత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి వహించారు. తీర్పు వెల్లడించిన స్టేట్ మెంటులో *మీర్ బఖి 1528 లో 28లో బాబరి మసీదుని నిర్మించారని, డిసెంబర్ 16, 1949 వరకు మసీదులో నమాజ్ జరిగేదని, ఆ తర్వాత అందులో ప్రవేశం బందు చట్టవిరుద్ధమని, 22 23 డిసెంబర్ 1949 న దైవ విగ్రహాలు వెలిసిందనడం అబద్ధమని, గోపురం కిందనే రామ జన్మభూమి ఉందనే వాస్తవం నిశ్చితంగా తెలియదని, 1992 లో మసీదుని పడగొట్టడం న్యాయవిరుద్ధమని, అచ్చట పూర్వం మందిరం లేదని రుజువయ్యాయి. ఇదే వాస్తవాలను నమ్మి, ఈ సాక్షాధారాల మూలంగానే ప్రధాన న్యాయస్థానం తీర్పు బాబరీ మసీదు వైపు ఉంటుందని ముస్లింలు ఆశించారు. కానీ ఆ ఆధారాలన్నిటిని లెక్కచేయకుండా ఆస్తా ఆధారంగా తీర్పు వచ్చింది. మసీదు పట్ల ముస్లింలకున్న మత్త ఆత్మీయ బంధాన్ని లెక్కచేయనేలేదు.
ఈ ఘటన జరిగి 31 సంవత్సరాలు కావస్తున్నాయి. కానీ ముస్లిముల మరియు న్యాయకోరి ముస్లిమేతరుల మనసులో ఈ గాయం ఇప్పటికీ తాజా గానే ఉన్నది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 6 న అందరి గాయాలు ఎరుపెక్కుతాయి. చరిత్రలో గడిచిన బాధాకర ఘటనలో బాబ్రీ మసీదు విషయం కూడా తలెత్తుతుంది. మసీదును కూల్చివేయడం ఓ సహజ సామాన్య ఘటన కాదు. మసీదు స్థలం, దాని గోడలు, దాని ద్వారాలు పట్ల ప్రతి ముస్లిం మనసులో గౌరవం ఉంటుంది. మసీదుని పడగొట్టడం ప్రాపంచిక ముస్లిం జనుల గౌరవ ప్రతిష్టను హతమార్చినట్టు అన్న సత్యాన్ని మరకూడదు. భవనాన్ని పడగొట్టినా, మసీదు స్థానం ఈనాటికీ కూడా బాధాకర గొంతుతో దుఃఖం వినిపిస్తూ ఉంటుంది, రక్తపు కన్నీటి బొట్టులు ప్రవహిస్తూ ఉంటాయి.
ఏక దైవారాధన కొరకు నుదుటిని వంచిన చోటు, సత్యదేవాన్ని ఆరాధించిన చోటు, విశ్వాసీయుల నమాజు ఆచరించిన చోటు, అల్లాహ్ స్మృతించిన చోటు, సుబహానల్లాహ్ అల్హందులిల్లాహ్ పలికిన చోటు, ధర్మవాక్కు వెల్లడించిన చోటు, ఇప్పుడు విగ్రహారాధనకు కైవసం అయింది. ఖురాన్ పారాయణం జరిగిన చోటు, పూజలు అర్చనలు జరుగుతున్నాయి. ఏక దైవారాధన స్థలాన్ని బహుదైవారాధన ఆచరణలు ప్రారంభమవుతున్నాయి. కచ్చితంగా బాబరీ మసీదు యొక్క ఆత్మ నిశ్శాంతి నినాదాలు పలుకుతూ ఉంటుంది. ఇది చూడడానికి నిజమైన కళ్ళు, వినడానికి శుద్ధ కర్ణలు అవసరం.
బాబరీ మసీదు కూల్చివేత ముస్లింలను మాత్రమే దెబ్బతీయలేదు, ప్రపంచంలో మనసున్న ప్రతి మనిషి గాయం అయ్యాడు. ఆంగ్లేయుల కుట్ర హింసాత్మక పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడంలో ముస్లింలు అపార పాత్రలు పోషించారు. ఇది నిరాకరించని సత్యం. స్వాతంత్రం తరువాత భారతదేశంలో స్వేచ్ఛగా తమ మతాదేశాల అనుసారం జీవించాలని, తమ నాగరికత, సాంప్రదాయంతో ఉండవచ్చని కలలుగన్నారు. ఎవరు అడ్డురారు, ఎవరు తమ ప్రార్థనని ఆపరని భావించారు. మైనారిటీల పాత్రధారణలో తమ వైజ్ఞానిక సాంపత్తిక సంస్థలను కూడా స్వేచ్ఛగా స్థాపించవచ్చని నమ్మారు. వీటన్నిటికీ రాజ్యాంగమే సాక్ష్యం. కానీ కాలానుసారం, ఆ కలలన్నీ ఆవిరైపోయాయి. ఈ దేశం హిందూ రాష్ట్రం అవ్వాలని ముస్లింల తమ ప్రాణాన్ని త్యాగం చేయలేదు.
ఇస్లాం మరియు ఇస్లాం యొక్క చిహ్నాలను ముస్లింలు తమ ప్రాణం సమానంగా చూసుకుంటారు. అలాగే దేశ రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తారు. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో 1947 ఆగస్టు 15 స్థాపించబడ్డ ప్రార్థనా మందిరాలకు రక్షణ కలుగుతుందని భారత రాజ్యాంగంలో లిఖించబడింది. స్థాపిత మందిరాలను హాని కల్పించకూడదని ప్రకటింపబడింది, కానీ అవన్నీ గతించిన ఘటన ప్రవాహాల్లో కొట్టుకుపోయాయి.
ఇప్పుడు భారతదేశంలో రెండవ స్థానంలో అత్యధిక మైనారిటీ కలిగిన ముస్లింలు విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. జీవితంలోని అత్యధిక కష్టాల బాధితులయ్యారు. ఇందులో బాధ కలిగించే విషయం ఏమిటంటే, శాంతి భద్రతలను నడిపించాల్సిన అధికారులే ఎన్నో ఘోర ఘటనలకు కీలక కారకులయ్యారు. హింస, అన్యమత ద్వేషం, అజ్ఞానం, వైరం, శత్రుత్వానికి అనుకూలంగా ఘటన సంభవించడం నిజంగా మానవత్వానికే సిగ్గుచేటు. బుల్డోజర్ల రాజకీయం సకల జనాభాన్ని నాశనం చేస్తుంది. అందులో మసీదులు, మద్రసాలు, మత విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్ళు కుహాన వార్తలు చేరువేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని వర్గాలైతే *మీ మసీదుని వారికి అప్పజేసేయండి* అని జిత్తుల మారి సలహాలు ఇస్తున్నారు. చివరికి ప్రతి చోట ద్వేష అగ్ని జ్వాలలు పగిలి ప్రజల్లో శత్రుత్వం నింపుతున్నాయి.
ఇదిలా ఉండగా 22 జనవరి 2024 న బాబరీ మసీదు స్థలంలో రామ మందిరం ఉద్ఘాటన సభ జరగనున్నది. అది కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా. ముస్లింల విషయం అటుంచితే, అన్య ముస్లింలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఈ రామ మందిర ప్రారంభోత్సవం రామదైవం మీద ప్రేమతో కాదు, రాజకీయ నేపథ్యం కోసం అనే. కాంగ్రెస్ అగ్ర నేతలు *ఈ రామ మందిర నిర్మాణమే దేశ సమస్యనా? విద్య, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం వగైరా వంటివి వీరి దృష్టిలో దేశ సమస్యలు కావా? అని ప్రశ్నలు వేస్తున్నారు. *రామ దర్శనానికి అప్పుడప్పుడే మందిరానికి వెళ్తాం. మాకు ఏ దైవం మీద ఎక్కువ మక్కువ లేదు* అని చెప్పిన రాజకీయ నేతలు ఇప్పుడు ఆ ఆలయాన్నే కేంద్రీకరిస్తున్నారు. పట్టణంలోని ప్రజలు 40 శాతం భాజపాకు ఓట్లు వేస్తే, 60 శాతం వారికి వ్యతిరేకంగా వేస్తున్నారు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇస్లాం శాంతి, సహన ధర్మం. ఈ ధర్మం ప్రతి మనిషి యొక్క ప్రాణ, గౌరవ, రక్షణకి ప్రాధాన్యత ఇస్తుంది. ఇస్లాం కాదనుకున్నా, ధర్మం నియమం ఏమిటంటే, దోషికి తనకు తగిన శిక్ష పడాల్సిందే. అప్పుడు ఇతరులు ఆ నేరం చేయడానికి వెనుకడుగు వేస్తారు. ఒక శాంతిభరిత సమాజానికి మూల చిహ్నం. ద్వేషం, వైరం లేకుండా సన్నిహితంగా మంచిగా కలిసిమెలిసి ఉండడమే అసలైన సామాజిక జీవితం.
ఇప్పుడు ముస్లిం సమాజం ఈ దేశంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని తొలగించాలంటే, అల్లాహ్ పై దృఢవిశ్వాసం మరియు పరస్పర ఐక్యత వల్లనే సాధ్యమవుతుంది. మసీదులు నిర్మింపబడినప్పుడు, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి వాటి స్థానం భూమి నుండి ఆకాశం వరకు మసీదు పేరులోనే చివరి కాలం వరకు ఉంటుంది. వాటిని ఎచ్చటకు బదిలీ చేయడం గాని మార్పిడి చేయడం గాని కుదరదు.
నిశ్చయంగా అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించే వారు, నమా'జ్‌ను స్థాపించేవారు, 'జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిద్‌లను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు! (తౌబా, 18). అల్లాహ్ మస్జిదులలో ఆయన నామ స్మరణం నిషేదించి వాటిని నాశనం చేయ టానికి పాటుపడే వారికంటే ఎక్కువ దుర్మార్గు లెవరు? అలాంటి వారు వాటి (మస్జిదుల)లో ప్రవేశించ టానికి అర్హులుకారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. (అలా బఖరా, 114)
బాబరీ మసీదు షహాదత్ ముస్లిం సమాజానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే, ప్రతి ఒక్కరు మసీదుని ఆదరించాలి. అందులోనే ఆరాధించాలి. మసీదుకు ఇవ్వాల్సిన హక్కులు వాటికి కల్పించాలి. వాటిని సమాజం యొక్క ముఖ్య భాగంగా పరిగణించాలి. ఆ మసీదులే ఇస్లామిక మత విద్యాభ్యాసకు పునాదులు, సంస్థలు, భవనాలు. దీని ప్రాముఖ్యత గొప్పతనం తెలుసుకోవాలంటే 1400 సంవత్సరాల ముందు ప్రవక్త గారు మొదటగా నిర్మించిన మసీదును దర్శించాలి. పైకి మసీదు నమాజ్ ఆచరించడానికి అయినా, అదే మసీదు సామాజిక, వ్యక్తిగత, ఆర్థికపరంగా, సాంఘిక, సామూహిక, రాజకీయ విషయాలన్నిటికీ మూలం మరియు పరిష్కారం. ప్రతి ఒక్కరు మసీదుని గౌరవించేలా దానికి రక్షణ కల్పించేలా వాటి వల్ల అందరికీ ఉపయోగ కలిగేలా చూడాలని అల్లాతో ప్రార్థిస్తూ...