సమస్త: కేరళలోని ఇస్లామిక విద్యకు మార్గదర్శి

ఇస్లాం మరియు కేరళకు మొదటి నుండే సముద్ర వాణిజ్యం ద్వారా అరేబియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశంలోని ఇతర ముస్లింలలాగా కేరళ ప్రజలపై ఇండో - పర్షియన్ యొక్క ఇస్లామిక ప్రభావాం కలగ లేదు మరియు వీరందరూ షాఫీ మస్లక్ నీ పాటించేవారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, ఉర్దూ భాష ముస్లిం గుర్తింపుగా పరిగణించ బడుతున్నప్పటికీ, కేరళలోని ముస్లింలు మరియు  ముస్లిమేతర సోదరులు అందరూ మలయాళంలోనే మాట్లాడతారు. కేరళలోని ముస్లింల జీవనోపాధి తొలినాళ్ల నుంచి వ్యవసాయం మరియు చేపలు పట్టెవంటి వ్యాపారాలతో గడిచేది.

15 వ మరియు 16 వ శతాబ్దాలలో మలబార్ తీరాలకు చేరుకున్న అరబ్, యెమెన్ జాతికి చెందిన సయ్యద్ కుటుంబాలు, సూఫీ మహానుభావులు మరియు గొప్ప పండితుల సమర్ధవంతమైన నాయకత్వం పొందడం కేరళలోని ముస్లింలు ప్రజల యొక్క సౌభాగ్యం. 19 వ శతాబ్దం చివరి వరకు ముస్లిం ప్రజలలో సైద్ధాంతిక విభేదాలు లేవు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక నాయకత్వం మాప్పిలా ముస్లింలకు ప్రాథమిక విద్య కోసం ఓతుపల్లిలు, ఉన్నత విద్య కోసం మసీదులలో దర్సులు మరియు ఇస్లామిక ప్రసంగాల సెషన్ల ద్వారా ఇస్లామిక విజ్ఞానాన్ని అన్ని వయసుల వారికి అందించడానికి వివిధ పద్ధతులను అభివృద్ధి చేసింది.

సమస్త జననం

ఆధునికవాద మరియు సంస్కరణవాద ఉద్యమాలు త్వరలో కేరళలో‌ పెరగడం ప్రారంభించాయి. ముస్లిం నాయకత్వం ఈ ప్రాంతం యొక్క స్వాభావిక సాంప్రదాయ ఇస్లామిక్ సంస్కృతి, వారసత్వం మరియు ఆచారాలను చెక్కుచెదరకుండా ఉంచడానికి ఇటువంటి పోకడలను నిరోధించాల్సిన అవసరం ఉందని భావించి  సయ్యద్‌లు, సూఫీలు మరియు ఇతర పండితులతో సమస్త ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తరువాత సమస్త ఇస్లామిక విద్య మరియు ముస్లిం సమాజం యొక్క అవకాశాలను పెంపొందించడానికి అనేక ఉప-సంస్థలను ఏర్పాటు చేసింది. అటువంటి అన్ని ప్రధాన నిర్ణయాలను ఆ కాలంలోని 40 మంది ప్రముఖ పండితులతో కూడిన ఒక కీలక బృందం చేత నియంత్రించబడుతాయి. ఈ కౌన్సిల్‌ను 'ముషావరః' పేరుతో పిలుస్తారు.

ప్రాథమిక ఇస్లామిక విద్యను అందించడంపై దృష్టి సారించడానికి ప్రత్యేకంగా ఒక ఉప సంస్థ అవసరాన్ని ముందే ఊహించి, సమస్త కేరళ ఇస్లాం మత విద్యాభ్యాస బోర్డు [SKIMVB] ని ఏర్పాటు చేసింది. ఈ బోర్డు దాని ప్రథమ రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా మదర్సాలను ఏర్పాటు చేయాలనే దాని ప్రధాన లక్ష్యాన్ని నిర్వహించింది. 12 వ తరగతి వరకు విద్యార్థులకు సిలబస్‌ను తయారు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను క్రమబద్ధీకరించారు. విద్యార్థులు వారి సాధారణ పాఠశాల విద్యతో పాటు మదర్సాలకు హాజరు కావడానికి సమయాన్ని కేటాయించారు.

కేరళ అంతటా మదర్సాల నెట్‌వర్క్

1952 లో సమస్త మదర్సా వ్యవస్థను ప్రారంభించింది. ఆ సంవత్సరం 10 మదర్సాలు సమస్తలో చేరాయి.‌ బోర్డు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మదర్సా గుర్తింపు కోసం దరఖాస్తులను పరిశీలించడానికి మరియు సమీక్షించడానికి నెలలో ప్రతి రెండవ శనివారం సమావేశాన్ని నిర్వహిస్తుంది. 1956 లో ఈ సంఖ్య [149]కు, 1961- [746] కు, 1966 – [1838]న, 1971 – [2694] కు, 1976 – [3586] కు, 1986 –కు పెరిగింది కాబట్టి, ప్రతి సంవత్సరం గుర్తింపు పొందిన మదర్సాల సంఖ్య అప్పటి నుంచి పెరుగుతూ వచ్చింది. [5648], 1991- [6440], 1996 – [7003], 2001 – [7865], 2008 – [8713], 2009 – [8781], 2011- [9097], మరియు 2024 లో ఇప్పటికే 10 వేల పైనే పెరిగినాయి. ఈ గుర్తింపు పొందిన మదర్సాలన్నింటికీ కనీసం 5 వ తరగతి వరకు తరగతులు ఉన్నాయి. వాటిలో 4886 మద్రసాలు 7 వ తరగతి వరకు, 1493 మదర్సాలలో 10 వ తరగతి వరకు తరగతులు ఉన్నాయి. అలాగే 312 మదరసాలు 12 వ తరగతి ఇస్లామిక విద్యను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

మదరసాల వైపు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి

మదర్సాలలో ఇస్లామిక్ విద్యతో పాటు మదర్సా విద్యార్థులకు పాఠశాల ట్యూషన్లు, కంప్యూటర్ మరియు అబాకస్ శిక్షణను అందించడం ప్రారంభించాయి. ఈ మదర్సాలలో కొన్ని తమ ఇస్లామిక అధ్యయన కేంద్రాలకు మూలంగా తీసుకొని పాఠశాలలను ప్రారంభించడం వంటి ప్రయత్నాలను కూడా చేపట్టాయి. వారి విద్యార్థులకు మతపరమైన మరియు కళలు, సైన్స్, మానవతా మరియు వాణిజ్య విద్యను అందించడంలో విజయవంతమయ్యాయి.

సిలబస్

పరీక్షలు రంజాన్‌కు ముందు మాసంలో నిర్వహించబడతాయి. 40 రోజుల రంజాన్ సెలవుల్లో, పేపర్‌లను సంబంధిత ముఅల్లిమ్‌లు [ఉపాధ్యాయులు] మూల్యాంకనం చేసి, విద్యార్థులు అర్హులని గుర్తించినట్లయితే తదుపరి తరగతులకు పదోన్నతి పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించే ఇస్లామిక విద్య నాణ్యతను అంచనా వేయడానికి SKIMVB 5 వ, 7 వ మరియు 10 వ తరగతులలో కేంద్రీకృత పబ్లిక్ బోర్డ్ పరీక్షలను నిర్వహిస్తుంది.

బోర్డు ఇప్పటివరకు దాదాపు 27 లక్షల 5 వ తరగతి సర్టిఫికెట్లు, 10 లక్షల 7 వ తరగతి, 1,30,000 – 10వ తరగతి మరియు దాదాపు 2600 12 వ గ్రేడ్ సర్టిఫికెట్లను జారీ చేసింది.

5 వ తరగతి వరకు విద్యార్థులకు SKIMVB సిలబస్ ఖురాన్ హిఫ్జ్, థాజ్‌వీద్, ఫిఖ్, అహ్లాఖ్, తరీహ్, అఖీదా మరియు లిసానుల్ ఖురాన్ వంటి సబ్జెక్టులను కవర్ చేస్తుంది. 7 వ తరగతి నాటికి తజ్‌వీద్ మరియు అఖీదా సిలబస్ నుండి తీసివేయబడినందున సబ్జెక్టుల సంఖ్య కుదించబడుతుంది. 10 మరియు 12 తరగతులకు విద్యార్థులు ఫిఖ్, తఫ్సీర్, అఖ్లాఖ్ మరియు లిసానుల్ ఖురాన్ నేర్చుకోవాలి. గత రంజాన్ నాటికి, 11, 38, 816 మంది విద్యార్థులు సమస్త ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన మదర్సాలలో చదువుతున్నారు. ఈ విద్యార్థులకు బోధించే బోర్డు కింద 84,417 మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారు.

పనితీరు, నిర్మాణం

విద్యా పరిమానాలను పరిశీలించడానికి, ముఅల్లీమ్‌లకు [ఉపాధ్యాయులకు] మరియు మదరసా కమిటీకి సిఫార్సులను అందించడానికి, మదర్సాలను సందర్శించడానికి సమస్త ముఫత్తిష్లను [ఇన్‌స్పెక్టర్లను] నియమించింది. వీరు ప్రతి మదర్సా పనితీరుకు సంబంధించి ఒక విశ్లేషణాత్మక నివేదికను SKIMVB కి అందిస్తారు. దీనితో సమస్త మరియు SKIMVB లను ఏర్పాటు చేయడం ద్వారా బలమైన నైతిక నేపథ్యం మరియు మతపరమైన విలువలతో అభివృద్ధి చెందిన ముస్లిం సమాజం కావాలని గొప్పలు కన్న కలలు ఎంతవరకు విజయవంతమయ్యాయి అనేది తెలుస్తుంది. సమస్త ముఅల్లీమ్‌లకు ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి కూడా శ్రద్ధ తీసుకుంది. తద్వారా వారిని సమర్థవంతమైన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఈ విధులను నిర్వహించడం కోసం సమస్త వంద మందికి పైగా ముఫఫత్తిష్‌లను, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరియు వారికి ఖురాన్ పఠన ఉపన్యసాలను అందించడానికి ట్యూటర్‌లను నియమిస్తుంది.

ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా సమస్త కేరళ జమ్‌ఇయ్యతుల్ ముఅల్లిమీన్ బోర్డు సెంట్రల్ కౌన్సిల్ [SKJMCC] మరియు సున్నీ బాల వేదిక [SBV] ఆధ్వర్యంలో వేర్వేరు సంఘాలు కలిగి ఉన్నాయి. SKJMCC వారి సంక్షేమ ప్రాజెక్ట్‌లు మరియు సేవా ప్రయోజన పథకాలు [14 ప్రయోజన పథకాలు మరియు 6 సంక్షేమ నిధులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి] ద్వారా పేద ఉపాధ్యాయ సంఘానికి సమర్ధవంతంగా మద్దతునిస్తోంది. SKJMCC మహిళా షరియా కళాశాలను ఏర్పాటు చేసింది. SSLC [10 వ తరగతి పాఠశాల] ఉత్తీర్ణులైన బాలికల కోసం ఐదు సంవత్సరాల కోర్సులను అందిస్తోంది.

ప్రాముఖ్యత

కేరళ ముస్లిం మహల్‌లు [మసీదు, మదర్సా మరియు ఈ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రాంతీయ లేదా గ్రామ కమిటీలు] యుగయుగాల నుండి పూర్తిగా సమస్తా ఆధీనంలో ఉన్నాయి. అనేక వర్గాలు ముస్లిం సమాజంలో తరువాత పుట్టుకొచ్చినప్పటికీ మరియు ముస్లిం సమాజాన్ని సంస్కరించడంలో చురుకుగా పనిచేస్తున్నాయి. మరికొందరు ఈ సంస్కరణవాద ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకించడానికి సమూహాలను ఏర్పరుచుకున్నారు. సమస్త అనేక పగుళ్లు లేకుండా మహల్ వ్యవస్థపై తమ నియంత్రణను చెక్కుచెదరకుండా ఉంచడంలో విజయవంతమైంది. కాబట్టి కేరళలో ఇస్లామిక విద్య ఎక్కువగా SKIMVB యొక్క దార్శనిక దశలు మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంది. ఈ విధంగా సమస్త సంఘం కేరళలోని ముస్లింల కోసం విద్యారంగం యొక్క దశ, దిశ రెండూ మారుస్తుంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter