సమస్త కేరళ జమీఅతుల్ ఉలమాఅ్ యొక్క చిరుపరిచయం.

కేరళ, భారతదేశం యొక్క ఓ చిన్న రాష్ట్రం. దేశంలో జనాభా ప్రకారం చూసినట్లయితే ముస్లింలు ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నారు. వారిలోనూ ఎక్కువగా సున్నీ ముస్లింలు ఉన్నారు. ఆ సున్ని ముస్లింల ఒక సమూహం ఉంది, అదే నేడు సమస్త కేరళా జమీఅతుల్ ఉలమాఅ్ యొక్క పేరుతో గుర్తుంపుపొందింది. అహ్లే సున్నత్ యొక్క సంరక్షణ, ఇస్లామిక వద్య విస్తరణ ఉద్దేశంతో ఈ సంస్థ యొక్క స్థాపన జరిగినది.

అల్హందులిల్లాహ్! 1926లో యమన్ వాసులు మరియు కొందరి మహా పండితుల ఆధ్వర్యంలో దీని యొక్క శంకుస్థాపన పెట్టడం జరిగింది. ఇంచుమించు ఒక్క శాతంతో మలబార్ (అనగా కర్ణాటకలోని ఒక కొండ ప్రాంతం) మరియు మొదలగు రాష్ట్రాలలో ధర్మబద్ధక, విజ్ఞానబద్ధక మరియు వారి చేత దక్కిన సేవల చేత పూర్తి అయ్యింది. దీని యొక్క సేవలు చాలా వరకు విస్తరించాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీ మరియు కాశ్మీర్ వరకు విద్యాబోధన సేవలు విస్తరించబడ్డాయి. ఈ సేవ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా నడుస్తుంది. ప్రత్యేకంగా అరబ్ దేశాల్లో భారత ముస్లింలు ఉన్న ప్రదేశాలలో ధర్మానికి మరియు మతానికి తగ్గ దిశలలో న్యాయకత్వం వహిస్తున్నారు. అలాగే ధర్మపు విద్య అనగా (దీనీ తాలీమ్) మదర్సాలు నిలవడానికి చాలా సుదుద్దేశంతో మద్దతు ఇవ్వడంలో సమస్తా సఫలమౌతుంది.

అల్హందులిల్లాహ్! ఈ శతవార్షికతో సమస్త, కేరళలో మరియు ఇతర రాష్ట్రాలలో ధర్మపు సేవలంద జేసినందున తమకై మహా ప్రతిష్ఠ నిలపెట్టుకుంది. మక్తబులను స్థాపన ఈ వంద సంవత్సరాలలో సమస్త యొక్క అన్నిటికంటే విజయవంతమైన సేవ! అది కూడా ఒక వందలో, వేలల్లో కాదు. ఏకంగా 10,000 కన్నా ఎక్కువగా మకాతిబ్లను నియమించారు. అవి ప్రభుత్వ పాఠశాలల కన్నా ఎంతో మిన్నగా నడుస్తున్నాయి. ఈ విద్యారంగం చేత దాదాపు ఇందులో 10 లక్షల కన్నా ఎక్కువే విద్యార్థులు ధార్మిక విద్యనభ్యసిస్తోంది. ఒక లక్షకు పైచిలుకు పండితులు ఈ ధార్మిక విద్యను విస్తరించడంలో నిమగ్నలై ఉన్నారు. అలాగే దీని ప్రకారం కొన్ని వేరువేరు కమిటీలు ప్రతి సమయాన  వారి బాధ్యతలో నిమగ్నలై ఉంటారు.

అల్హందులిల్లాహ్! ధార్మిక విద్య (దీని తాలీమ్) కొరకు సమస్త వద్ద చాలా వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి. అందులో జామియా నూరియా కళాశాల, దారుల్ హుదా విశ్వవిద్యాలయం, వాఫీ సంస్థ, జామియా దారులు ఇస్లాం  సంస్థ మొదలగునవి..... అగ్రస్థానాలలో ఉన్నాయి. ఈ పూర్తి విద్యారంగాలలో ఒక లక్షకు పైనే విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ తమ వైజ్ఞానిక దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇవే కాకుండా 200 కు పైగానే చిన్న పెద్ద కళాశాలలు మరియు మదారిస్లు కేరళ లోపల వెలుపల ధార్మిక విద్యను విస్తరించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.

ఒకవేళ వాటిలో కేవలం దారుల్ హుదా వ్యవస్థను చూసినట్లయితే, అల్హందులిల్లాహ్! కేరళలోని పలు జిల్లాల్లోనే 30 కు పైగానే సంస్థలు ఉన్నాయి. బాహ్య కేరళలో కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, బెంగాల్ మరియు మహారాష్ట్ర లోని సంస్థలు నిరంతరం విద్యాసేవను అందించడంలో నిమగ్నులై ఉన్నాయి.

ఇన్షా అల్లాహ్ ! ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరలో దారులుగా శాఖ స్థాపింపబడుతుంది. సమస్త వద్ద ఇస్లాం యువకులకు, మంచి క్రమశిక్షణ కొరకు మంచి పాఠశాల వ్యవస్థ ఉంది మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థ మొదలగునవి..... ఇవి కేరళ యొక్క అనేక ప్రాంతాలలో భారీ సంఖ్యలో నడుస్తున్నాయి.

సమస్త ఆధ్వర్యంలో యువకుల కొరకు సున్నీ యువజన సంఘం  (SYS)  లేదా సున్ని స్టూడెంట్ ఫెడరేషన్ (SKSSF), మక్తబులలో చదివించే పండితుల కొరకు ‘జమీ అతుల్ ముఅల్మీన్’ సెంట్రల్ కౌన్సిల్ లో చదివే బాలుల కొరకు సమస్త కేరళ సున్ని బాల వేదిక (SKSBV), దీని మదర్సాలలో చదివించే పండితుల కొరకు ‘జమీతుల్ ముదిరిసీన్’, మసీదులలో సేవ చేసే ఉలమాల కొరకు ‘ జమీతుల్ ఖుత్బాఅ్ మరియు సెంట్రల్ ఫతవా కమిటీ  మొదలగునవి..... ఇదంతా నడపడానికి సమస్త ఇస్లామి తాలిమి బోర్డు మరియు మసీదుల అభివృద్ధి కొరకు సున్నిమహాల్ ఉన్నాయి.

సమస్త జమీయత్ ఉలమా యొక్క పూర్తి ఆధ్వర్యంలో ధార్మిక సేవ నిరంతర సమయాన నడుస్తూ ఉంటుంది. అందులో SKSSF కింద అల్హందులిల్లాహ్ 14 మంది ముఖ్యులు. వారిలో విఖాయా గారి బృందం ఎల్లప్పుడూ సామాజిక సేవలో పనిచేస్తూ ఉంటుంది.

ఈ వంద సంవత్సరాలలో సమస్త ఉమ్మతే ముస్లిమ కొరకు విద్య చేత వారి కళ్లను తెరిపించింది. ఇందుమూలంగా! వంద సంవత్సరాలును పూర్తిచేసిన సందర్భంగా, కర్ణాటక యొక్క రాజధాని అయిన బెంగళూరు మహానగరంలో దీని యొక్క మొట్టమొదటి ప్రారంభోత్సవ మహాసభ జరగుతుంది.

ఆ అల్లాహ్ తబారక్ వతఆల, అందరి సేవలను ప్రళయ దినం వరకు జారీ ఉంచు గాక! వారి సేవలకు గొప్ప పుణ్యఫలితాన్ని ప్రసాదించుగాక!

ఆమీన్!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter